Latest Updates
-
తులసి తీర్థం మహిమ? చనిపోయిన మహిళ బతికింది! -
రెస్టారెంట్ రుచిని మించేలా ఇంట్లోనే బిసిబేలే బాత్.. సులభంగా ఎలా చేయాలంటే? -
కరివేపాకు vs వేప ఆకు..పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాల్లో ఏది బెస్ట్ అంటే..! -
నవరాత్రి స్పెషల్: రుచితో పాటు ఆరోగ్యం.. జీర్ణశక్తిని పెంచే అద్భుతమైన తమలపాకు కేసరి ప్రసాదం -
నోరూరించే ఆమ్లెట్ పులుసు.. పుల్లపుల్లగా, కారంకారంగా రుచి అదరహో! -
దీపావళికి ముందే ధ్వజ యోగం.. ఈ 4 రాశుల జాతకులు కోటీశ్వరులు కావడం ఖాయమా? -
నల్ల పాలు తాగుతున్న తెలుగు హీరోయిన్..ప్రయోజనాలేంటో,ఎలా చేసుకోవాలో తెలుసా? -
మటన్ సాంబార్ వండేటప్పుడు ఈ మసాలా పడితే ఆ రుచే వేరు..రాగి సంగటి, చపాతీ,అన్నంలోకి కేక -
రోగనిరోధక శక్తిని పెంచే జామకాయ పచ్చడి.. ఊరనివ్వాల్సిన పనే లేకుండా అప్పటికప్పుడే రెడీ! -
Viral Video Truth: రష్యా యువతి, బీహార్ యువకుడి ప్రేమ కథలో పెద్ద ట్విస్ట్..
వైజాగ్ లో కథ మాములుగా లేదుగా..దానికోసం ఏఐ తెగ వాడేస్తున్నారంట!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అనగానే ఇక ఇదే అన్ని పనులు చేస్తుంది..మన ఉద్యోగాలు భవిష్యత్తులో గోవిందా అని చాలా మంది ఉద్యోగులు ప్రస్తుతం ఆందోళన చెందుతున్నారు, ఇదే సమయంలో దీనిని ఉపయోగించుకుంటూ విద్యార్ధులు, మరికొందరు తమ పనులను ఈజీగా చేసుకుంటూ లాభపడుతున్నారు. కానీ ఏఐ వినియోగం ఇప్పుడు కేవలం చదువులు, ఉద్యోగాలకే పరిమితం కాలేదు. ఇప్పుడు ఏఐ యువత పాలిట ఒక లవ్ గురుగా, ఏకాంత సమయంలో సలహాలిచ్చే ఆప్తమిత్రుడిగా అవతరించింది.

ప్రేమ, శృంగారం, శారీరక విద్య, వ్యక్తిగత సంబంధాల గురించి తమకున్న ఎన్నో సందేహాలను తీర్చుకోవడానికి ప్రజలు ఇప్పుడు ఏఐ మీద విపరీతంగా ఆధారపడుతున్నారు. ముఖ్యంగా కేవలం మెట్రో నగరాలకే పరిమితం కాకుండా టైర్ 2, టైర్ 3 నగరాలు కూడా ఈ ట్రెండ్ ను అందిపుచ్చుకోవడంలో వేగంగా పురోగమిస్తున్నాయి. ఇటీవల ప్రముఖ సంస్థ గ్లీడెన్-ఇప్సోస్ దేశవ్యాప్తంగా సుమారు 1500 మందితో నిర్వహించిన ఒక సర్వేలో అనేక ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
టాప్ గా నిలిచిన బెంగళూరు
టెక్నాలజీ వినియోగంలో ఎప్పుడూ ముందుండే సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా బెంగళూరు.. ఏఐతో సాన్నిహిత్యాన్ని పెంచుకోవడంలోనూ అగ్రస్థానంలో నిలిచింది. సర్వేలో పాల్గొన్న బెంగళూరు వాసులలో ఏకంగా 77 శాతం మంది శారీరక విద్య, లైంగిక ఆరోగ్యానికి సంబంధించిన సమాచారం కోసం ఏఐని వాడుతున్నామని కుండబద్దలు కొట్టారు. అంతేకాకుండా తమ భాగస్వామితో శృంగార అనుభవాలను మరింత మెరుగుపరుచుకునేందుకు 75 శాతం మంది ఏఐ సలహాలను స్వీకరించేందుకు సుముఖంగా ఉన్నారు. ఇక తమ వ్యక్తిగత ఫాంటసీలను ఎలాంటి సంకోచం లేకుండా ఏఐతో పంచుకోవడానికి 67 శాతం మంది ఆసక్తి చూపుతున్నారు.
ఆశ్చర్యపరుస్తున్న మన విశాఖపట్నం
ఈ రేసులో బెంగళూరు తర్వాత స్థానంలో విశాఖపట్నం నిలిచింది. వైజాగ్ ప్రజలు కూడా ఏఐని తమ వ్యక్తిగత జీవితంలో భాగం చేసుకుంటున్నారు. సర్వే ప్రకారం, విశాఖకు చెందిన వారిలో 62 శాతం మంది లైంగిక ఆరోగ్యం, శారీరక విద్య గురించి తెలుసుకునేందుకు ఏఐని ఆశ్రయిస్తున్నారు. అలాగే 60 శాతం మంది ఏఐతో శృంగారభరితమైన చాటింగ్ చేయడానికి ఇష్టపడుతుండగా, 58 శాతం మంది ఏఐ రూపొందించిన ఫాంటసీ దృశ్యాలను ఆస్వాదించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. తమ అత్యంత రహస్యమైన, ఏకాంతమైన ప్రశ్నలను ఏఐని అడగడానికి 53 శాతం మంది ఏమాత్రం వెనుకాడటం లేదు.
కోయంబత్తూరు, కొచ్చి నగరాల్లోనూ మారుతున్న ఆలోచనా విధానం
సంప్రదాయాలకు పెద్దపీట వేసే దక్షిణ భారత నగరాల్లో కూడా మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. కోయంబత్తూరులో శారీరక విద్య కోసం 50 శాతం మంది ఏఐని ఒక సాధనంగా ఉపయోగిస్తుండగా, తమ వ్యక్తిగత ఫాంటసీలు, లోతైన ప్రశ్నల గురించి ఏఐతో స్వేచ్ఛగా మాట్లాడేందుకు 52 శాతం మంది సానుకూలంగా స్పందించారు. 49 శాతం మంది లైంగిక ఆరోగ్య సమస్యల పరిష్కారానికి ఏఐ వాడుతున్నామన్నారు.
ఇక కేరళలోని కొచ్చి నగరంలో ఇతర ప్రాంతాలతో పోలిస్తే గణాంకాలు కొద్దిగా తక్కువగా ఉన్నప్పటికీ, అక్కడి ప్రజల ఆలోచనా విధానం మారుతోందని సర్వే తెలిపింది. సుమారు 45 శాతం మంది ఏఐతో ప్రేమ, శృంగార సంభాషణలు చేయడానికి ఇష్టపడుతుండగా, 43 శాతం మంది లైంగిక ఆరోగ్యం గురించి సరైన సమాచారాన్ని పొందేందుకు ఏఐ సహాయం తీసుకుంటున్నారు.



Click it and Unblock the Notifications
