Latest Updates
-
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.!
హస్త ప్రయోగం చేసుకునే వాళ్లకు స్వప్న స్కలనం జరగదా.. నిజమెంతా?
పురుషులు శృంగారంలో పాల్గొంటే వీర్య స్కలనం అవుతుందనే విషయం అందరికీ తెలిసిందే. అయితే చాలా మందికి నిద్రలో కూడా స్కలనం కూడా జరుగుతుంది. దీన్నే స్వప్నం స్కలనం అంటారు. లైంగిక వాంఛ కల్గినప్పుడు.. ముఖ్యంగా పెళ్లికి ముందు ఎక్కువగా ఇలాంటి భావనలు వచ్చినప్పుడు.. సెక్స్ పరమైన కలలు వస్తాయి. ఇది చాలా సహజమైన విషయం. తెలియకుండానే ఎవరో శృంగారంలో పాల్గొంటున్నారనే భావన కల్గుతుంది. దీంతో నిద్రలోనే పురుషులకు వీర్య స్కలనం జరుగుతుంది.

స్త్రీలలోనూ స్వప్న స్కలనం:
మొదడు శరీర అవయవాలకు సంకేతాలు పంపుతూనే ఉంటుంది. ఇలా తెలియకుండానే నిద్రలో వీర్యం పడిపోతుంది. ఆ తర్వాత మెలుకువ వస్తుంది. దీన్ని స్వప్న స్కలనం, వెట్ డ్రీమ్స్ అంటారు. వెట్ డ్రీమ్స్ అంటే ఓ వ్యక్తి నిద్రలోనే భావప్రాప్తి చెందడం. అది శృంగారభరితం కావచ్చు, కాకపోవచ్చు. అయితే చాలా మంది కేవలం పురుషులకు మాత్రమే స్వప్న స్కలనం జరుగుతుందనుకుంటారు. కానీ స్త్రీలలోనూ ఇది జరుగుతుంది. మగవాళ్లలో వీర్యం బయటకు వస్తే.. మహిళల్లో ఓ రకమైన ద్రవం బయటకు వస్తుంది.
స్వప్న స్కలనంతో పాత స్పెర్మ్ పోయి కొత్త స్పెర్మ్ ఉత్పత్తి:
స్త్రీ, పురుషులిద్దరూ తమ శృంగార కలల్లో దాదాపు 4 శాతం మంది భావప్రాప్తి పొందినట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ స్వప్న స్కలనం గురించి అందిరిలోనూ అనేక అనుమానాలు ఉంటాయి. స్వప్న స్కలనం మనిషి స్పెర్మ్ కౌంట్ ను తగ్గిస్తుందని కొందరి భావన. కానీ వాస్తవానికి అలా జరగదు. స్వప్న స్కలనం ద్వారా వృషణాలు పాత స్పెర్మ్ ను తొలగించి.. శరీరంలో కొత్త, ఆరోగ్యకరమైన స్పెర్మ్ ను సహజంగా ఏర్పడేలా చేస్తాయి. స్వప్న స్కలనం వల్ల వ్యక్తికి జలుబు లేదా ఇన్ఫెక్షన్ వంటి వాటిని తగ్గించి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కానీ ఇందుకు ఎలాంటి ఆధారమూ లేదు.
హస్తప్రయోగం చేసే వాళ్లలో స్వప్నం స్కలనం తక్కువ
యుక్త వయసులో ఇది సర్వసాధారణంగా జరుగుతుంది. ఆ తర్వాత కూడా వచ్చే అవకాశం ఉన్నప్పటికీ... పెళ్లికి ముందే ఎక్కువగా ఇలా జుగుతుంటుంది. హార్మోన్ల మార్పుల కారణంగా యుక్తవయసులో ఇలా అవుతుంటుంది. పెద్దవారిలో హార్మోన్ స్థాయిలు చాలా స్థిరంగా ఉంటాయి. తద్వారా వారికి స్వప్న స్కలనం అయ్యే అవకాశం తక్కువ. అబ్బాయిలు తరచుగా హస్తప్రయోగం లేదా లైంగిక సంబంధం కల్గి ఉండకపోవచ్చు. కాబట్టి పాత స్పెర్మ్ నిద్రలో విడుదల అవుతుంది. స్వప్న స్కలనం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలూ రావు. వయసు ప్రభావం అంతే.
ఎలాంటి ఆరోగ్య సమస్యలూ రావు:
హస్త ప్రయోగం చేసుకునే వాళ్లలో స్వప్న స్కలనం తగ్గుతుంది. అలాగే ఎవరితోనైనా లైంగికంగా కలిసినా స్వప్న స్కలనం కల్గదు. మరికొందరిలో అయితే స్వప్నం స్కలనం జరగడం వల్ల పురుషాంగం చిన్నగా అవుతుందని అనుకుంటారు. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. అవయవం తగ్గిపోవడానికి కారణం అయ్యే అనారోగ్యాలు, పరిస్థితులు లేదా సంఘటనలు ఇప్పటి వరకు వెలుగులోకి రాలేదు. ఇలా ఎవరికీ జరగలేదు. స్వప్న స్కలనం అయితే అదేదో తప్పు అని, ఆరోగ్య సమస్య అని భావించవద్దు. దాన్ని ఆపేందుకు కూడా ప్రయత్నించవద్దు.
మెత్తగా ఉన్న దిండు, పరుపు మీద పడుకున్నప్పుడు లేదా బోర్లా పడుకున్నప్పుడు ఎక్కువగా స్వప్న స్కలనం అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాగే అప్పుడప్పుడే సెక్స్ గురించి తెలుసుకోవడం, ఎవరైనా మీకు బాగా నచ్చడం వంటివి జరిగినా ఇలా మీకు తెలియకుండానే జరిగిపోతుంటుంది.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications