Latest Updates
-
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే..
Relationship Tips: మీ భాగస్వామిని ఇలా ప్రేమలో పడేస్తూ ఉండండి
ప్రియమైన, ముఖ్యమైనవారికి కృతజ్ఞతలు ఎలా చెబితే ఆ సంబంధం మెరుగుపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యమైన వారిని, ప్రియమైన వారిని ప్రశంసించడం ఏదైనా సంబంధంలో చాలా కీలకం. అది ఆరోగ్యకరమైన, సంతృప్తికరమైన సంబంధానికి ముఖ్యం కూడా. మీరు చూపించే దయ, కృతజ్ఞత వల్ల ఎదుటివారు చాలా సంతోషంగా ఫీలవుతారు. మీరు వారికి ఇచ్చే ప్రాధాన్యత ఏమిటో వారికి తెలుస్తుంది.

పెళ్లయిన తర్వాత లేదా పెళ్లి కాకముందు అయినా సరే మీ భాగస్వామిని గౌరవించడం, ప్రశంసించడం, కృతజ్ఞత చూపడం, వారి మాటలు వినడం, వారి అవసరాలను తెలుసుకుని నడుచుకోవడం వల్ల బంధం బలోపేతం అవుతుంది. ప్రియమైన, ముఖ్యమైనవారికి కృతజ్ఞతలు ఎలా చెబితే ఆ సంబంధం మెరుగుపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ధన్యవాదాలు చెప్పండి:
కృతజ్ఞతా భావాన్ని వ్యక్తపరచడం అనేది ప్రశంసలను చూపించడానికి సులభమైన అలాగే శక్తివంతమైన మార్గం. చిన్న చిన్న పనులకు కూడా భాగస్వామికి థ్యాంక్స్ చెప్పండి, టీ, కాఫీ, ఏదైనా బ్రేక్ ఫాస్ట్ చేస్తే బాగుందని ప్రశంసించండి. ఇవి చాలు మీకు వారంటే ఎంత ఇష్టమో చెప్పడానికి.. మీపై వారికి సధాభిప్రాయాన్ని కలిగించడానికి.

సర్‌ప్రైజ్ చేయండి:
భాగస్వామిని అప్పుడప్పుడు సర్‌ప్రైజ్ చేస్తుండాలి. దీని వల్ల వారంటే మీకెంత ప్రేమో తెలుసుకుంటారు. మీరెచ్చే సర్‌ప్రైజ్ చిన్నదా, పెద్దగా, ఎంత విలువైనది అనేది ముఖ్యంగా కాదు. మీ ప్రేమను వ్యక్తం చేయడానికి అదో మార్గంలా మాత్రమే చూండిడి.

చెప్పేది వినండి:
ఏదైనా ఆరోగ్యకరమైన సంబంధంలో వినడం అనేది ఒక ప్రాథమిక అంశం. మీ భాగస్వామి వారి ఆలోచనలు, భావాలను వినడానికి సమయాన్ని వెచ్చించడం చాలా కీలకం. వారికి మీరెంత ప్రాధాన్యత ఇస్తున్నారో ఇది చెప్పకనే చెబుతుంది.

శారీరక ప్రేమ చూపించండి:
ప్రేమను ఎలాగైనా వ్యక్తం చేయవచ్చు. మాటలు, సంజ్ఞల ద్వారా కూడా చెప్పొచ్చు. అయితే ఇందులో అన్నింటికంటే ఎఫెక్టివ్ గా ఉండేది మాత్రం స్పర్శ. వారిని తాకి, కౌగిలించుకుని, ముద్దు పెట్టుకుని ప్రేమను వ్యక్తం చేయడం రొమాంటిక్ గా ఉంటుంది.

ఏదైనా వంట చేయండి:
మీ భాగస్వామి కోసం మీరు స్వయంగా కూరగాయలు కోసి వంట చేయడం చాలా అద్భుతమైన ప్రేమ వ్యక్తీకరణ మార్గం. మీరు వండే వంటకం ఫ్యాన్సీ వంటకం కావాల్సిన అవసరం లేదు.

అవసరాలు, ఆసక్తులు తెలుసుకోండి:
మీ భాగస్వామి ఇష్టాలు, ఆసక్తులు, కోరికలు, అవసరాలు తెలుసుకోండి. వారు వాటిని అందుకోవడానికి మీరు సాయం చేయండి. వారి ఆశలు, ఆకాంక్షలు అందుకోవడంలో మద్దతునివ్వండి, నిరంతరం ప్రోత్సహించండి.

అభినందించండి:
మీ భాగస్వామి ఏదైనా పని చేస్తే దానిని అభినందించండి. వారిని ప్రశంసించండి. ఆ అభినందనలు కూడా వాస్తవంగా ఉండేలా జాగ్రత్త పడండి. మనస్ఫూర్తిగా, నిజంగానే అభినందిస్తున్నారని వారు నమ్మేలా అభినందించండి.



Click it and Unblock the Notifications