Latest Updates
-
పెళ్లి కాని ప్రసాద్ లు చూస్తే ఏడ్చేస్తారు.. కుక్కను పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చిన బ్యూటీ! -
నాన్ వెజ్ ని మించిన రుచి, ఆరోగ్యం కూడా..చపాతీ, రైస్ లోకి కిర్రాక్ అనిపించే గోంగూర సోయా చేసుకోండిలా.. -
రాజస్థాన్ ఫేమస్ కార్న్ ఢోక్లా..బరువు తగ్గాలనుకునేవాళ్లకి ఇది బెస్ట్! -
గుడ్డు పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ ఎటాక్ వస్తుందా? డాక్టర్ విక్రాంత్ సింగ్ ఏమంటున్నారంటే.. -
ఈ ఒక్క పొడి ఉంటే చాలు..జీవితంలో హాస్పిటల్ కి వెళ్లాల్సిన పనే ఉండదు..అన్నం, టిఫిన్స్ లోకి సూపర్ -
అబ్బాయి వర్జిన్ కాదని పెళ్లి రద్దు చేసుకున్న యువతి..అసలు నువ్వు వర్జినేనా అంటూ.. -
100 ఏళ్లు బతికించే హెల్తీ బ్రేక్ ఫాస్ట్..రోజుకి ఒక గిన్నె తింటే బరువు ఇట్టే తగ్గిపోతారు..ఎలా చేసుకోవాలంటే.. -
హోటల్ స్టైల్ ఇడ్లీ కారం పొడి..బ్రేక్ ఫాస్ట్ లోకి చట్నీ కూడా వద్దంటారు..ఇంట్లోనే ఇలా చేసుకోండి.. -
కిడ్నీలు పాడవడానికి ముందు కనిపించే ముఖ్యమైన లక్షణాలు ఇవే -
ఇడ్లీ,దోశ,చపాతీల్లోకి కేక పుట్టించే చికెన్ నిర్వాణ..బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు
హలో లేడీస్, మీ భర్తలను ఇలా కొంగుకు కట్టేసుకోవచ్చు
మీ దాంపత్య బంధం సాఫీగా సాగడానికి ప్రతి మహిళ తన భర్తతో ప్రేమతో నడుచుకోవాలి. ఇంకా ఏమేం చేస్తే దాంపత్య బంధం బాగుంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఒక సంబంధం విజయవంతం కావాలంటే భార్యాభర్తలు ఇద్దరూ ఎంతో కృషి చేయాల్సి ఉంటుంది. గొడవలు జరుగతూ ఉంటాయి, కలహాలు సాధారణమే, అయితే వాటిని ఎలా పరిష్కరించుకుంటారనే దానిపై ఆ బంధం ఆధారపడి ఉంటుంది. సంబంధంలోని స్పార్క్ను సజీవంగా ఉంచడానికి ఇద్దరూ కొంత ప్రయత్నం చేయాలి.

మీ దాంపత్య బంధం సాఫీగా సాగడానికి ప్రతి మహిళ తన భర్తతో ప్రేమతో నడుచుకోవాలి. ఇంకా ఏమేం చేస్తే దాంపత్య బంధం బాగుంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రశంసించండి:
మీరు భర్తతో ఉండటానికి మీరెంత బాగా ఫీలవుతున్నారో మాటల ద్వారా చెప్పండి. చిన్న చిన్న పనులకు కూడా ప్రశంసించాలి. వారు చేసే పనులకు కృతజ్ఞత చెప్పాలి. వారి సహకారాన్ని విలువైనదిగా భావిస్తారని మీ భర్తకు తెలియజేయాలి. మీ కోసం, మీ కుటుంబం కోసం వారు చేసే పనికి మీరెంతగా అభినందిస్తున్నారో చెప్పండి. అతని కష్టానికి సానుభూతి వ్యక్తం చేయండి.

డైట్ నైట్లను ప్లాన్ చేయండి:
భర్తతో గడిపేందుకు సమయాన్ని కేటాయించండి. అది డిన్నర్ డేట్ అయినా, సినిమా నైట్ అయినా లేదా వారాంతపు సెలవు అయినా పర్లేదు. ఇద్దరికీ మళ్లీ కనెక్ట్ అవ్వడానికి, ఒకరి కంపెనీని మరొకరు ఆస్వాదించడానికి అవకాశాన్ని ఇస్తుంది.

అతని మాట వినండి:
భర్తతో వ్యవహరించడానికి ముఖ్యమైన మార్గాల్లో ఒకటి మంచి శ్రోతగా ఉండటం. అతని మనసు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. వారు ఏం చెబుతున్నారో శ్రద్ధగా వింటే వారి మనసు అర్థం చేసుకోవడం సులభమవుతుంది.

శారీరక భాషతో మాట్లాడండి:
శారీరక స్పర్శ మీ భర్తతో మీ భావోద్వేగ బంధాన్ని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. ముట్టుకోవడం, కౌగిలించుకోవడం, ముద్దు పెట్టుకోవడం లాంటి శారీరక భాష ద్వారా ప్రేమను వ్యక్తం చేయాలి. వారితో కనెక్ట్ అయ్యేందుకు సహాయపడతాయి.

అతని అభిరుచులకు మద్దతునివ్వాలి:
మీ భర్తను తన అభిరుచులను కొనసాగించమని ప్రోత్సహించండి. అతను ఏ పని చేస్తే ఆనందిస్తాడో దానినే చేయమని చెప్పాలి. వారి ఆసక్తులు, ఇష్టాల గురించి తెలుసుకుని మెలగాలి. ఇది అతనికి ప్రశంసలు, విలువైన అనుభూతిని కలిగిస్తుంది. జంటగా మీ బంధాన్ని బలోపేతం చేస్తుంది.

సర్ప్రైజ్ ప్లాన్ చేయాలి:
సర్ప్రైజ్ గిఫ్ట్స్ ఎప్పుడైనా మంచి అనుభూతిని కలిగిస్తాయి. హృదయపూర్వక ప్రేమ లేఖ కావొచ్చు. ఇష్టమైన భోజనం లేదా ఆలోచనాత్మకమైన బహుమతి వంటి చిన్న ఆశ్చర్యకరమైన విషయాలు అనుభూతిని కలిగించడంలో సహాయపడతాయి.

మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి:
మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవడం కూడా మీ భర్తను మీకు దగ్గర చేయడానికి ఒక మార్గం. మీరు మీ గురించి మంచిగా భావించినప్పుడు, అది మీ వైఖరి, ప్రవర్తనలో చూపిస్తుంది. ఇది మీ సంబంధాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
మీ భర్తతో ప్రేమ, ప్రశంసలతో వ్యవహరించడం విజయవంతమైన సంబంధానికి చాలా కీలకం. అతడిని అర్థం చేసుకోవడానికి, అతనికి మద్దతు ఇవ్వడానికి మరియు శారీరక, మానసిక ప్రేమను చూపించడానికి ప్రయత్నించడం చాలా ముఖ్యం. వీటి ద్వారా మీరు క్రమంగా మీ భర్తను మీకు దగ్గరగా, మరింత సన్నిహితంగా మార్చుకోవచ్చు.



Click it and Unblock the Notifications
