For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

‘నా భర్త పెళ్లైనా పక్కచూపులు చూస్తున్నాడు.. ఇతర స్త్రీలతో సరసాలాడుతూ...’

|

ఏ బంధమైనా ప్రేమ, అనురాగం, ఆప్యాయత అనేవి ఉండాలి. ముఖ్యంగా ఆలుమగల మధ్య ప్రేమ ఉంటేనే సాన్నిహిత్యం పెరుగుతుంది. అంతేకాదు దాంపత్య జీవితంలో ఒకరినొకరు అర్థం చేసుకోవాలి.

అప్పుడే వారి సంసారం సాఫీగా సాగుతుంది. ఇదిలా ఉండగా.. పెళ్లి తర్వాత చాలా మంది పురుషులు ఇతర స్త్రీలతో సరసాలాడేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతారు. తమ భార్య కన్నా కాస్త అందంగా ఉండే అమ్మాయి కనబడితే చాలు వారితో కబుర్లు స్టార్ట్ చేయడమే కాదు.. వారిని ఫ్లర్టింగ్ చేసేందుకు ప్రయత్నిస్తారు. అయితే తన భర్త మాత్రం అందరిలా కాదు..

తను చాలా నిజాయితీగా ఉంటాడని నమ్మి పెళ్లి చేసుకుంది ఓ యువతి. కానీ తన నమ్మకాన్ని వమ్ము చేశాడో భర్త. పెళ్లికి ముందు తనే సర్వస్వం అని మాట్లాడి.. తన తర్వాతే తనకు వేరే ప్రపంచం అని కోతలు కోసిన ఓ భర్త.. పెళ్లై, పిల్లలు పుట్టిన తర్వాత మాత్రం ప్లేటు ఫిరాయించాడు. తన భార్య కన్నా కాస్త అందంగా ఎవరైనా అమ్మాయి కనబడిందంటే చాలు వారితో కబుర్లు స్టార్ట్ చేస్తున్నాడట.

అంతేకాదు వారితో సరసాలాడుతూ తన భార్యను అవమానపరుస్తున్నాడట. అయితే ఇలా ఎందుకు జరుగుతుంది.. అందరూ మగాళ్లు అంతేనా.. దీని వెనుక ఉన్న కారణాలేంటి.. నా సమస్యకు పరిష్కారం ఏంటని ఓ వివాహిత తన గోడును నిపుణుల వద్ద చెప్పుకుని బాధపడింది.

ఆ కార్యాన్ని ఆస్వాదించాలంటే.. అది పక్కన పెట్టాల్సిందే...!ఆ కార్యాన్ని ఆస్వాదించాలంటే.. అది పక్కన పెట్టాల్సిందే...!

పెళ్లికి ముందు..

పెళ్లికి ముందు..

‘హాయ్ నా పేరు గీత(పేరు మార్చాం). నాకు పెళ్లై రెండు సంవత్సరాలు పూర్తవుతోంది. మేమిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. పెద్దలను ఎదిరించి మరీ ఒక్కటయ్యాం. పెళ్లికి ముందు నా భర్త నేను తన ప్రపంచమని.. తను తప్ప మరెవరూ అవసరం లేదని.. తనతో ఎంతో ప్రేమగా ఉండేవాడు.

ఈ మధ్యనే..

ఈ మధ్యనే..

నేను ఎప్పుడు ఏమి కోరుకున్నా.. వెంటనే తీర్చేవాడు. లేదు.. కాదు అని చెప్పేవాడే కాదు. అంతేకాదు తనకు ఏమి కావాలన్నా నిర్మోహమాటంగా అడిగేవాడు. అలా మా సంసారం సాఫీగా.. సంతోషంగా సాగుతుండేది. అయితే మాకు పిల్లలు ఎప్పుడైతే పుట్టారో.. అప్పటి నుండి తనలో మార్పు మొదలైంది. తను ఈ మధ్యనే ఇతర స్త్రీలతో సరదాగా మాట్లాడుతున్నాడు.

సరసాలాడుతూ..

సరసాలాడుతూ..

నా కన్నా కాస్త అందమైన అమ్మాయి కనబడితే చాలు చుట్టూ ఎవరున్నా.. వారెమనుకుంటున్నారో అనే భయం కూడా లేకుండా ముచ్చట్లు పెడుతున్నాడు. అంతేకాదు నా ఎదుటే వారితో సరసాలాడుతున్నాడు. నాతో ప్రేమగా మాట్లాడే తను ఈ మధ్య మాట్లాడటానికి కూడా ఆసక్తి చూపడం లేదు. పైగా చీటికి మాటికి కోప్పడుతున్నాడు. సడెన్ గా తనలో ఎందుకింత మార్పు వచ్చింది. నా ఈ సమస్యకు పరిష్కారం ఏంటని ఓ వివాహిత తన సమస్యను నిపుణులతో చెప్పుకుంది.

‘తన భర్త తాగితే మన్మథుడిలా మారిపోతాడంట.. ఇతర స్త్రీలతోనూ...'‘తన భర్త తాగితే మన్మథుడిలా మారిపోతాడంట.. ఇతర స్త్రీలతోనూ...'

చాలా మంది భర్తలు..

చాలా మంది భర్తలు..

చాలా మంది భర్తలు పెళ్లి తర్వాత తమ భార్యలను మోసం చేస్తున్నారని అనేక సర్వేల్లో తేలింది. ముఖ్యంగా పెళ్లైన తర్వాత, పిల్లలు పుట్టాక కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల వారు తమ భార్యలను చీట్ చేస్తున్నట్లు పలు సర్వేల్లో తేలింది. ముఖ్యంగా 30 నుండి 40 ఏళ్లలోపే పురుషులే ఈ పనులు చేస్తున్నారట.

బోర్ గా ఫీలవ్వడం వల్ల..

బోర్ గా ఫీలవ్వడం వల్ల..

చాలా మంది భర్తలు ఆఫీసు పని మీదో.. లేదా వ్యాపారం, ఇతర పనుల మీద ఒంటరిగా వెళ్లడం వల్ల వారు చాలా బోర్ గా ఫీలవుతుంటారు. అందుకే ఆ సమయంలో వారు ఎవరితో అయినా చాటింగ్ చేయాలని లేదంటే మాట్లాడాలని భావిస్తారు. దీంతో వారు మిమ్మల్ని కాదని ఇతర స్త్రీలతో పరిచయాలు పెంచుకుంటారు. అక్కడి నుండే అసలు కథ మొదలవుతుంది.

ప్రేమ తగ్గడం..

ప్రేమ తగ్గడం..

మరోవైపు పిల్లలు పుట్టిన తర్వాత మీ నుండి ఆశించిన ప్రేమ వారిపై తగ్గిపోవడం.. మీరు పిల్లలపై ఎక్కువ ప్రేమ చూపడం వల్ల.. వారు పక్క చూపులు చూస్తారు. మీ ఇద్దరి మధ్య కలయిక వంటి కార్యకలాపాలు కరువయితే.. వారు ఇతర స్త్రీలతో సరసాలాడేందుకు ప్రయత్నిస్తారు. కొందరు మగాళ్లకు అలా చేస్తే ఓ థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది. అందుకే వారు పక్కదారి పడుతుంటారు.

పిల్లలు పుట్టాక కూడా రతి క్రీడలో రెచ్చిపోవాలంటే ఇలా చేయండి...పిల్లలు పుట్టాక కూడా రతి క్రీడలో రెచ్చిపోవాలంటే ఇలా చేయండి...

అందంగా కనబడితే..

అందంగా కనబడితే..

కొందరు అబ్బాయిలు తమకు అందమైన పెళ్లాం రాలేదనే బాధలో ఉంటారు. ముఖ్యంగా తమ స్నేహితులలో ఎవరికైనా అందమైన పెళ్లాం వచ్చిందంటే చాలు తెగ ఫీలైపోతారు. అందుకే వారు పని చేసే చోట లేదా ఇతర చోట్ల అందమైన అమ్మాయిలతో పరిచయం పెంచుకుని, తమకు కావాల్సిన పనిని కానిచ్చేస్తారు.

సాన్నిహిత్యంగా..

సాన్నిహిత్యంగా..

మీ భర్త కూడా ఇలా ప్రవర్తిస్తుంటే.. మీరు పెళ్లైన కొత్తలో ఎలా ఉండేవారో గుర్తు చేసుకోండి. మీ భర్తపై అలాంటి ప్రేమనే చూపండి. ముఖ్యంగా ఆ కార్యంలో రెగ్యులర్ గా అంటే వారంలో రెండు లేదా మూడుసార్లైనా పాల్గొనండి. పడకగదితో పాటు బయట కూడా వారిపై ప్రేమను వ్యక్తం చేయండి. దీంతో మీ ఇద్దరు సన్నిహితంగా ఉంటారు. తను కూడా ఎప్పుడూ మీ గురించే ఆలోచిస్తారు.

ఒత్తిడిలో ఉన్నప్పుడు..

ఒత్తిడిలో ఉన్నప్పుడు..

మీ భర్తలు బయటికి వెళ్లొచ్చినప్పుడు లేదా ఏదైనా పని చేసి ఇంటికి వచ్చినప్పుడు వారి ఒత్తిడిని తగ్గించేందుకు ప్రయత్నించాలి. అలాంటి సమయంలో వారితో ప్రేమగా మాట్లాడాలి. వారి ఒత్తిడిని అధిగమించేందుకు మీరు సహాయపడాలి. లేదంటే వారికి కోపం వస్తుంది. అప్పుడే మీపై ప్రేమ తగ్గుతుంది.

టూర్లకు వెళ్లాలి..

టూర్లకు వెళ్లాలి..

మీకు సమయం దొరికినప్పుడల్లా మీ భర్తతో కలిసి టూర్లకు వెళ్లాలి. లేదంటే ఏదైనా లాంగ్ డ్రైవ్ కు వెళ్లేందుకు ప్రయత్నించాలి. వీలైతే మీరిద్దరూ రోజంతా ఏకాంతంగా గడపండి. కనీసం వారంలో ఒక రోజైనా పూర్తిగా మీరిద్దరూ గడిపేలా ప్లాన్ చేసుకోండి. ఎప్పుడైతే మీ ప్రేమ తక్కువవుతుందో తనకు వేరే ఆలోచనలు రావడం మొదలవుతాయి. కాబట్టి అలా కాకుండా జాగ్రత్త పడండి.

మీ రూట్ లోకి..

మీ రూట్ లోకి..

మీరు వారి మాటలకు విలువ ఇస్తూనే వారిని మీ రూట్లోకి వచ్చేలా చేసుకోండి. అందుకోసం వారితో ప్రశాంతంగా మాట్లాడండి. అలా కుదరకపోతే మంచి మానసిక నిపుణులను సంప్రదించండి.

English summary

Why Does My Husband Flirt With Other Women?

Read on to know the details why does my husband flirt with other women? Have a look