Latest Updates
-
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది -
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారంటే!
మంచి భర్త లక్షణం అదే..వైవాహిక జీవితంపై ప్రియాంక చోప్రా భర్త నిక్ జోనాస్ ఆసక్తికర వ్యాఖ్యలు!
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా భర్త, అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనాస్ ఇటీవల తన వైవాహిక జీవితం, పితృత్వం గురించి ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు.
ప్రముఖ లైఫ్ స్టైల్ కోచ్ జే శెట్టి నిర్వహించే ఆన్ పర్పస్ పాడ్ కాస్ ట్‌లో పాల్గొన్న నిక్, ఒక మంచి భర్తగా, తండ్రిగా తన బాధ్యతలను ఎలా నిర్వచిస్తారో వివరించారు.

నమ్మకమే పునాది
ఒక మంచి భర్తగా ఉండటానికి మీరు ఏం చేస్తారు? అని జే శెట్టి అడిగిన ప్రశ్నకు నిక్ సమాధానంగా.. నా దృష్టిలో మంచి భర్త అంటే కేవలం ప్రేమించడమే కాదు.. నమ్మకంగా, నిజాయితీగా ఉండటం. పక్కన ఉన్న మనిషి మనల్ని పూర్తిగా విశ్వసించేలా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా నేనున్నాననే భరోసా ఇచ్చేలా ప్రవర్తించడమే అసలైన బంధం అని చెప్పాడు.
జీవితం అనేది ఎన్నో భావోద్వేగాల మిశ్రమమని, కొన్నిసార్లు దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు, మనం ఆధారపడగలిగే భాగస్వామి తోడుంటే ఆ ప్రయాణం చాలా ఈజీ అవుతుందని నిక్ తెలిపారు.
కూతురు కోసం ఆదర్శంగా..
తన కూతురు మాలతి మేరీ భవిష్యత్తు గురించి నిక్ ఆలోచించే విధానం ప్రతి ఒక్కరికీ ఆదర్శం. నేను నా భార్య ప్రియాంకతో ఎలా ప్రవర్తిస్తున్నానో నా కూతురు నిశితంగా గమనిస్తూనే ఉంటుంది.. భవిష్యత్తులో తను పెద్దయ్యాక, తనను ప్రేమించే వ్యక్తిని ఎంచుకునేటప్పుడు.. నేను ప్రియాంకను చూసుకున్న విధానమే ఆమెకు ప్రామాణికం అవుతుంది.
అందుకే ప్రియాంకను సంతోషంగా, సురక్షితంగా, ఎప్పుడూ నవ్వుతూ ఉండేలా చూసుకోవడం నా కనీస బాధ్యత.. తద్వారా నా కూతురు కూడా ఒక మంచి బంధం ఎలా ఉండాలో అర్థం చేసుకోగలదు అని నిక్ ఉద్వేగభరితంగా చెప్పారు.
కన్నీళ్లు తెప్పించే మాలతి పుట్టుక
ఇదే సంభాషణలో తన కూతురు మాలతి పుట్టినప్పుడు ఎదుర్కొన్న గడ్డు పరిస్థితులను నిక్ గుర్తుచేసుకున్నారు. 2022 జనవరిలో సరోగసీ ద్వారా జన్మించిన మాలతి.. అనుకున్న సమయం కంటే చాలా ముందుగా పుట్టింది. ఆ
మె పుట్టినప్పుడు కేవలం 1 పౌండ్ బరువు మాత్రమే ఉందని.. ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ, శరీరం రంగు మారిపోయి ఉందని.. ఆ క్షణంలో NICUలోని వైద్య బృందం ఆమెను బతికించడానికి పడిన కష్టం మాటల్లో చెప్పలేనని.. సుమారు మూడున్నర నెలల పాటు హాస్పిటల్ లో మృత్యువుతో పోరాడి ఆమె నెమ్మదిగా కోలుకుందని.. ఆ సమయంలో కోవిడ్ ఆంక్షల మధ్య తాను, ప్రియాంక చెరో 12 గంటలు హాస్పిటల్ లోనే ఉంటూ పాపను కంటికి రెప్పలా కాపాడుకున్నాం అంటూ నిక్ ఎమోషనల్ అయ్యారు.
కాగా,2016లో ఒక సోషల్ మీడియా మెసేజ్‌తో మొదలైన నిక్-ప్రియాంకల ప్రయాణం, 2018లో వివాహ బంధంతో ఒక్కటైంది.



Click it and Unblock the Notifications