Latest Updates
-
కృష్ణాష్టమి స్పెషల్ అటుకులు నువ్వుల లడ్డూ..10 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
కృష్ణాష్టమి స్పెషల్: కన్నయ్య మనసు దోచే అటుకుల పాయసం..ఇంట్లోనే చేయండిలా -
మగవారూ అలర్ట్ : మూత్రం పోశాక కూడా చుక్కలు కారుతున్నాయా? ఈ 3 వ్యాధులకు సంకేతం కావచ్చు! -
ఈ కృష్ణాష్టమికి ఇంట్లోనే.. 100% పవిత్రమైన పంచామృత కేక్ తయారు చేయండిలా! -
రోడ్ సైడ్ స్టైల్ ఎగ్ శార్వా..చపాతీ, దోశ, పరోటాల్లోకి అమృతంలా! -
గ్యాస్, అజీర్తి అని ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారా? ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ముప్పు కావచ్చు, జాగ్రత్త! -
ఆడవారైనా, మగవారైనా అస్సలు తాగకూడని డ్రింక్ ఏంటో తెలుసా.. డాక్టర్ సలహా ఇదే.! -
ఇడ్లీ, దోశలతో విసిగిపోయారా? ప్రొటీన్ల నిధి,బలాన్నిచ్చే ఎగ్ పరాఠా ట్రై చేయండి! -
సైలెంట్ కిల్లర్స్: పైకి ముక్కుసూటి.. వెనుక మహా కిలాడీలు!..ఈ 3 రాశులు ఎవరో తెలుసా? -
వినాయక చవితి స్పెషల్..ఇంట్లోనే ఈజీగా నోరూరించే చాక్లెట్ మోదక్ ఎలా చేసుకోవాలంటే..
పెళ్లికి ముందు ఈ ప్రశ్నలు అడగడం మిస్ కావద్దు...!
పెళ్లి జీవితంలో చాలా పెద్ద చాప్టర్. ఒకరి జీవితంలోకి పెళ్లి ప్రవేశించగానే ఇక ఆ వ్యక్తి జీవితం పెళ్లికి ముందు పెళ్లికి తరువాతలా మారిపోతుంది. ఇలాంటి అతి పెద్ద విషయానికి సంబంధించి ముందుగా తీసుకునే జాగ్రత్తలు చాలా వుంటాయ్. వంద అబద్ధాలు ఆడైనా సరే ఒక పెళ్లి చేయాలి అనేది పాత సామెత. కానీ ఏ అబద్దాలు లేకుండా చెక్ చేసుకొని చేసుకోవాలనేది నిపుణుల సూచన. వివాహమనేది జీవితకాలంపాటు ఉండే బంధం. కాబట్టి ఈ జీవితకాల బంధాన్ని ఏర్పరుచుకునే ముందు పార్ట్‌నర్‌ను కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను అడగాల్సిన అవసరముంది. అలాంటి ముఖ్యమైన ప్రశ్నలను మీకోసం ప్రత్యేకంగా అందిస్తుున్నాము.
పెళ్లికి ముందు ఖచ్చితంగా అడగాల్సిన ప్రశ్నలు ?
మన ఇద్దిర మధ్య ఏ విషయంలోనైనా గొడవ వస్తే అప్పుడు ఆ గొడవను నువ్వెలా హ్యాండిల్ చేస్తావు ?
నీలో వున్న నెగిటివిట్ పాయింట్స్ ఏవి ? నిన్ను నువ్వు మార్చుకోవాలనుకుంటున్నా అంశాలు ఏంటి ?

జీవితంలో కలిసి బ్రతకాలని నిర్ణియించుకున్నప్పుడు చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటి సందర్భంగా రాజీపడితేనే మరింత ముందుకు ప్రయాణిస్తారు. గొడవలు వచ్చినప్పుడు రాజీపడతారా లేదా ఖచ్చితంగా ప్రశ్నించాలి.
శృంగారంలో గర్భనిరోధక మాత్రలు వాడుతారా ? ఉపయోగిస్తే ఎలాంటివి ఉపయోగిస్తారో తెలుసుకోవాలి.
పెళ్లి తరువాత పెద్ద కుంటుంబంలో వుండాలనుకుంటున్నారా లేక భర్త, భార్య పిల్లలు వుంటే చాలనుకుంటున్నారా ప్రశ్నించాలి.
నతో ఉండడంలో కన్నా మెరుగైన పరిస్థితులు, అవకాశాలు వేరే దగ్గర వస్తే అప్పుడేం చేస్తారు ? లేదా ఇంకా బంధంలోనే కొనసాగుతారా ?
వంశపారంపర్యంగా ఇంట్లో వారికి ఏవైనా అనారోగ్య పరిస్థితులు వున్నాయా? పక్షవాతం, ఆస్తమా, గుండెపోటు లాంటివి తాత, తండ్రి, ఇంట్లో ఎవరికైనా వున్నాయా కనొక్కోవాలి.
ఒక నెలలో తీవ్రమైన ఆర్థికసమస్యలు గనక వస్తే ఇంట్లో ఏవస్తువలను కొనడాన్ని ఆపుకుంటారు.
నువ్వు సాధారణంగా ఏ పని చేసినా నీకు నువ్వు నిర్ణయం తీసుకుంటావా లేక తల్లిదండ్రులను అడిగి చేస్తావా.
ఆర్థికపరంగా మీకు ఎలాంటి లక్ష్యాలు వున్నాయ్. వచ్చిన ఆదాయం నుంచి ఎలా సేవ్ చేద్దామనుకుంటున్నారు. మీకు సేవింగ్ ప్లాన్స్ ఎలా వున్నాయ్.
నాతో కలిసి జీవిస్తే 10 సంవత్సరాల తరువాత నిన్ను నువ్వు ఎలా ఉహించుకుంటావు.
పిల్లలను కనడం విషయంలో వారి ఆలోచనలు ఎలా వున్నాయ్ ? పిల్లలను ఎలా పెంచుదామనుకుంటున్నారు ? ఎంత మంది పిల్లలను కనే ప్లాన్ వుంది ? మొదట ఏ బిడ్డ కావాలనుకుంటున్నారు ఎందుకు ?
మీరు ఎక్కువగా ఏ విషయంలో భయపడతారు ? నన్ను పెళ్లి చేసుకోవడానికి ఏదైనా విషయంలో భయంగా ఫీల్ అవుతున్నట్టు మీకు అనిపించిందా ?
సెక్స్ పై మీ అభిప్రాయం ఏంటి , సెక్స్‌ను ఎలా భావిస్తారు ? సెక్స్ అనుభూతి అంతకు ముందు ఉందా ? ఇలాంటి ప్రశ్న కొన్న గొడవలకు దారితీసినా ఖచ్చితంగా పెళ్లికి ముందు నిస్సంకోచంగా అడగాలి ?
మీ దృష్టిలో పెళ్లి అంటే ఏమనుకుంటున్నారు ? పెళ్లి చేసుకోకపోతే ఏమవుతుంది ? పెళ్లి చేసుకోవడం వల్ల కలిగే లాభాలు ఎలా వుంటాయ్ ?
మీ ఫ్రెండ్ సర్కిల్ ఎలా వుంటుంది ? ఎంత మంది స్నేహితులున్నారు ? ఎలాంటి స్నేహితులున్నారు ?



Click it and Unblock the Notifications