Latest Updates
-
దేవుడు మీకు సంకేతాలు ఇస్తున్నాడా? ఈ సూచనలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు -
ప్రేమ పేరిట జైలు జీవితం గడుపుతున్నారా? మీ భాగస్వామిలో ఈ లక్షణాలు ఉంటే అది విషపూరిత బంధమే! -
కొబ్బరి చేపల పులుసు ఇలా చేస్తే అద్భుతమైన రుచి..రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ కోసం ఆ సీక్రెట్ రివీల్! -
జూన్ 1, 2026: ఈ రాశుల వారికి ఊహించని ధనలాభం.. కెరీర్లో తిరుగులేని విజయాలు మీ సొంతం! -
లో బీపీ ఉన్నప్పుడు ఉప్పు నీళ్లు తాగడం సరక్షితమేనా? సమ్మర్ లో గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం.. -
సోషల్ మీడియాలో రాజయోగం పేరుతో హడావుడి.. ఈ రాశుల వారికి నిజంగానే అదృష్టం ఉందా? -
వేడివేడి అన్నంలోకి అదిరిపోయే మటన్ ఊరగాయ.. ముక్క తగిలితే మజానే! -
ఈ 7 దేవాలయాల్లో శాస్త్రానికి వ్యతిరేకంగా జరిగే అద్భుత సంఘటనలు శాస్త్రవేత్తలు కూడా నిరూపించలేకపోయారు -
జూన్ 1, 2026: గ్రహాల సంచారంతో ఈ రాశుల వారికి అదృష్టం.. రాహుకాలం వేళ ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
వృశ్చికం, కర్కాటక రాశుల వారికి అద్భుత అవకాశాలు.. మీ రాశి ఉందా? - సోమవారం, 01 జూన్ 2026
NALA టెక్నిక్ ప్రయోగిస్తే..మీరు I Love You చెప్తే పూజా హెగ్డే అయినా ఓకే చెప్పేస్తది!
ఒక అమ్మాయికి..ఎవరైనా అబ్బాయి మీద క్రష్ ఉండటం, అలాగే ఓ అబ్బాయికి..ఎవరైనా అమ్మాయి మీద అయినా క్రష్ ఉండటం చాలా సహజం. అయితే మనసులో వారిపై ఇష్టాన్ని పెంచుకుంటూ కళ్లల్లో వారి రూపాన్ని నింపుకుంటారు కానీ ఆ విషయం నచ్చిన వ్యక్తికి చెప్పాలంటే మాత్రం గుండెల్లో దడ పుడుతుంది. దీనికి కారణం ఏంటంటే..ఒకవేళ నో అనే సమాధానం వస్త? లేదా మనం మంచి ఫ్రెండ్స్ గానే ఉందాం అంటూ వారి నుంచి ఆన్సర్ వస్తే? ఊహిస్తేనే తట్టుకోలేం అని భావించి క్రష్ ను దూరం నుంచి చూస్తూనే ఆనందించేవాళ్లు చాలామంది ఉన్నారు.
అయితే మీరు ఇష్టపడ్డ వ్యక్తి లేదా మీ క్రష్ మీ ప్రేమను అంగీకరించే అవకాశాలను పెంచడానికి ఒక పవర్ ఫుల్ టెక్నిక్ ఉందని ప్రముఖ ఫ్యామిలీ కౌన్సిలర్, సైకాలజిస్ట్ విజయ పెద్దిన చెప్పారు. అదే 'NALA' టెక్నిక్. ఇది కేవలం టెక్నిక్ మాత్రమే కాదు..మిమ్మల్ని మీరు ఉన్నతంగా తీర్చిదిద్దుకునే ఒక అద్భుతమైన ప్రక్రియ. ఇంతకీ ఏంటీ NALA టెక్నిక్ అనేది ఇప్పుడు వివరంగా చూద్దాం.

N-నో ఫ్రెండ్స్ జోన్(No friends zone)
లవ్ లో ఎదురయ్యే అతి పెద్ద అడ్డంకి ఫ్రెండ్ జోన్. అదేంటంటే..మీ క్రష్ కి మీ లవ్ గురించి చెప్పినప్పుడు వాళ్లు నీపై అలాంటి ఫీలింగ్స్ లేవు, మనం ఫ్రెండ్స్ గానే ఉందాం అని సున్నితంగా తిరస్కరించే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడే చాలామంది పొరపాటు చేస్తుంటారు. వారి స్నేహాన్ని అంగీకరించి,ఎప్పటికైనా వారి మనసు మారుతుందని ఎదురుచూస్తూ ఉంటారు. అయితే సైకాలజిస్ట్ విజయ పెద్దిన ప్రకారం..ఇది సెల్ఫ్ రెస్పెక్ట్(ఆత్మగౌరవం)దెబ్బతీస్తుంది.
కాబట్టి మనం ఫ్రెండ్స్ గా ఉందాం అని మీ క్రష్ చెప్తే..నాకు నీ ఉన్నది స్నేహం కాదు అంతకుమించిన ఇష్టం..ఫ్రెండ్ గా ఉండటం నాకు ఇష్టం లేదు క్లియర్ గా, గౌరవంగా చెప్పగలగాలి. ఇది మీ ఉద్దేశాన్ని సృష్టం చేయడమే కాకుండా మీ భావాలకు మీరు ఇచ్చే విలువను తెలియజేస్తుంది. ఫ్రెండ్ జోన్ ను అంగీకరించకపోవడం అంటే మీరు బలవంతం చేస్తున్నారని కాదు..మీ ఫీలింగ్స్ ను గౌరవించుకుంటున్నారని అర్థం.ఇది మీపై వారికి ఒక కొత్తరకమైన గౌరవాన్ని కలిగిస్తుంది.

A - అవైలబిలిటీ (Availability)
ప్రతిసారీ వెనుక వెనుకాలే ఉంటూ దృష్టిలో పడుతుంటే పడిపోతారేమో నాకు అనేది ఇవ్వాల వర్కౌట్ అవ్వదు. మీరెప్పుడూ వాళ్ల చుట్టూనే తిరుగుతూ వారికోసమే అందుబాటులో ఉంటే మీ విలువ తగ్గే ప్రమాదం ఉంది. సైకాలజీ ప్రకారం మనుషులు సులభంగా దొరికే దానికంటే కొంచెం కష్టపడితే దక్కే దానినే ఎక్కువగా ఇష్టపడతారు. కాబట్టి మీ లభ్యతను తగ్గించుకోండి. మీకంటూ ఒక లైఫ్, లక్ష్యాలు, ఫ్రెండ్స్ ఉన్నారని వారికి తెలియజేయండి. ప్రతి ఫోన్ కాల్ కి, ప్రతి మెసేజ్ కి వెంటనే రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ పనుల్లో మీరు బిజీగా ఉండండి. ఇది మిమ్మల్ని ఒక స్వతంత్రమైన, ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తిగా చూపిస్తుంది. వారికి మీతో మాట్లాడాలనిపిస్తే వారే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. ఇది మీ ఆత్మగౌరవాన్ని పెంచడంతో పాటుగా వారి దృష్టిలో మీ ప్లేస్ ని కూడా పెంచుతుంది.
L - లెవెల్ అప్ (Level Up)
లవ్ లో గెలవడానికి అత్యంత ముఖ్యమైన సూత్రం లెవెల్ అప్. అంటే మిమ్మల్ని మీరు మెరుగుపర్చుకోవడం. ఇది కేవలం శారీరకంగా అందంగా కనిపించడం మాత్రమే కాదు, అన్ని రంగాల్లోనూ మిమ్మల్ని మీరు ఉన్నత స్థాయికి తీసుకెళ్లడం. మీ కెరీర్ లో స్థిరపడండి. ఆర్థికంగా మీ కాళ్లపై మీరు నిలబడండి. ఇది మీకు భద్రతను, సమాజంలో గౌరవాన్ని ఇస్తుంది. మీ ప్రవర్తన, వ్యక్తిత్వం ఆకర్షణీయంగా ఉండేలా చూసుకోండి. మంచి అలవాట్లను పెంపొందించుకోండి. ఇతరులతో మర్యాదగా, నిజాయితీగా ప్రవర్తించండి. కొత్త విషయాలు నేర్చుకోండి. మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోండి. మిమ్మల్ని మీరు ఒక సంపూర్ణ వ్యక్తిగా తీర్చిదిద్దుకున్నప్పుడు ఇతరులు సహజంగానే మీ వైపు ఆకర్షితులవుతారు. మీరు ఎవరి వెనకా పడాల్సిన అవసరం లేదు..మీ విజయమే మిమ్మల్ని వరించేలా చేస్తుంది.
A - యాక్సెప్టెన్స్ (Acceptance)
పైన చెప్పినవన్నీ పాటించినా కొన్నిసార్లు ఫలితం మీకు అనుకూలంగా రాకపోవచ్చు. ప్రేమ అనేది ఇద్దరి మనసులకు సంబంధించిన విషయం. ఇక్కడే NALA టెక్నిక్ లోని చివరి, అత్యంత కీలకమైన అంశం యాక్సెప్టెన్స్(అంగీకారం) పనిచేస్తుంది. ఒకవేళ మీ క్రష్ మిమ్మల్ని తిరస్కరిస్తే దాన్ని హుందాగా స్వీకరించండి. బాధపడటం సహజమే అయినా అందులోనే కూరుకుపోవద్దు. దీని అర్థం మీలో ఏదో లోపం ఉందని కాదు. మీ ఇద్దరి దారులు వేరని మాత్రమే.
సైకాలజిస్ట్ విజయ్ పెద్దిన చెప్పినట్లు పూజా హెగ్డే లేకపోతే రష్మిక ఉంది కదా, మహేష్ బాబు లేకపోతే ప్రభాస్ ఉన్నాడు కదా. జీవితం ఒకరితోనే ఆగిపోదు. ఈ ప్రపంచంలో మీకోసం పుట్టిన సరైన వ్యక్తి ఎక్కడో ఎదురుచూస్తూ ఉంటారనే నమ్మకంతో ముందుకు సాగండి. తిరస్కరణ అనేది ముగింపు కాదు ఒక కొత్త, మెరుగైన ప్రారంభానికి నాంది. ఈ నిజాన్ని మీరు అంగీకరించగలిగితే జీవితంలో ఎలాంటి పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కొని సంతోషంగా ముందుకు వెళ్లగలుగుతారు.



Click it and Unblock the Notifications