Latest Updates
-
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
వారిద్దరికీ అందుకు సమయమే దొరకడం లేదంట... ఎందుకంటే వారింట్లో ఏకంగా 9 మంది సంతానం...!
కేవలం రెండు సంవత్సరాల్లో 9 మంది పిల్లలకు జన్మనిచ్చింది ఓ మహిళ.
పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరికీ ఏడాది లోపు పండంటి బిడ్డను తమ చేతిలో పెట్టాలని పెద్దలు చెబుతుంటారు. కొందరు ఈ పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. మరికొందరు మాత్రం ఈ పనిని వాయిదా వేసుకుంటూ ఉంటారు.

వీటన్నింటి సంగతి పక్కనబెడితే.. కొందరు జంటలు ఎన్నిసార్లు ఆ కార్యంలో పాల్గొన్నా.. పిల్లలే పుట్టరు. దీంతో వారు చాలా నిరాశ చెందుతారు. అలాంటి వారు నిత్యం ఆసుప్రతుల చుట్టూ తిరుగుతుంటారు.

కొంతమందికి ఎన్నిసార్లు చికిత్సలు చేయించుకున్న పిల్లలే పుట్టరు. అలాంటి ఓ జంటకు ఊహించని సంఘటన ఎదురైంది. తమకు అసలు పిల్లలు పుట్టే అవకాశం లేదని తెలుసుకుని.. నలుగురు పిల్లలను దత్తత తీసుకున్నారు. అయితే ఐవీఎఫ్ పద్ధతిలో ఓ బిడ్డకు.. సహజ పద్ధతిలో నలుగురు పిల్లలకు కేవలం రెండేళ్లలో జన్మనిచ్చిందో మహిళ.
అలా వారింట్లో ఏకంగా తొమ్మిది మంది పిల్లలు ఉండటంతో వారిద్దరికీ కనీసం రొమాన్స్ చేసుకునేందుకు కూడా సమయం దొరకడం లేదంట. ఈ విషయాలన్నీ సోషల్ మీడియాతో షేర్ చేసుకున్నారు ఆ జంట. ఇంతకీ వారు ఏ ప్రాంతం వారు.. వారు ఇంకా ఏయే వివరాలను చెప్పారో అనే వివరాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం...

వారిద్దరికీ అందుకు సమయమే దొరకడం లేదంట... !
మ్యాక్సైజన్, జేక్ దంపతులది పెనిస్లేవియాలోని ఓ ప్రాంతం. వీరిద్దరికీ వివాహం జరిగి చాలా సంవత్సరాలు పూర్తయ్యింది. కొన్నేళ్లుగా వీరికి పిల్లలే పుట్టలేదు. పిల్లల కోసం వీరు ఎంత ప్రయత్నం చేసినా.. ఫలితం రాలేదు. దాని కోసం ఎవరిలో లోపం ఉందోనని ఎన్నో రకాల చికిత్సలు కూడా చేయించుకున్నారు.

పిల్లలు పుట్టలేదు..
వీరిద్దరూ పిల్లల కోసం ఎన్ని ప్రయత్నాలు చేయాలో.. అన్నింటినీ చేశారు. అయినా కూడా వీరికి పిల్లలు పుట్టకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇక తమకు సంతాన యోగ్యం లేదనుకున్నారు. అందుకే నలుగురు చిన్నారులను దత్తత తీసుకుని వారితో జీవితం గడిపేస్తున్నారు.

ఐవీఎఫ్ పద్ధతిలో..
అయితే ఓ రోజు వారిద్దరికీ ఎవరో ఐవీఫ్ పద్ధతిని ట్రై చెయ్యమన్నారు. దీంతో ఆమె In Vitro Fertilization(IVF) పద్ధతి ద్వారా ప్రెగ్నెంట్ అయ్యింది. అంతే కేవలం ఏడాదిలోపే ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. రెండేళ్ల క్రితం అంటే 2018లో మగబిడ్డ పుట్టడంతో.. మొత్తం వారింట్లో ఐదుగురు చిన్నారులయ్యారు.

మరోసారి సహజ పద్ధతిలో..
అలా ఆ ఐదుగురే పిల్లలే లోకంగా బతుకుతున్న వారి జీవితంలోకి అకస్మాత్తుగా ఓ మరో ఆశ్చర్యకరమైన సంఘటన చోటు చేసుకుంది. ఆమె మరోసారి సహజ పద్ధతిలో ప్రెగ్నెంట్ అయ్యింది.

ఏకంగా నలుగురు..
ఆమె ప్రెగ్నెన్సీ అని నిర్ధారణ చేసిన వైద్యులు.. ఆమెకు టెస్టులు చేయగా.. ఆమె కడుపులో ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా నలుగురు చిన్నారులు పెరుగుతున్నారని షాకింగ్ న్యూస్ చెప్పారు.

మొత్తం 9 మంది..
అంతేకాదు.. ఆమె ఆ నలుగురు చిన్నారులకు ఇటీవలే విజయవంతంగా జన్మనిచ్చింది. వీరంతా మూడు నుండి నాలుగు పౌండ్ల బరువు ఉన్నారని డాక్టర్లు తెలిపారు. దీంతో మొత్తం ఆ ఇంట్లో కేవలం రెండు సంవత్సరాల కాలంలో 9 మంది చిన్నారులకు తల్లిదండ్రులయ్యారు. ఇటీవల పుట్టిన నలుగురికి సిలార్ లెడ్జర్, థియో అలెగ్జాండర్, బెక్ కిల్లియన్ మరియు సిసిలియా హడ్సన్ అని పేరు పెట్టారట.

తెగ సంబరం..
తమ జీవితంలో ఒక్క చిన్నారి కూడా రాడని బాధపడ్డామని.. అలాంటిది ఇప్పుడు తమకు 9 మంది పిల్లలు ఉన్నారంటూ వారు తెగ సంబరపడిపోతున్నారు. ఇదే విషయాన్ని వారు సోషల్ మీడియా ద్వారా అందరితో షేర్ చేసుకున్నారు.

సమయమే సరిపోవడం లేదట..
అంతమంది పిల్లలతో హాయిగా కాలం గడిపేద్దామనుకున్న వారికి.. ఇప్పుడు అదే సమయమే ఇబ్బందిగా మారుతోందని బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆ చిన్నారులను చూసుకోవడానికి వారికి సమయమే ఏ మాత్రం సరిపోవడం లేదంట. తమ రొమాన్స్ కి కూడా కనీస టైమ్ దొరకడం లేదని తెగ ఫీలవుతున్నారు.
Courtesy: All Images Credited



Click it and Unblock the Notifications
