Latest Updates
-
చిరుతిళ్లలో దీనికి సాటి లేదు.. పది నిమిషాల్లో పుదీనా ఫ్లేవర్తో కరకరలాడే మరమరాల మిక్స్చర్.! -
maggie masala : కూరల రుచిని రెట్టింపు చేసే మ్యాగీ మసాలా..ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండిలా! -
లిప్స్టిక్తో పెదాలు డ్రై అవుతాయా.. అధర అందం విషయంలో అతివలు చేసే పొరపాట్లు ఇవే.! -
చల్లటి పెరుగుతో చేటు: ఆయుర్వేదం ప్రకారం పెరుగు ఎలా తినాలి? ఎప్పుడు అసలు తినకూడదు? -
గణేశ్ చతుర్థి స్పెషల్.. తమిళనాడు స్టైల్లో నోరూరించే పరమాన్నం.. తింటే స్వర్గమే.! -
కర్ణాటక స్పెషల్ తర్కారీ పులావ్..బిర్యానీ కూడా దీనిముందు దిగదుడుపే! -
గాయమైన చోట పసుపు రాస్తున్నారా.. ఇంటి చికిత్స చేసేటప్పుడు ఈ పొరపాట్లు వద్దు.! -
సోషల్ మీడియాను ఊపేస్తున్న రెట్రో మేనియా.. 1980’s క్లాసిక్ లుక్ మీరూ ట్రై చేశారా.? -
వాహనం ఏ రంగులో ఉన్నా.. టైరు మాత్రం నల్లగానే ఎందుకుంటుందో తెలుసా? -
ఈ రాశి వారు శుక్రవారం ఈ పూజ చేస్తే ఇంట్లో అష్టైశ్వర్యాలు కొలువుదీరడం పక్కా.!
మీ భార్యతో ఆ సమయంలోనే ప్రేమగా ఉంటున్నారా.. అది ఎంత పెద్ద తప్పో తెలుసా.?
ఏ సంబంధమైనా ప్రేమ, నమ్మకం, అవగాహనతోనే బలంగా, దృఢంగా ఉంటుంది. కానీ కొన్ని రిలేషన్‌షిప్స్‌లో గొడవలు, విభేదాలు సహజం. అయితే ఆ సంబంధఆలు అకస్మాత్తుగా విచ్ఛిన్నం కావని.. చిన్న, పట్టించుకోని అలవాట్ల కారణంగానే అవి క్రమంగా బలహీనపడతాయని మానసిక నిపుణులు అంటున్నారు. ఈ క్రమంలో పురుషులు మాట్లాడే మాటలు, ప్రవర్తనలు, ప్రతిచర్యల ద్వారా విభేదాలు వస్తాయని గమనించరు. ఇవి ఆరంభంలో చిన్నగా అనిపించినా.. అవే క్రమంగా వారి మధ్య దూరాన్ని పెంచుతాయని చెబుతున్నారు.

భార్యాభర్తల రిలేషన్‌షిప్‌లో శారీరక బంధం ఎంత బలంగా ఉండాలో భావోద్వేగ బంధమూ అంతే దృఢంగా ఉండాలని.. అదే బంధానికి అత్యంత బలమైన పునాది అని రిలేషన్‌షిప్ ఎక్స్‌పర్టస్ సూచిస్తున్నారు. అయితే దంపతుల్లో ఒకరు తమ మాట వినడం లేదని, తమను పట్టించుకోవడం లేదని, తమకు తగిన విలువ ఇవ్వడం లేదని ఫీలవుతుంటారు. క్రమంగా అది వారి మధ్య దూరాన్ని పెంచుతుంది. అయితే ఈ సంకేతాలను ముందుగానే గుర్తించడం ద్వారా తప్పులను సరిచేసుకుని ప్రేమను పెంచుకోవచ్చు. ముఖ్యంగా పురుషులు కొన్ని విషయాల్లో తమ తప్పులను సరిదిద్దుకుంటే బంధాన్ని బలోపేతం చేసుకోవచ్చు.
భావోద్వేగ లోపం
భార్యాభర్తల బంధంలో కొందరు పురుషులు భాగస్వామితో శారీరకంగా కలిసి ఉన్నా.. భావోద్వేగపరంగా దూరంగా ఉంటారు. ఇంకా పని ఒత్తిడి, మొబైల్ ఫోన్‌ను ఎక్కువగా చూడటం, సరిగా మాట్లాడకపోవడం, భార్య మాట్లాడుతుంటే పట్టించుకోకుండా, వినకుండా ఉండటం, వారి ఆసక్తులకు విలువ ఇవ్వలేకపోవడం వంటివి కొందరు పురుషులు చేసే సాధారణ పొరపాట్లు. అయితే ఇవే చాలా ప్రమాదకరం. రిలేషన్‌షిప్‌లో దంపతులు కేవలం కలిసి ఉంటే సరిపోదని.. ఒకరి మాట ఒకరు వింటూ, అర్థం చేసుకోవడం, సమయం ఇవ్వడం కూడా అంతే ముఖ్యమని గుర్తుంచుకోవాలి. భార్యతో ఏకాంత సమయంలో కాసేపు మాట్లాడటం బంధాన్ని బలంగా ఉంచుతుంది.

అప్పుడే ప్రేమను చూపించడం..
కొందరు భర్తలు.. భార్య దగ్గర పడక గదిలో మాత్రమే ఆప్యాయత, ప్రశంసలు, కౌగిలింతలు, ప్రేమను చూపించడం చేస్తుంటారు. ఇది శారీరక స్పర్శకు సరిపోదని.. రూపం కంటే మానసిక బంధానికి ప్రాధాన్యత ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. చేతులు పట్టుకుని మాట్లాడటం, యోగక్షేమాలు తెలుసుకోవడం, ప్రశంసించడం, చిన్న చిన్న ప్రశంసలు.. వారి మధ్య సాన్నిహిత్యాన్ని పెంచుతాయి.
మనసులోని బాధను గుర్తించడం…
భార్య ఏదైనా సమస్యను, భావాన్ని భర్తతో పంచుకున్నప్పుడు వెంటనే భర్త దానికి పరిష్కారం లేదా సలహా ఇస్తారు. అయితే ఇలా కాకుండా ఎదుటి వ్యక్తి చెప్పేది పూర్తిగా విని, భావాలను అర్థం చేసుకోవాలి. తక్షణ పరిష్కారం కాకుండా సానుభూతి, సహనం, మద్దతు అందించడం ద్వారా మీ నుంచి మీ భార్య మీ నుంచి ఏం కోరుకుంటున్నారనేది అర్థమవుతుంది.

అహం ప్రదర్శన
భార్యాభర్తల బంధంలో అభిప్రాయ భేదాలు రావడం సహజమే కానీ.. అహం, మొండితనం కారణంగా మాట్లాడకుండా ఉంటారు. దీంతో చిన్న అపార్థాలు సైతం పెద్దవిగా మారి ఇద్దరి మధ్యా గొడవకి దారితీస్తుంది. తప్పెవరిది అయినా తమ తప్పు తెలుసుకుని వెంటనే క్షమాపణ చెప్పడం, ప్రశాంతంగా వాదనను పరిష్కరించుకోవడం, నిజాయితీతో కూడిన సంభాషణ ద్వారా మీ మధ్య దూరం తగ్గి బంధం పదిలంగా ఉంటుంది.
సంకేతాలను అర్థం చేసుకోలేకపోవడం
భర్త కోపంగా ఉన్నప్పుడు మాట్లాడకుండా, వాదించకుండా మౌనంగా ఉండటం అలవాటు చేసుకుంటారు. ఇది ఇలాగే కొనసాగితే ఆ బంధానికి మంచిది కాదు. భార్యపై ప్రతిదానికి నింద వేయకుండా, సరైన సంభాషణ ద్వారా కోపాన్ని తగ్గించుకోవచ్చు. దీని ద్వారా ఒకరిపై ఒకరికి నమ్మకం పెరుగుతుంది.



Click it and Unblock the Notifications
