For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆషాడ మాసంలో కొత్త జంటల కలయిక ఎందుకు ఉండదో తెలుసా...

|

హిందూ మతం ప్రకారం ఆషాఢ మాసం అంటే అందరికీ ఇష్టమే. కానీ కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలకు మాత్రం ఈ మాసం అంటే అస్సలు ఇష్టముండదు. ఈ నెలపై నవ దంపతులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తుంటారు. తమ భాగస్వామికి దూరంగా ఉండాలని చెబుతుంటారు.

అదే సమయంలో అత్తా కోడలు కూడా ఈ సమయంలో ఒకే ఇంట్లో ఉండకూడదని పెద్దలు కొన్ని నియమాలు పెట్టారు. అయితే కొత్త జంటలు ఆషాఢంలో ఎందుకు కలవకూడదు..

అత్తా కోడలు ఒకేచోట ఎందుకు ఉండకూడదు.. ఉంటే ఏమవుతుంది.. ఈ ఆధునిక యుగంలోనూ ఇలాంటి ఆచారాలను ఎందుకు పాటిస్తున్నారు.. దీనివల్ల కలిగే ప్రయోజనాలేంటి అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

భార్యభర్తల మధ్య విరహ వేదన పెరగాలనే ఆషాఢ మాసంలో ఆ రూల్ పెట్టారా?భార్యభర్తల మధ్య విరహ వేదన పెరగాలనే ఆషాఢ మాసంలో ఆ రూల్ పెట్టారా?

కొత్త జంటలకు ఎడబాటు..

కొత్త జంటలకు ఎడబాటు..

ఈ ఆషాఢ మాసాన్ని ఓ కవి ఇలా వర్ణించాడు. ఇది ఆషాఢ మాసం కాదు.. నవదంపతుల సరసాలు, శృంగారకేళి, సురభిళసింగారాల ప్రవిమల ప్రణయాల, వియోగాల విరహాల ఆరూఢమాసం అని వర్ణించాడు. ఈ మాసంలో కొత్త జంటలకు ఎడబాటు తప్పదు. అత్తా అల్లుడు కూడా ఎదురు పడకూడదనే ఆచారం ఉంది.

కొత్త వలపు మోజులో..

కొత్త వలపు మోజులో..

ఇలాంటి నిబంధన ఎందుకు పెట్టారంటే.. మనది వ్యవసాయాధారిత దేశం. అప్పట్లో ఆదాయం గురించి ఎవ్వరూ పెద్దగా పట్టించుకునేవారు కాదు. తినడానికి కొన్ని గింజలు ఉండాలని కోరుకునేవారు. అయితే పెళ్లైన కొత్త జంటలు కొత్త వలపు మోజులో పడి జీవనాధారమైన వ్యవసాయాన్ని ఎక్కడ నిర్లక్ష్యం చేస్తారోనని ఈ నియమాన్ని పెట్టారట.

వాతావరణంలో మార్పులు..

వాతావరణంలో మార్పులు..

ఇదొక్కటే కాదు.. ఈ మాసంలో వాతావరణంలో చాలా మార్పులొస్తాయి. ముఖ్యంగా చల్లని వాతావరణం కారణంగా బ్యాక్టీరియా, వైరస్ లు ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో కొత్త పెళ్లికూతురు గర్భం దాల్చితే పుట్టబోయే బిడ్డ మీద వాటి ప్రభావం ఉంటుందనేది శాస్త్రీయ నమ్మకం.

మూడు నెలలు ముఖ్యం..

మూడు నెలలు ముఖ్యం..

గర్భంలో పెరిగే పిండానికి తొలి మూడు నెలలు చాలా ముఖ్యంగా భావిస్తారు. ఆ సమయంలోనే అవయవాలు ఏర్పడతాయి. అందుకే ఈ నెలలో కొత్త వధువు పుట్టింట్లో ఉండటం క్షేమకరమని పెద్దలు ఆచారంగా పెట్టారు.

ఆషాడ మాసంలో అత్తా, కోడళ్ల పోరు పడకూడదనే విడిగా ఉంటారా? మరేదైనా కారణం ఉందా?ఆషాడ మాసంలో అత్తా, కోడళ్ల పోరు పడకూడదనే విడిగా ఉంటారా? మరేదైనా కారణం ఉందా?

అనారోగ్య మాసం..

అనారోగ్య మాసం..

ఈ ఆషాడ మాసాన్ని అనారోగ్య మాసంగా పేర్కొంటారు. ఎందుకంటే ఈ సమయంలో నైరుతి రుతుపవనాల కారణంగా ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తుంది. నదుల్లోనూ, కాలువల్లోనూ ప్రవహించే నీరు కలుషితమవుతుంది. మలినాలతో కూడిన నీటి వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటివన్నీ గర్భిణీ ఆరోగ్యంపై ఎక్కువ ప్రభావం చూపుతుందని, పిండం కూడా అనారోగ్య బారిన పడుతుందనే ఇలాంటి ఆచారాన్ని పెట్టారు.

ఆషాఢం తర్వాత..

ఆషాఢం తర్వాత..

ఆషాడ మాసం తర్వాత వచ్చే శ్రావణ మాసంలో నోములు, వ్రతాలు ఎక్కువగా జరుగుతాయి. ఈ సమయంలో దాదాపు అన్ని రోజులు మంచిగానే ఉంటాయి. ఆ శుభ ఘడియల్లో గర్భధారణ జరిగితే మంచిదని చాలా మంది నమ్ముతారు. మనం పుట్టే సమయం కన్నా.. గర్భధారణ సమయం ముఖ్యమని మన పెద్దలు భావించేవారు.

ఆషాఢంలో ప్రెగ్నెన్సీ..

ఆషాఢంలో ప్రెగ్నెన్సీ..

ఆషాఢ మాసంలో ప్రెగ్నెన్సీ ప్రారంభమైతే.. సరిగ్గా తొమ్మిది నెలలకు అంటే ఛైత్రం పూర్తవుతుంది. ఈ సమయంలో ఎండకు పుట్టిన పిల్లలు, బాలింతలు తట్టుకోలేరని ఈ నియమం పెట్టారు. అలాగే ఒక నెల దూరం తర్వాత కలుసుకుంటే అన్యోన్యత మరింత పెరుగుతుందని నమ్ముతారు.

ఆరు నెలలు అత్తింట్లోనే..

ఆరు నెలలు అత్తింట్లోనే..

పూర్వకాలంలో కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలు దాదాపు ఆరు నెలల పాటు అత్తగారింట్లోనే గడపాలనే సంప్రదాయం ఉండేది. ఆ వయసులో కష్టపడి పని చేయాల్సిన కుర్రాళ్లు అత్తింట్లో కూర్చుని తినడం వల్ల వ్యవసాయ పనులు పెండింగ్ పడతాయి. వర్షాధారమైన మన పంటలు ఎండిపోతాయనే ఉద్దేశ్యంతో ఈ నిబంధన ఉంటారు.

English summary

Why Couples Are Separated In Ashada Masam?

Here we are talking about the why couples are separated in ashada masam. Have a look