For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెళ్లిలో కన్యాదానం అక్కర్లేదంట.. సెకండ్ మ్యారేజ్ కూడా మంచిదట... ఎందుకో మీరే చూడండి...

వివాహ వేడుకలో కన్యాదానం ఎందుకు అవసరం లేదనే దానిపై దియా మీర్జా ఆసక్తికరమైన విషయాలు తెలిపింది.

|

మన భారతదేశంలో వివాహం అనే ముఖ్యమైన ఘట్టం ద్వారా రెండు జీవితాలు ఒక్కటవుతాయి. ఇద్దరు తెలియని వ్యక్తులు కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. అందుకే ప్రతి వ్యక్తి జీవితంలో కళ్యాణం అనే కమనీయ కార్యక్రమం చాలా ముఖ్యమైనది.

Why Dia Mirza Said No To Kanyadaan And Bidaai At Her Wedding

అయితే మన దేశంలో పెళ్లి అనగానే ఒక్కోచోట ఒక్కో సంప్రదాయం, ఆచారాలు, వ్యవహారాలు ఉండటం అనేది మనం చూస్తూ ఉంటాం. కన్యాదానం, అప్పగింతలు, పాణిగ్రహణం, మంగళసూత్రధారణ వంటి ఎన్నో పద్ధతులు ఉన్నాయి. దీని వెనుక ఆచార శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి.

Why Dia Mirza Said No To Kanyadaan And Bidaai At Her Wedding

అయితే వీటిలో కన్యాదానం, బిదాయ్ వంటివి అవసరం లేదంటోంది దియా మీర్జా.. దీంతో ఈ అంశం కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇంతకీ తను ఎలా అందుకు అన్నది.. వివాహం విషయంలో తన భావాలను వ్యక్తం చేస్తూ, ఎక్కువ మంది జంటలు ఇలానే అనుకుంటారని, వివాహానికి సంబంధించి చాలా విషయాలు వేగంగా మారుతున్నాయని చెబుతోంది నటి దియా మీర్జా. వివాహం గురించి తను ఇంకా ఏమేమి చెప్పింది.. అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

పెళ్లైన వారి కంటే.. సింగిల్ గా ఉంటేనే ఎక్కువ ఆనందంగా ఉంటారట...! ఎందుకో తెలుసా..?పెళ్లైన వారి కంటే.. సింగిల్ గా ఉంటేనే ఎక్కువ ఆనందంగా ఉంటారట...! ఎందుకో తెలుసా..?

శాస్త్రీయ కారణాలు..

శాస్త్రీయ కారణాలు..

పూర్వం ప్రతి పనికి ముందు దేవుడిని ప్రార్థించి, సంప్రదాయం ప్రకారం ఏ కార్యక్రమాన్నైనా ప్రారంభించేవారు. ఇలా చేయడం వల్ల అన్ని పనులు సక్రమంగా సాగుతాయని నమ్మేవారు. ఎందుకంటే ఆ సంప్రదాయాల వెనుక ఎన్నో శాస్త్రీయ కారణాలున్నాయని చరిత్రకారులు చెబుతుంటారు.

పెళ్లిలో..

పెళ్లిలో..

వివాహ కార్యక్రమంలో వధూవరులను అందంగా ముస్తాబు చేస్తారు. వారి నుదుట బాసికం కట్టడం, కాళ్లకు, చేతులకు గోరింటాకు పూయడం.. కన్యాదానం చేయడం వంటివి ఎప్పటి నుంచో ఆచారంగా వస్తోంది. నుదిటి భాగంలో బ్రహ్మ దేవుడై కొలువై ఉంటాడని.. బ్రహ్మ మన భవిష్యత్తును అక్కడే రాస్తాడన్న విషయం చాలా మందికి తెలిసిందే. ఇక కన్యాదానం విషయానికొస్తే.. వధువు తండ్రి తన కూతురు అయిన కన్యను దానం చేస్తున్నాడనే అర్థం వస్తుంది.

కన్యాదానం విషయంలో..

కన్యాదానం విషయంలో..

రెండో పెళ్లి చేసుకున్న దియా మీర్జా కన్యాదానం గురించి ఆసక్తికరమైన విషయాలను చెప్పింది. ప్రస్తుత తరం అమ్మాయిలు పెళ్లి విషయంలో తమ అభిప్రాయాలను చాలా వేగంగా మార్చుకుంటున్నారని.. ఇది తనను చాలా సంతోషపరిచిందని.. చాలా మంది ఇలాగే ఆలోచిస్తారని, కన్యాదానం విషయంలో చాలా మంది ధోరణి వేగంగా మారుతుందని ఆశిస్తున్నట్లు చెప్పింది.

పెళ్లికి ముందు ఆ కార్యంలో పాల్గొనొచ్చా.. ఆ ఘట్టంపై యువత ఆలోచన ఎలా ఉందంటే...!పెళ్లికి ముందు ఆ కార్యంలో పాల్గొనొచ్చా.. ఆ ఘట్టంపై యువత ఆలోచన ఎలా ఉందంటే...!

మారుతున్న ఫ్యాషన్..

మారుతున్న ఫ్యాషన్..

ఒకప్పుడు వివాహం అంటే కేవలం ఎరుపు రంగుల చీరలు మరియు లెహంగాలలో మాత్రమే కనిపించేవారు. మిగిలిన బట్టలను చెడ్డవిగా భావించేవారని.. అయితే ఈ ధోరణిలోనూ చాలా మంది మహిళల్లో మార్పు వస్తోంది. ఇందులో బేబీ పింక్, ఐవర్, లిలక్ వంటి రంగులను ఎంచుకోవడంలో చాలా మంది స్త్రీలు ముందుంటున్నారు. ఇది మాత్రమే కాదు, భారీ ఆభరణాలలో వధువులను చూసేవారు, ఇప్పుడు వాటి నుండి తప్పించుకున్నట్టు కనిపిస్తోంది.

మంగళ సూత్రాల విషయంలో..

మంగళ సూత్రాల విషయంలో..

పూర్వకాలంలో, అమ్మాయిలంతా సాధారణంగా ఒకే రకమైన మంగళసూత్రాన్ని మాత్రమే ధరించేవారు. అది కూడా నలుపు మరియు బంగారు పూసలతో చేసిన గొలుసు మరియు మధ్యలో రెండు గిన్నె ఆకారపు పెండెంట్లను కలిగి ఉండేది. అయితే, ఇప్పుడు ఈ డిజైన్ పాతదిగా మారిపోయింది. ఇప్పుడంతా వధువు మెడలో వజ్రాలను మరియు రాశిచక్రం ప్రకారం లేదా అక్షరాలను వేసుకుని కనిపిస్తున్నారు. అలాగే బ్రాస్లైట్ మంగళసూత్రం యొక్క ధోరణి కూడా విపరీతంగా పెరిగింది.

బాడీని ఉత్తేజపరచడంలో..

బాడీని ఉత్తేజపరచడంలో..

బాసికం కట్టడం కేవలం సంప్రదాయం మాత్రమే కాదు. దీని వల్ల మీకు అనేక ప్రయోజనాలున్నాయి. మన బాడీలో దాదాపు 72 వేల నాడులు ఉంటాయి. వీటిలో ప్రధానమైనవి 14 నాడులు. ఇవి మన బాడీని ఉత్తేజపరచడంలో ఎంతగానో దోహదపడతాయి. ఈ నాడులలో సుషమ్న, ఇడ, పింగళ అనేవి చాలా ముఖ్యమైనవి. వీటిలో ప్రధానమైన సుషమ్న నాడికి కుడివైపు సూర్యనాడి, ఎడమవైపు చంద్రనాడి ఉంటాయి. ఇవి రెండు నుదుటి భాగంలో కలుస్తాయి.

సింపుల్ గా ఉండటాన్ని..

సింపుల్ గా ఉండటాన్ని..

సాధారణంగా వివాహం అనగానే చాలా మంది స్త్రీలు ఒంటి నిండా నగలు.. తళుక్కుమని మెరిసిపోయే చీరలను వేసుకోవాలని భావిస్తారు. ఒకప్పుడు ఇదే తంతు ఎక్కువ చోట కనిపించేది. అయితే ప్రస్తుతం ట్రెండ్ మారింది. చాలా మంది యంగ్ కపుల్స్ సింపుల్ గా ఉండటాన్ని ఇష్టపడుతున్నారు. అలాగే తమ సన్నిహితులను మాత్రమే అతిథులుగా ఆహ్వానిస్తున్నారు. అదే సమయంలో పెళ్లి పత్రికలు కూడా డిజిటల్ రూపం సంతరించుకున్నాయి. ఇక ప్రియమైన వారికి మెయిల్ లేదా వాట్సాప్, ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియా అకౌంట్లతో షేర్ చేసుకుంటున్నారు.

రెండో వివాహంపై..

రెండో వివాహంపై..

ప్రస్తుత తరం అమ్మాయిలు, అబ్బాయిల్లో రెండో వివాహంపై కూడా అభిప్రాయాలు చాలా వేగంగా మారిపోతున్నాయి. ఒకప్పుడు వివాహం అనేది జీవితంలో వచ్చే ఒకేసారి మధురమైన ఘట్టం. కానీ ఇప్పుడు అలా కాదు. జీవితం రెండోసారి కూడా అవకాశమిస్తోందని అంటోంది దియా మీర్జా. ముఖ్యంగా విడాకులు తీసుకుని, ఒంటరిగా జీవించే వారు, మరోసారి వివాహం చేసుకోవడంలో ఎలాంటి తప్పు లేదని చెబుతోంది. ఇంతకుముందు తల్లిదండ్రుల ఎంపిక ద్వారా మాత్రమే వివాహం చేసుకునేవారు. కానీ ఇప్పుడు తల్లిదండ్రులు తమ పిల్లల ఛాయిస్ కు ఓకే అంటున్నారు. దీంతో ప్రేమ వివాహాల సంఖ్య కూడా పెరుగుతోంది.

English summary

Why Dia Mirza Said No To Kanyadaan And Bidaai At Her Wedding

Here we are talking about the why dia mirza said no to kanyadaan and bidaai at her wedding.Read on
Story first published:Monday, February 22, 2021, 13:36 [IST]
Desktop Bottom Promotion