Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
పెళ్లైన వ్యక్తితో అఫైర్ వరకూ ఓకే..! కానీ, ప్రేమలో పడితే కష్టాలు తప్పవు
వివాహితులైన వ్యక్తితో ప్రేమలో పడటం అనేది ఒక రకమైన మోహానికి సంబంధించినది. అయితే మ్యారేజ్ అయిన వ్యక్తితో ప్రేమలో పడటం ఎలాంటి సమస్యలను దారితీస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రేమకు తర తమ భేదాలు ఉండవు. ఎప్పుడు, ఎక్కడ, ఎలా పుడుతుందో చెప్పలేం. అయితే కొందరు యువతీ యువకులు పెళ్లైన వ్యక్తులతో సంబంధం పెట్టుకుంటారు. అయితే ఈ సంబంధం ప్రేమ వరకు వచ్చినప్పుడు ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. వివాహితులైన వ్యక్తితో ప్రేమలో పడటం అనేది ఒక రకమైన మోహానికి సంబంధించినది. అయితే మ్యారేజ్ అయిన వ్యక్తితో ప్రేమలో పడటం ఎలాంటి సమస్యలను దారితీస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మనసు మారే అవకాశాలు ఎక్కువ:
పెళ్లైన వ్యక్తిని ప్రేమించడం అనేది సవాళ్లతో కూడుకుని ఉంటుంది. ఈ రకమైన సంబంధం కొన్ని రోజుల వరకు బాగుంటుంది. తర్వాతే అసలు ఇబ్బందులు మొదలవుతాయి. ఎందుకంటే వారు అటు కుటుంబానికి, ఇటు మీకు సరైన సమయాన్ని వెచ్చించలేరు. ఒకానొక సమయంలో మీరు ముఖ్యమా కుటుంబం ముఖ్యమా అనుకున్నప్పుడు కుటుంబం వైపే మొగ్గు చూపడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అనైతిక సంబంధం కంటే నైతిక సంబంధానికే సమాజంలో విలువ ఉంటుందని గ్రహించి మనసు మార్చుకుని తిరిగి జీవిత భాగస్వామితోనే ఉండిపోవాలని నిర్ణయించుకోవచ్చు.

పెళ్లైన వ్యక్తులు దొంగచాటుగా ప్రేమిస్తారు:
పెళ్లైన వ్యక్తులతో సంబంధమైనా, ప్రేమ అయినా దొంగచాటుగానే ఉంటుంది. శారీరకంగా ఇద్దరికి సంతృప్తి ఉన్నప్పటికీ అది మానసికంగా మారడం చాలా కష్టం. ఎందుకంటే వారు మీతో బయట చనువుంగా ఉండలేరు. ఎవరైనా చూస్తారన్న భయం వారిని వెంటాడుతుంది. పబ్లిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాలకు వెళ్లలేరు. రొమాంటిక్ గా చేతిలో చేయి వేసి నడవలేరు. మీ రొమాంటిక్ చిత్రాలను సోషల్ మీడియాలో పోస్టు చేయలేరు. మొదట్లో ఇలా ఉండటం బాగానే ఉంటుంది. కానీ రోజులు గడిచే కొద్దీ ఆ వెలితి, అసౌకర్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. దీని వల్ల నిరాశ పెరుగుతుంది. అది మనస్సును ముక్కలు చేస్తుంది.

అబద్ధాలు చెబుతారు:
అబద్ధాలు చెప్పడం చాలా సాధారణంగా మారుతుంది. మీతో ఉన్నప్పుడు అవతలి వారితో, అవతలి వారితో ఉన్నప్పుడు మీతో అబద్ధాలు చెబుతూనే ఉంటారు. ఫోన్ కు లాక్ వేయడం మొదలవుతుంది. గ్యాలరీ లాక్, యాప్ లాక్ లు పెట్టాల్సి వస్తుంది. కొత్త ఫోన్ నంబరు కూడా తీసుకోవాల్సి వస్తుంది. ఒకరికొకరు కలవడానికి కూడా అబద్ధాలను ఆశ్రయించాల్సిందే.

అందుబాటులో ఉండకపోవచ్చు:
పెళ్లయిన వ్యక్తితో సంబంధం కలిగి ఉండటంలో అతి పెద్ద ప్రతికూలత ఏమిటంటే వారు ఎప్పుడు పడితే అప్పుడు అందుబాటులో ఉండరు. పగలు మీతో ఎంత సరదాగా గడిపినా రాత్రి అయితే ఇంటికి, పిల్లల దగ్గరకు వెళ్లాల్సిందే.



Click it and Unblock the Notifications