Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
ఈ టిప్స్ పాటిస్తే చాలా ఈజీగా కోట్లలో డబ్బులు సంపాదించొచ్చు, ఎలా అంటే?
డబ్బులు సంపాదించాలనే ఆలోచన అందరికీ ఉంటుంది. డబ్బులు సంపాదించాలని అందరూ ఎంతో కస్టపడి పని చేస్తుంటారు. కానీ డబ్బు సంపాదించడం అందరికీ సాధ్యం కాదు. అయితే నిపుణుల ప్రకారం.. డబ్బు సంపాదించడం చాలా సులభం. ధనవంతులు అవ్వడం కూడా చాలా ఈజీ. ఎలా అంటే.. డబ్బును సమర్థవంతంగా పొదుపు చేయడం మాత్రమే ఆర్ధిక ప్రగతికి కారణమవుతుంది.
ఎప్పటికప్పుడు కొంత మొత్తంలో డబ్బు పొదుపు చేస్తూ, చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకొని ముందుకు వెళ్తే డబ్బులు సంపాదించడం సాధ్యం అవుతుంది. అయితే, డబ్బు సంపాదించడానికి సరైన యోచన, ప్రణాళిక అవసరం. ప్రతి ఒక్కరూ వారి అవసరాలకు అనుగుణంగా బలమైన గోల్స్ సెట్ చేసుకోవాలి. మీరు ప్రణాళికతో ముందుకు సాగితే, డబ్బు సంపాదించడం సులభం అవుతుంది. ఈ స్టోరీలో డబ్బులు సంపాదించడానికి ఎలాంటి ప్రణాళికలు వేసుకోవాలి అనేది తెలుసుకుందాం.

1. బడ్జెట్ ప్రణాళిక
ఏ ఇతర వ్యవహారంలోనైనా సరే, బడ్జెట్ పెట్టుకోవడం అనేది చాలా ముఖ్యం. అందుకోసం 50-30-20 నియమాన్ని పాటించడం చాలా లాభదాయకం. ఇందులో 50% ను నెలవారీ ఖర్చులకు, 30%ను అవసరమైన వస్తువులకు మరియు 20%ను పొదుపు కోసం కేటాయించండి. ఇలా ఉంటే ఆర్థికంగా మీరు క్రమ క్రమంగా ఎదుగుతారు. అలాగే, ఖర్చులు ఎన్ని జరుగుతున్నాయో, ఎన్ని ఆదాయం వస్తున్నాయో ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. అవసరం లేని వాటిని దాటవేయడం మంచిది.
2. తక్కువ రిస్క్ పెట్టుబడులు
మనం చేసుకునే సేవింగ్స్‌లో రెండు రకాలు ఉంటాయి. తక్కువ రిస్క్, అధిక రిస్క్. అయితే పెట్టుబడులు పెట్టేటప్పుడు తక్కువ రిస్క్ పెట్టుబడులు మొదటగా ఎంచుకోవడం మంచిది. ఇవి మెల్లగా అయినా, కాలక్రమేణా మంచి లాభాలను ఇస్తాయి. అధిక రిస్క్ పెట్టుబడులు మరింత లాభం వచ్చే అవకాశం ఉన్నప్పటికీ, వాటివల్ల భారీగా నష్టాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే తక్కువ రిస్క్ పెట్టుబడులు మీకు ఎక్కువ స్థిరమైన లాభాలను అందిస్తాయి.
3. ఆర్థిక మరియు విద్యా ప్రణాళిక
మీ ఫైనాన్షియల్ లైఫ్, విద్య, ట్యాక్స్ ప్లానింగ్, ఇన్స్యూరెన్స్ వంటి అంశాలను ముందుగానే ప్రణాళిక చేసుకోవడం చాలా ముఖ్యం. అలాగే ఆ వ్యవహారాలపై అవగాహన కలిగి ఉండటం వల్ల, మీరు ఎలాంటి సమస్యలకు లోనవకుండా.. మీ ఆర్థిక వ్యవహారాలను సజావుగా నిర్వహించగలుగుతారు.
4. ఎమర్జెన్సీ ఫండ్
మన జీవితంలో అనూహ్య పరిస్థితులు ఏర్పడవచ్చు. అనారోగ్యం, కుటుంబంలో బాధ్యతలు, అనుకోని ఖర్చులు రావచ్చు. అందుకే, ముందుగానే ఒక అత్యవసర ఫండ్‌ను సృష్టించడం చాలా అవసరం. ఈ ఫండ్ ఉపయోగించి మీరు ఇలాంటి సమయాల్లో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులకూ లోనవకుండా సజావుగా బడ్జెట్‌ను నిర్వహించుకోవచ్చు.
5. అవసరం లేని లగ్జరీ
లగ్జరీ జీవితం కోసం ఎక్కువగా ఖర్చు చేస్తే, అదనపు అప్పులు మరియు బాధ్యతలు పెరుగుతాయి. కాబట్టి, లగ్జరీ ఖర్చులను తగ్గించి, సేవింగ్స్‌ను ప్రాధాన్యత ఇవ్వడం ఉత్తమం. మొదటి దశలో సేవింగ్స్ పెంచి, తర్వాత అవసరమైన వాటిని అలవాటు చేసుకుంటే, జీవితంలో సుఖసమృద్ధి పెరుగుతుంది.
6. అప్పులు
పెద్దగా అప్పులు తీసుకోవడం ఫైనాన్సియల్ చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది. క్రెడిట్ కార్డు, పర్సనల్ లోన్‌లు, అధిక వడ్డీతో ఉన్న అప్పులు తీసుకోవడం పూర్తిగా మానేయాలి. ఇందు వల్ల మీరు ఆర్థిక ఒత్తిడికి గురికాకుండా, ప్రశాంతంగా ఉంటారు. అప్పులు తప్పించి సేవింగ్స్ పెంచడం, డబ్బును సమర్థవంతంగా మెయింటైన్ చేయడం వల్ల కచ్చితంగా డబ్బు సంపాదించడంతో పాటు రిచ్ అవుతారు.



Click it and Unblock the Notifications