Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
రతి క్రీడ బ్రేకుల్లేకుండా.. సాఫీగా సాగిపోవాలంటే...!
రతి క్రీడను అకస్మాత్తుగా ఆపేస్తే.. ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇటీవలి కాలంలో చాలా మందికి రతి క్రీడ పట్ల ఆసక్తి తగ్గిపోతోంది. వయసులో ఉన్న వారు కూడా ఇలాంటి సమస్యలను ఎక్కువగా ఎదుర్కొంటున్నారని పలు అధ్యయనాలలో తేలింది.

దీనంతటికీ కారణం మారుతున్న లైఫ్ స్టైలే ప్రధాన కారణమని చెప్పొచ్చు. కొందరు జంటలు ఇలాంటి విషయాలను చాలా లైట్ తీసుకుంటున్నారు. కానీ ఈ లైంగిక పరమైన విషయాలే మీ దాంపత్య జీవితాన్ని ప్రభావితం చేయడంలో..

ముందు వరుసలో ఉంటాయని తెలుసా.. ఈ సందర్భంగా రతిక్రీడలను అకస్మాత్తుగా ఆపేస్తే ఏం జరుగుతుందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

ఆ కార్యాన్ని ఆపేస్తే..
మీరు రెగ్యులర్ గా రతి క్రీడలో పాల్గొంటూ అకస్మాత్తుగా కలయికలో పాల్గొనడం ఆపేస్తే ప్రశాంతంగా నిద్రపోలేరు. మీకు నిద్రలేమి సమస్యలు ప్రారంభమవుతాయి. ఇది మీ ఆరోగ్యంతో పాటు లైంగిక పరమైన జీవితంపైనా కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. కాబట్టి మీరు మీ భాగస్వామితో కలిసి లైంగిక జీవితాన్ని ఆరోగ్యంగా గడపాలంటే.. ప్రతిరోజూ ఏడు నుండి ఎనిమిది గంటల వరకు ప్రశాంతంగా నిద్రించాలి.

డిప్రెషన్ పెరుగుదల..
మీరు చీకటి పడ్డాక మీ భాగస్వామి గురించి కాకుండా ఇతర పనులు, వ్యవహారాల గురించి ఆలోచిస్తున్నారంటే మీరు డిప్రెషన్ వంటి సమస్యలను ఎదుర్కోంటున్నారనే అర్థం. దీని నుండి బయటపడటం అంత సులభం కాదు. ఇందుకోసం మీరు రెగ్యులర్ వ్యాయామం చేయాలి. మీ శక్తిని పెంచుకుని లైంగిక పరంగా ఆనందంగా గడపొచ్చు. అయితే ముందుగా మీరు ప్రతికూల ఆలోచనలను పక్కనపెట్టండి. మీ పనులకు, అభిరుచులకు తగ్గ వాటిని చేయడం నేర్చుకోండి.

బోర్ కొడుతోందని..
పెళ్లైన కొత్తలో జంటలు ఒకరిని విడిచి మరొకరు ఉండాలంటే అస్సలు ఇష్టపడరు. అయితే కాలం మారుతున్న కొద్దీ చాలా మంది కపుల్స్ కలయిక పట్ల ఆసక్తిని తగ్గించుకుంటారు. ఆ కార్యంపై బోర్ కొట్టేస్తుంది. అందుకే మ్యారేజ్ లైఫ్ లో ఎప్పటికప్పుడు కొత్త ఉత్సాహాన్ని నింపుకుంటూ ఉండాలి. ఒక్కసారి రొమాన్స్ బోర్ కొట్టిందంటే దాన్ని ఆస్వాదించడం చాలా కష్టం. అందుకే మీరు రెగ్యులర్ గా ఒకే ప్రదేశంలో కాకుండా, కొన్నిసార్లు బాత్రూమ్ లో షవర్ కింద, మరోసారి కిచెన్ లో ఇలా కొన్ని విభిన్నమైన ప్రదేశాల్లో రతి క్రీడలో పాల్గొనాలి.

మానసికంగా సిద్ధంగా లేరా..
ఈ లోకంలో ప్రతి ఒక్కరి జీవితంలో సందర్భాన్ని బట్టి కొన్ని ఒత్తిళ్లు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా ఉద్యోగులు, వ్యాపారులకు కొంత ఎక్కువగా ఉంటుంది. అయితే వాస్తవానికి రతి క్రీడ అనేది కేవలం బాడీకి సంబంధించినదే అయినా మానసికంగా కూడా సిద్ధంగా ఉండాలి. అందుకోసం వీలైనంత మేరకు ఒత్తిడి తగ్గించుకోవాలి. దీని కోసం కపుల్స్ కొత్త ప్రదేశాలకు. టూర్లకు వెళ్లి రావడం వంటివి చేయొచ్చు.

స్మార్ట్ ఫోన్ లో మునిగిపోతున్నారా..
ప్రస్తుతం ఎవ్వరి చేతిలో చూసినా.. స్మార్ట్ ఫోన్ సర్వసాధారణమైపోయింది. ఫోన్ లేనిదే ఒక్క సెకను కూడా గడవనంతలా మారిపోయింది. ఆఖరికి భాగస్వామిని పక్కనబెట్టి ఫోన్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదనే చెప్పాలి. చాలా మంది కపుల్స్ చేతిలో ఫోన్ పెట్టుకుని పడకగదిలోనూ గంటలకొద్దీ గడిపేస్తున్నారు. దీంతో ఇద్దరూ కూర్చుని సరదాగా మాట్లాడుకోడానికి అంతగా ఆసక్తి చూపరు. ఇది కూడా మీ లైంగిక జీవితాన్ని ప్రభావితం చేసేదే. కాబట్టి మీరు సాధ్యమైనంత వరకు పడకగదిలో ఏకాంతంగా కలిసి గడిపేందుకు ప్రయత్నించండి. మీరు ఆ కార్యాన్ని బాగా ఎంజాయ్ చేయాలంటే.. బెడ్ రూమ్ లోకి వెళ్లే ముందు మీ ఫోన్లను ఫ్లయిట్ మోడ్ లో పెట్టడమో లేదా ఫోన్ ను సైలెంట్ లో పెట్టడమో చేస్తే బెటర్.

ఇంకొకరితో ప్రేమలో..
మనసులో ఒకరిని పెట్టుకుని.. ఇంకొకరితో కలిసి ఆ కార్యంలో పాల్గొన్నప్పుడు రతి క్రీడను ఆస్వాదించలేరు. ఇలా చేయడం వల్ల ఏ విషయంలోనూ స్పష్టత ఉండదు. అసలు దీంట్లో అర్థమే ఉండదు. ఇలాంటి కలయికలను ఎవ్వరూ ఎంజాయ్ చేయలేరు. ఇలా ఏ ఒక్కరిలో కలయికపై విముఖత ఏర్పడినా.. వారికి పెద్దగా సంత్రుప్తిగా అనిపించదు. అది మీ భాగస్వామిని బాధిస్తుంది. దీంతో మీ సంబంధాల్లో చీలిక కూడా రావొచ్చు.



Click it and Unblock the Notifications











