Latest Updates
-
ఫేస్ వాష్ కొనే పని లేదు.. వారం రోజుల్లోనే మెరిసే ముఖం.. కిచెన్లోనే అద్భుత రహస్యం.! -
మిలీనియల్ ‘అబ్బాయిల’కి అట్రాక్ట్ అవుతున్న జెన్ జీ అమ్మాయిలు.. కారణాలివే.! -
నెలరోజుల పాటు ఈ ఒక్కటి మానేస్తే.. ఈజీగా 3 కేజీల బరువు తగ్గేస్తారు.! -
రక్తహీనత సమస్యకి దివ్య ఔషధం.. పాలకూరతో ఇలా చేశారంటే మెతుకు కూడా వదిలిపెట్టరు.! -
మహిళల్లో పడిపోతున్న అండాల సంఖ్య.. ఈ కారణాలు తెలుసుకోకపోతే భారీ మూల్యం తప్పదు.! -
టేస్ట్, హెల్త్ ఒకేసారి..ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఓట్స్ వెజిటబుల్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలంటే.. -
జూన్ 23: ఈ రాశుల వారికి అదృష్టం.. కాసుల వర్షం కురిసే ఛాన్స్! -
ఉల్లి, వెల్లుల్లి తినని వారికి బెస్ట్ ఛాయిస్.. సోయా వెజ్ ఖీమాతో బార్లీ దోశ -
వేంకటేశ్వరుడు మర్త్యలోకంలోకి ఎందుకు వచ్చాడు? అద్భుతమైన పురాణ కారణం -
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.?
కోడళ్లు అంటే అత్తలకు ఎందుకు ఇష్టముండదు? కారణాలేంటో తెలుసా?
అత్తాకోడళ్ల మధ్య కలహాలు కామన్. ప్రతి ఇంట్లో జరిగేవే. కొట్టుకునేంత గొడవలు లేకపోయినా మూతీ, ముక్కు తిప్పుకోవడాలు ఉంటాయి. ఏదో ఒక చిన్న అంశంలోనైనా ఇద్దరి మధ్య తీవ్ర స్థాయి చర్చ జరుగుతుంది. అది కాస్త గొడవకు దారి తీస్తుంది. చాలా ఇళ్లల్లో వేరు కాపురాలు పెట్టుకోవడం చాలా సాధారణంగా కనిపిస్తుంటాయి. మీ ఇంట్లో అత్తాకోడళ్ల మధ్య గొడవలు ఎందుకు జరుగుతున్నాయో ఒక ఐడియా ఉంటుంది. మరి ప్రతి ఇంట్లో అసలు గొడవలు ఎక్కడ మొదలవుతాయని ఎప్పుడైనా ఆలోచించారా.

అత్తలు తమ కోడళ్లను ఎందుకు ఇష్టపడరు, ఏయే విషయాల్లో వారి మధ్య గొడవలు జరుగుతుంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

కొడుకును లాగేసుకుంటుందని అత్తలు అనుకుంటారు:
కోడలు ఇంటికి వచ్చినప్పటి నుండి కొడుకులు వారికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్లు అత్తలకు అనిపిస్తుంది. తన కొడుకును వారి నుండి ఎక్కడ లాగేసుకుంటుందోనన్న భయం వారిలో మొదలవుతుంది. ఒకప్పుడు తల్లి చెప్పిన మాట విన్న కొడుకు పెళ్లాయ్యాక భార్య చెప్పే మాటే వింటున్నాడు, కోడలు చెప్పినట్టే చేస్తున్నాడు అనుకుంటారు అత్తలు. అత్తను వదిలేసి వారిద్దరే బయటకు వెళ్లినప్పుడు ఈ ఫీలింగ్ ఎక్కువ అవుతుంది. అలా కోడళ్లు అంటే అత్తలకు ఈర్శ్య, అసూయ మొదలవుతుంది. అది కాస్త కోపం రూపంలో ప్రదర్శిస్తారు.

ఇంట్లో సహాయం చేయకపోవడం:
నా కోడలు ఇంట్లో ఏ పనీ చేయదు. ఆమె పని ఆమెనే చేసుకుంటుందని చాలా మంది అత్తలు తమ కోడళ్లపై కంప్లైంట్స్ ఇస్తుంటారు. ఉద్యోగం చేసే కోడళ్లు అయితే ఉదయం కాఫీ, టీ పెట్టడం, టిఫిన్ చేయడంలో సహాయం చేయడం, రాత్రి భోజనం సమయంలో హెల్ప్ చేయడం లాంటివి చేయదని, ఎప్పుడూ బెడ్రూములోనే ఉంటుందని చాలా మంది అత్తలు చెప్పడం చాలా మంది వినే ఉంటారు. అయితే ఈ విషయంపై అత్తలు ఒకలా, కోడళ్లు మరోలా స్పందిస్తుంటారు అది వేరే సంగతి.

పూజలు పునస్కారాలు చేయదు:
కొంత మంది అత్తలు ఈ కంప్లైంట్ ఇస్తుంటారు. తమది మతపరమైన కుటుంబమని, తమ ఇళ్లల్లో పూజలు పునస్కారాలు చేస్తుంటామని కానీ కోడలు అలాంటి వాటికి చాలా దూరంగా ఉంటుందని అంటారు. పూజలు చేయడం రాకపోతే కనీసం సహాయం అయినా చేయాలని వారు కోరుకుంటారు. అత్తలు కోరుకున్నవి కోడళ్లు చేయకపోతే అక్కడ అసంతృప్తి మొదలవుతుంది. ఏ పనీ చేయడం లేదని, తింటూ కూర్చుంటుందని అత్తల్లో లోలోపల ఉడికిపోతుంటారు. అది కాస్త సమయం వచ్చినప్పుడు మాటల రూపంలో బయటకు వస్తుంది. అలా గొడవ మొదలవుతుంది.

కలివిడిగా లేకపోవడం లేదా ఉండటం:
కొందరు కోడళ్లు ఇతర వ్యక్తులతో, చుట్టు పక్కల వారితో, బంధువులతో త్వరగా కలిసిపోతారు. మాటలు కలుపుతారు. పెద్దలతో చనువుగా ఉంటారు. ఈ లక్షణాల వల్ల అప్పటి వరకు అత్తలకు ప్రాధాన్యత ఇచ్చిన వారు కూడా కోడలి గురించి మాట్లాడటం మొదలు పెడతారు. అది అత్తల్లో అసూయను కలిగిస్తుంది. ఒకవేళ కలివిడిగా లేకపోయినా సమస్యే.
ఎవరితో మాట్లాడటం లేవని, ఎవరినీ పలకరించడంలేదని, మాట్లాడటం లేదని, గౌరవించడంలేదని అరవడం మొదలు పెడతారు. అది కూడా గొడవకు కారణం అవుతుంది. ఇలా అత్తాకోడళ్ల మధ్య కలహాలు జరుగుతుంటాయి. ఇలా అత్తాకోడళ్ల మధ్య తగాదాలు, కలహాలు, గొడవలు జరుగుతుంటాయి.



Click it and Unblock the Notifications