Latest Updates
-
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.!
New Dating Trend: డేటింగ్ లో కొత్త ట్రెండ్ 'ష్రెక్కింగ్'.. బూతు కాదు, కానీ నిజం!
ఒకప్పుడు డేటింగ్ అంటే విదేశాల్లో ఉండేది..మన దేశంలో అలాంటి దానికి ఛాన్స్ లేదు అనేకునేటోళ్లు చాలామంది. అయితే ఇప్పుడు మనదేశంలో డేటింగ్ కల్చర్ బాగానే పెరిగింది. ఒకప్పుడు దీనిని బూతుగా భావించేటోళ్లు కూడా ఇందులో తప్పేమీ లేదు అంటున్నారు ఇప్పుడు. అయితే డేటింగ్ కు సంబంధించి సోషల్ మీడియాలో రోజూ కొత్త కొత్త ట్రెండ్ లు పుట్టుకొస్తుంటాయి. కొన్ని సరదాగా ఉంటే, మరికొన్ని సంబంధాల స్వరూపాన్నే మార్చేలా ఉంటాయి. అలాంటి ఒక వింత, ప్రమాదకరమైన డేటింగ్ ట్రెండే ష్రెక్కింగ్(shrekking). ఈ పదం వినడానికి వింతగా ఉన్నా, దీని వెనుక ఉన్న ఆలోచన మరింత ఆశ్చర్యకరంగా ఉంటుంది.
ష్రెక్కింగ్ అంటే ఏమిటి?
ఉద్దేశపూర్వకంగా తమ కంటే తక్కువ అందంగా లేదా తక్కువ ఆకర్షణీయంగా ఉన్న వ్యక్తితో డేటింగ్ చేయడం. ఎందుకంటే వారు తమ పట్ల ఎక్కువ విశ్వాసంగా, ప్రేమగా ఉంటారని, ఎప్పటికీ తమను వదిలి వెళ్లరనే ఒక బలమైన నమ్మకం.

ఈ వింత ధోరణి ఎందుకు పెరుగుతోంది?
ప్రస్తుత డేటింగ్ ప్రపంచంలో చాలామంది డేటింగ్ ఫెటీగ్ (అలసట)తో బాధపడుతున్నారు. పదేపదే మోసపోవడం, సంబంధాలు విఫలమవడం వంటి కారణాలతో విసిగిపోయి ఒక సేఫ్ మార్గాన్ని ఎంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. తమ కంటే తక్కువ ఆకర్షణీయంగా ఉన్న భాగస్వామి తమను ఒక గిఫ్ట్ లా చూస్తారని, తమ విలువను ఎక్కువగా గుర్తిస్తారని, మోసం చేసే అవకాశం చాలా తక్కువని వారు భావిస్తారు. అవతలి వ్యక్తి తమను ఎంతగానో ఆరాధిస్తూ, తమ మాటకు విలువిస్తారనే ఒక లోతైన అంచనాతో ఈ బంధంలోకి అడుగుపెడతారు.
అసలు సమస్య ఎక్కడ మొదలవుతుంది?
నిజానికి ప్రేమ, విశ్వాసం, నిజాయితీ వంటి గుణాలకు శారీరక ఆకర్షణకు ఎలాంటి సంబంధం లేదు. అందంగా ఉన్నవారు మోసం చేస్తారని, తక్కువ అందంగా ఉన్నవారు నమ్మకంగా ఉంటారని అనుకోవడం పూర్తి అపోహ. ష్రెక్కింగ్ అనేది ఒక ప్రమాద ఘంటిక లేదా బంధంలో రెడ్ ఫ్లాగ్.. ఎందుకంటే ఈ సంబంధం సమానత్వం మీద కాదు, ఒకరకమైన ఇచ్చి పుచ్చుకునే మనస్తత్వం మీద ఆధారపడి ఉంటుంది. నా అందానికి బదులుగా నువ్వు విధేయతను ఇవ్వు అనే అప్రకటిత ఒప్పందం దీని వెనుక దాగి ఉంటుంది. ఇలాంటి బంధంలో సమానత్వానికి చోటుండదు. కాలక్రమేణా ఒకరు తమను తాము ఉన్నతంగా భావిస్తే.. మరొకరు ఎప్పుడూ తమ ప్రేమను, విధేయతను నిరూపించుకోవాల్సిన ఒత్తిడిలో ఉంటారు.
ష్రెక్కింగ్ మీ వ్యక్తిత్వం గురించి ఏం చెబుతుంది?
ఈ ధోరణిని పాటించడం అనేది నిజానికి వారి వ్యక్తిత్వాన్ని, వారిలోని లోపాలను ప్రతిబింబిస్తుంది. ఇది తరచుగా వారిలో దాగి ఉన్న తీవ్రమైన ఆత్మన్యూనతా భావానికి అద్దం పడుతుంది. తమ కంటే అందమైన, ఆకర్షణీయమైన భాగస్వామి దొరికితే వారు తమను ఎక్కడ వదిలేస్తారోనన్న భయం వీరిని వెంటాడుతుంది. కొన్నిసార్లు ఇది అవతలి వ్యక్తిని నియంత్రించాలనే కోరికను కూడా సూచిస్తుంది. తక్కువ ఆకర్షణీయమైన వ్యక్తిని తమకు అనుగుణంగా సులభంగా మార్చుకోవచ్చని, నియంత్రించవచ్చని భావించడం దీని వెనుక ఉన్న మరొక ఆలోచన.నిజమైన ప్రేమ, బంధం అనేవి ఒకరి రూపాన్ని బట్టి కాదు, ఇద్దరి మధ్య ఉండే పరస్పర గౌరవం, అవగాహన, సమానత్వంపై ఆధారపడి ఉంటాయి.



Click it and Unblock the Notifications