Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
ఫ్రెండ్ భార్యతో ఎఫైర్!..అలా జరిగితే వెంటనే చేయాల్సిన పని ఇదేనంట..
ప్రస్తుతం బంధాల్లో రోజు రోజుకీ విపరీతమైన మార్పులు వచ్చేస్తున్నాయి. తన,మన తేడా లేదు కాదేదీ కామానికి అనర్హం అన్నట్లుగా కొందరు ప్రవర్తిస్తున్నారు. ఎఫైర్ల పిచ్చిలో కన్నవాళ్లను,కట్టుకున్నవాళ్ల జీవితాలను కూడా నాశనం చేస్తున్నారు కొందరు. జీవిత భాగస్వామి కాకుండా వేరే వ్యక్తి పట్ల ఆకర్షణ కలగడం మానవ సహజం. అయితే ఆ ఆకర్షణకు లొంగిపోయి తప్పుగా ప్రవర్తించడమనేది పూర్తిగా మన చేతుల్లో ఉండే ఆప్షన్. ఈ సున్నితమైన విషయంపై ప్రముఖ రచయిత్రి,మైథాలజిస్ట్ సీమా ఆనంద్ తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఓ వీడియోలో కొన్ని కీలక సూచనలు చేశారు.
తరచుగా కొందరిని వేధించే ఒక ప్రశ్న ఏంటంటే..నేను నా స్నేహితుడి భార్య పట్ల ఆకర్షితుడవుతున్నాను, నా కుటుంబాన్ని కోల్పోకూడదనుకుంటున్నాను. ఈ గందరగోళం నుండి బయటపడటం ఎలా? ఈ సమస్యకు సీమా ఆనంద్ ఒక ఉదాహరణతో స్పష్టత ఇచ్చారు. సీమా ఆనంద్ తనకు ఓ వ్యక్తి నుంచి వచ్చిన మెసేజ్ ని చదువుతూ.."నాకు పెళ్లయి 12 ఏళ్లు. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కొద్దికాలం క్రితం మరో జంటతో ఫ్రెండ్ షిప్ ఏర్పడింది. అయితే క్రమంగా నాకు నా ఫ్రెండ్ భార్య మీద కోరిక కలగడం మొదలైంది. నాకు ఆమె డ్రెస్సింగ్ సెన్స్, ఆమె పరిణితి, ఆమె మాటతీరు, ఆమె మానసిక సృష్టత అన్నీ నన్ను బాగా ఆకట్టుకున్నాయి..ఇవన్నీ నా భార్యలో లేవు. ఫ్రెండ్ భార్య మీద నాకు సానుభూతి కూడా ఉంది..ఎందుకంటే ఆమెను తన భర్త తాగొచ్చి బాగా కొట్టేవాడు. కొన్నేళ్లుగా ఆమె ఈ బాధను భరిస్తోంది. నేను నా ఫీలింగ్స్ ని ఆమెకు తెలియజేయలేకపోతున్నా..ఆమెతో ఫ్రెండ్ షిప్ కోల్పోతానేమోనని భయంగా ఉంది..ఈ పరిస్థితుల్లో నన్నేం చేయమంటారు?అని ఓ వ్యక్తి నుంచి మెసేజ్ రాగా ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఎలా మసలుకోవాలో సీమా ఆనంద్ ఇలా సూచించారు.

ఆకర్షణకు వెంటనే స్పందించవద్దు
ఇలాంటి పరిస్థితి జీవితంలో చాలాసార్లు ఎదురకావచ్చు. ఇది ఒక పరీక్ష లాంటిది. ఆకర్షణ కలగడం తప్పు కాదు కానీ దాని గురించి పదేపదే ఆలోచిస్తూ దానికి లొంగిపోవడం తప్పు. ఇది కేవలం ఒక తాత్కాలిక భావోద్వేగమని గుర్తించి ఒక్క అడుగు వెనక్కి వేయాలి.
వివాహ బంధానికే తొలి ప్రాధాన్యం ఇవ్వండి
స్నేహం కన్నా, క్షణికమైన ఆకర్షణ కన్నా.. మీ వైవాహిక బంధం చాలా ముఖ్యమనదని, విలువైనదని గుర్తుంచుకోవాలి. మీ భార్య, మీ పిల్లలు, మీ కుటుంబం ప్రాముఖ్యతను గుర్తుచేసుకోండి. ఆకర్షణ అనే గాలివానకు మీ కుటుంబమనే పడవను ముంచేయవద్దని సీమా ఆనంద్ సూచించారు.
ఆకర్షణ కోసం జీవిత భాగస్వామిని దూరం చేసుకోవద్దు
ఈ ఆకర్షణ మోజులో పడి మీ జీవితంలో వెలుగు నింపిన భాగస్వామిని దూరం చేసుకోకండి. మీ భార్యలోని మంచి లక్షణాలను, ఆమె మీ కోసం చేసిన త్యాగాలను, కష్టసుఖాల్లో మీకు అండగా నిలిచిన సందర్భాలను గుర్తుకు తెచ్చుకోండి. మీ భావోద్వేగాలను నియంత్రించుకోవడం చాలా ముఖ్యం.
సాకులు వెతకడం అత్యంత ప్రమాదకరం
చాలామంది చేసే పెద్ద తప్పు ఇదే. అవతలి వ్యక్తితో దగ్గరవ్వడానికి లేదా ఎఫైర్ పెట్టుకోడానికి కారణాలు వెతుకుతారు. ఆమె భర్త ఆమెను సరిగ్గా చూసుకోడు లేదా వారి మధ్య సఖ్యత లేదు వంటి కారణాలను మనసులో సృష్టించుకోవడం మీ కాపురానికే ప్రమాదం. ఇతరుల జీవితంలోకి తొంగిచూస్తూ, మీ బంధాన్ని బలహీనపరచుకోవద్దు. ఆకర్షణ అనేది ఒక భావోద్వేగం మాత్రమే, కానీ మీ కుటుంబం అనేది మీ బాధ్యత. ఆకర్షణకు లొంగిపోవాలా లేక మీ అనుబంధాన్ని కాపాడుకోవాలా అనేది మీ విచక్షణ మీదనే ఆధారపడి ఉంటుంది.



Click it and Unblock the Notifications