Latest Updates
-
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా..
హలో జెంట్స్! ఇవి నేర్చుకున్న తర్వాతే పెళ్లి చేసుకోండి.. లేకపోతే సుఖముండదు, సంతృప్తి ఉండదు
పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఓ నూతన అధ్యయంలా ఉంటుంది. ఇన్ని రోజులు ఏకాకిలా ఉన్న మీ జీవితంలో మరొకరు భాగం అవుతారు. పూర్తిగా కొత్తవారు, అంతకుముందు ఎలాంటి పరిచయం లేనివారు, వారి గురించి మీకేం తెలియదు, మీ గురించి వారికేం తెలియదు.. అలాంటి వ్యక్తులతో జీవితాంతం కలిసి ఉండాలి. సుఖదుఃఖాలు, కష్టనష్టాలు, శృంగార రహస్యాలు కూడా వారితో పంచుకోవాలి.

కొత్త వ్యక్తితో జీవితం అంత సులభంగా ఏం ఉండదు. ఇద్దరి మధ్య కలహాలు, గొడవలు వస్తూనే ఉంటాయి. అదే సమయంలో ఇద్దరి మధ్య ప్రేమ, అనుబంధం, నమ్మకం, విశ్వాసం, గౌరవం పెరుగుతూనే ఉంటాయి. రాబోయే నెలలో పెళ్లి ముహూర్తాలు ఉండనున్నాయి. చాలా మంది వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టడానికి రెడీగా ఉన్నారు. అయితే పెళ్లికి ముందు పురుషులు తప్పకుండా కొన్ని విషయాలు నేర్చుకోవాలి. లేకపోతే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇంట్లో ఎక్కువ సమయం గడపాలి
అబ్బాయిలు చాలా మంది ఇంట్లో కంటే బయటే ఎక్కువగా ఉంటారు. ఫ్రెండ్స్ తో తిరుగుతూ ఉంటారు. ఫ్రెండ్స్, కొలీగ్స్ తో చాలా టైమ్ స్పెండ్ చేస్తారు. కొంత మంది అయితే ఉదయం లేవగానే గ్రౌండ్ కు వెళ్లి క్రికెట్ ఆడతారు. మధ్యాహ్నం వరకు వచ్చి తినేసి పడకేస్తారు. సాయంత్రం లేచి ఫ్రెండ్స్ తో బాతాకానీకి బయల్దేరిపోతారు. వీలైతే రాత్రి సిట్టింగ్ వేస్తారు. లేదంటే అర్ధరాత్రి వరకు వారితో గడిపేసి.. ఇంట్లో అందరూ పడుకున్న తర్వాత ఇంటికి వస్తారు.
కానీ పెళ్లైన తర్వాత ఇవన్నీ మార్చుకోవాల్సిందే. మీ జీవితంలోకి వచ్చిన కొత్త భాగస్వామికి సమయం కేటాయించాలి. చాలా మంది స్త్రీలో అత్తమ్మలు, మామయ్యలతో త్వరగా కలిసిపోలేరు. మొదట్లో చాలా ఒంటరిగా ఫీలవుతారు. ఆ ఒంటరితనాన్ని పోగొట్టేందుకు పురుషులు ఇంట్లోనే ఉంటూ వారితో సమయం గడపాలి.
ఒంటరిగా నిర్ణయాలు తీసుకోవద్దు
పెళ్లయ్యాక మీ విషయాలు మీకు మాత్రమే సంబంధించినవి ఎంతమాత్రమూ కావు. అందులో మీ భాగస్వామికి కూడా భాగం ఉంటుంది. తినే తిండి దగ్గరి నుంచి ప్రతి దాంట్లో షేర్ ఉంటుంది. కాబట్టి ఒంటరిగా నిర్ణయాలు తీసుకోవడం మానేయాలి. అది ఏ విషయమైనా సరే ఇద్దరూ చర్చించి నిర్ణయం తీసుకోవాలి. ముఖ్యంగా.. ఆర్థిక విషయాలు, ఇద్దరిపై ప్రభావం చూపించేవి అయితే మరీ ముఖ్యంగా వారితో చర్చించి, వారి అభిప్రాయం తెలుసుకుని, ఇద్దరికీ ఏది మంచిది అని ఇద్దరూ అనుకుంటారో అదే నిర్ణయాన్ని తీసుకోవాలి.
ఖర్చులు తగ్గించుకోవాల్సిందే
పెళ్లికి ముందు ఏం చేసినా నడిచేది కావొచ్చు. కానీ పెళ్లయ్యాక అలా కాదు. మీరు, మీపై ఆధారపడి మరొకరు ఇంట్లో ఉంటారు. మీరు చేసే ఏ చిన్న ఖర్చు అయినా అది ఇద్దరిపై ప్రభావం చూపిస్తుంది. ఏదైనా ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయాలనుకున్నా.. మీ భాగస్వామికి చెప్పి చేయడం అలవాటు చేసుకోవాలి. నేను సంపాదిస్తున్నా.. నా ఇష్టం వచ్చింది కొనుక్కుంటా అనే ధోరణి మంచిది కాదు.
నెరవేర్చలేని హామీ ఇవ్వడం, భాగస్వామిని అవమానపరచడం, సరిహద్దులను సెట్ చేయకపోవడం లాంటి పనులు చేయకుండా చూసుకోవాలి.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications