Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
ఆ సమయంలో శృంగారం చేసేటోళ్లకి భారీ అదృష్టం..ఈ విషయం తెలిస్తే ఎగిరి గంతేస్తారు!
శృంగారానికి సరైన సమయం ఏది? గాఢమైన రాత్రి చీకటిలోనా, లేక రోజును ప్రారంభించే ఉదయపు తొలి కిరణాలలోనా? ఇది ఎప్పటినుంచో ఉన్న చర్చే. రాత్రివేళ భాగస్వామి స్పర్శ, ఏకాంతం శృంగారాన్ని మరో స్థాయికి తీసుకెళ్తాయని కొందరు వాదిస్తే ఉదయం వేళ ఉండే తాజాదనం, నూతనోత్తేజం శారీరక ఆనందానికి అసలైన సమయమని మరికొందరు నమ్ముతారు. ఈ వాదనలు ఎలా ఉన్నా, ఆధునిక వైద్య శాస్త్రం మాత్రం ఉదయం పూట శృంగారానికే తన ఓటు వేస్తోంది.
రాత్రంతా విశ్రాంతి తీసుకోవడం వల్ల ఉదయాన్నే శరీరంలోని ప్రతి అవయవం నూతనోత్సాహంతో, చురుకుగా ఉంటుంది. అంతేకాకుండా లైంగిక వాంఛను ప్రేరేపించే టెస్టోస్టెరాన్ వంటి హార్మోన్లు ఉదయం పూట గరిష్ఠ స్థాయిలో ఉంటాయి. అందుకే సంపూర్ణ తృప్తిని, శారీరక ఆనందాన్ని పొందడానికి ఉదయం వేళే అత్యంత అనువైనదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కేవలం ఆనందం, తృప్తి మాత్రమే కాదు, ఉదయం పూట శృంగారం వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ చూడండి.

మానసిక ప్రశాంతత, రోజంతా ఉల్లాసం
రాత్రిపూట భాగస్వామితో చిన్న చిన్న వాదనలు జరిగాయా? ఉదయం పూట సాగే శృంగారం ఆ చేదు జ్ఞాపకాలను చెరిపేసి, మీ బంధంలోకి సరికొత్త తాజాదనాన్ని తెస్తుంది. శారీరక కలయిక సమయంలో శరీరంలో ఆక్సిటోసిన్, డోపమైన్ వంటి లవ్ హార్మోన్లు రిలీజ్ అవుతాయి. ఇవి ఒత్తిడిని తగ్గించి, మనసును ప్రశాంతంగా ఉంచుతాయి. ఫలితంగా రోజంతా మానసిక స్థితి ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటుంది. పనిలో ఎంత ఒత్తిడి ఎదురైనా, దాన్ని చిరునవ్వుతో ఎదుర్కొనే శక్తి లభిస్తుంది.
రోగనిరోధక శక్తికి బూస్ట్
ఉదయాన్నే శృంగారం శరీరానికి ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఈ సమయంలో ఇమ్యునోగ్లోబులిన్-A అనే యాంటీబాడీ ఉత్పత్తి పెరుగుతుంది. ఇది మన రోగనిరోధక వ్యవస్థను పటిష్టం చేసి, జలుబు, ఫ్లూ వంటి సాధారణ ఇన్ఫెక్షన్ల నుండి మనల్ని కాపాడుతుంది.
జ్ఞాపకశక్తికి పదును
ఉదయం పూట శృంగారం మెదడుకు ఒక మంచి వ్యాయామం లాంటిది. ఈ ప్రక్రియలో జరిగే హార్మోన్ల హెచ్చుతగ్గులు మెదడును మరింత చురుగ్గా, అప్రమత్తంగా మారుస్తాయి. మెదడు పనితీరు మెరుగుపడటం వల్ల రోజంతా చేసే పనులలో ఏకాగ్రత పెరుగుతుంది. అంతేకాకుండా ఇది జ్ఞాపకశక్తిని కూడా పదును పెడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.
వ్యాయామానికి ప్రత్యామ్నాయం
పొద్దున్నే లేచి చెమటలు కక్కుతూ వ్యాయామం చేయడం అంటే చాలామందికి బద్ధకమే. అలాంటి వారికి ఉదయం శృంగారం ఒక అద్భుతమైన, ఆహ్లాదకరమైన ప్రత్యామ్నాయం. అరగంట శృంగారం వల్ల దాదాపు 100 కేలరీలు బర్న్ అవుతాయని అంచనా. ఇది బరువును నియంత్రణలో ఉంచడమే కాకుండా వివిధ భంగిమల వల్ల శరీరానికి మంచి స్ట్రెచింగ్ కూడా లభిస్తుంది. వ్యాయామం వల్ల కేవలం శారీరక శ్రమ ఉంటే దీనివల్ల శారీరక ఆనందం, మానసిక ప్రశాంతత రెండూ దక్కుతాయి.
మెరుగైన లైంగిక జీవితం
రోజంతా పనిచేసి అలసిపోయిన శరీరం రాత్రివేళ శృంగారానికి పూర్తిగా సహకరించకపోవచ్చు. కానీ రాత్రంతా విశ్రాంతి తీసుకున్న శరీరం ఉదయాన్నే శక్తితో ఉరకలేస్తుంటుంది. హార్మోన్ల స్థాయి కూడా అధికంగా ఉండటంతో లైంగిక వాంఛలు సహజంగానే ఎక్కువగా ఉంటాయి. ఇది భాగస్వాములిద్దరికీ అద్భుతమైన అనుభూతిని అందించి, సంపూర్ణ తృప్తిని కలిగిస్తుంది.



Click it and Unblock the Notifications