Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
అత్తాకోడళ్ల యుద్ధానికి శాశ్వత పరిష్కారం ఇదే..ఇక జన్మలో ఏ గొడవ ఉండదు!
అత్తాకోడళ్లు తళ్లి కూతుళ్ల మాదిరి కలిసి ఉంటే ఆ ఇళ్లు ప్రశాంతంగా ఉంటదని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. అయితే ఈ రోజుల్లో అది దాదాపు అసాధ్యంగా మారిపోతుంది. అత్త లేని కోడలు ఉత్తమురాలుగా..కోడలు లేని అత్త గుణవంతురాలుగా అదేదో సినిమా పాటలో చెప్పినట్లుగానే ప్రస్తుతం సమాజంలో పరిస్థితులు కనబడుతున్నాయి. ఇంట్లో అతాకోడళ్ల సమస్య వల్ల చాలామంది మగవాళ్లకు పిచ్చెక్కిపోతుంటది. అతాకోడళ్ల సమస్య భార్యాభర్తల మధ్య చీలికను కూడా తెస్తోంది.
అయితే అత్తాకోడళ్ల సమస్య కు పరిష్కారం చాలా సింపుల్ అని..పరస్పర గౌరవం, అవగాహన, సహనం ఉంటే చాలని కొందరు నిపుణులు చెబుతుంటారు. అయితే ఆచరణలో మాత్రం సమాజం ఎప్పుడూ ఆ సర్దుకుపోవాల్సిన భారాన్ని కోడలి భుజాలపైనే మోపుతుంది. నువ్వే సర్దుకుపోవాలి అమ్మాయి అనే సలహా ప్రతి ఇంట్లోనూ వినిపిస్తూనే ఉంటుంది. ఇది ఎంతవరకు సమంజసం? ఈ సమస్యకు పరిష్కారం ఒక్కరిలో లేదు, ముగ్గురి సమష్టి బాధ్యతలో దాగి ఉందని రిలేషన్ షిప్ నిపుణులు చెబుతున్నారు.

మొదటి అడుగు..కొడుకు బాధ్యత
చాలామంది భారతీయ తల్లులు తమ జీవితాన్ని పిల్లల కోసమే అంకితం చేస్తారు. ఇది దాదాపు అన్నీ ఇళ్లల్లో మనం చూస్తున్నాం. భర్త తర్వాత తమ భవిష్యత్తుకు కొడుకే సర్వస్వం అని భావిస్తారు. అలాంటి తల్లి.. కొడుకుకి పెళ్లవగానే తన ప్రాధాన్యత తగ్గిపోతుందేమో, తన భవిష్యత్తు అభద్రతలో పడుతుందేమోనని భయపడటంలో ఆశ్చర్యం లేదు. ఈ భయాన్ని తొలగించాల్సిన బాధ్యత పూర్తిగా కొడుకుదే. తన పెళ్లికి ముందే తల్లికి ఒక రకమైన ఆర్థిక భద్రతను కల్పించడం, ఏ పరిస్థితుల్లోనూ నీకు నేనున్నాను అనే భరోసాను ఇవ్వడం అతని ప్రథమ కర్తవ్యం. ఇది జరిగితే అత్తగారిలో ఉండే అభద్రతాభావం చాలా వరకు తగ్గిపోయి, కొత్తగా వచ్చే కోడలిని సానుకూలంగా స్వాగతించే అవకాశం పెరుగుతుంది.
రెండో అడుగు..ముందస్తు చర్చలు
కాబోయే అత్తగారు, కోడలు, కొడుకు/భర్త.. ఈ ముగ్గురూ కలిసి కూర్చుని తమ తమ అంచనాలు, ఆశలు, భయాల గురించి బహిరంగంగా మాట్లాడుకోవాలి. ఇది ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి, అపోహలకు తావులేకుండా బంధాన్ని ప్రారంభించడానికి సహాయపడుతుంది.

మూడో అడుగు..వ్యక్తిగత మార్పు
పెళ్లయ్యాక, ఈ బంధంలో ముగ్గురి దృక్పథంలోనూ మార్పు రావాలి. అత్తగారు..నా కొడుకు ఇప్పుడు ఒకరి భర్త. తనకంటూ ఒక కొత్త జీవితం మొదలైంది అనే వాస్తవాన్ని అంగీకరించాలి. కొడుకు.. తల్లి ప్రేమను, భార్య బంధాన్ని సమన్వయం చేయాలి. ఉన్నట్టుండి అమ్మ చీర కొంగు వదిలి భార్య శాలువాలోకి మారిపోకూడదు. ఆ మార్పు నెమ్మదిగా, ఇద్దరినీ గౌరవిస్తూ జరగాలి.
కోడలు కూడా..ఆమె నా భర్తకు జన్మనిచ్చిన తల్లి, అంటే నాకు కూడా తల్లితో సమానం అనే సానుభూతితో చూడాలి. తన తల్లి స్థానంలో ఆమెను ఊహించుకుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
నాలుగో అడుగు..అపోహలకు అడ్డుకట్ట
కోడలు కొడుకుని దూరం చేయడానికి వచ్చింది, అత్తగారు ఎప్పుడూ రాక్షసిలాగే ఉంటుంది వంటి పాతకాలపు అపోహలను మనసులో పెట్టుకుని కొత్త బంధంలోకి అడుగుపెడితే ప్రశాంతతకు చోటుండదు. ఇక్కడే కొడుకు ఒక వారధిలా పనిచేయాలి. తల్లి మంచి గుణాలను భార్యక, భార్యలోని సానుకూలతను తల్లికి చెబుతూ ఇద్దరి మధ్య ఒక సద్భావ వాతావరణాన్ని సృష్టించాలి. అత్తాకోడళ్ల సమస్యకు పరిష్కారం కేవలం కోడలు సర్దుకుపోవడంలో లేదు. కొడుకు బాధ్యతాయుతంగా వ్యవహరించడంలో, అత్తగారు వాస్తవాన్ని అంగీకరించడంలో, ముగ్గురూ కలిసికట్టుగా ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో ఉంది.



Click it and Unblock the Notifications