Latest Updates
-
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే! -
హోటల్ స్టైల్ రాయల్ కొబ్బరి చట్నీ.. ఈ ఒక్క సీక్రెట్ పదార్థం కలిపితే రుచి అదుర్స్! -
బగారా రైస్, చపాతీ,రాగి సంగటిలోకి అదిరిపోయే మటన్ లెగ్ కర్రీ..రుచికి రుచి, బలానికి బలం! -
వంట మధ్యలో గ్యాస్ అయిపోతోందని టెన్షనా? మీ సిలిండర్లో ఎంత గ్యాస్ మిగిలి ఉందో చిటికెలో తెలుసుకోండిలా! -
International womens day 2026: భారతీయ మహిళల తలరాతను మార్చిన జనవరి 1,1848.న ఏం జరిగింది? -
మీ భాగస్వామికి మీరంటే నిజమైన ప్రేమేనా? ఈ 5 విషయాలు చెబుతాయి -
ఎండల్ని తట్టుకునే అమృతం లాంటి తెలంగాణ సల్ల చారు..గిన్నె ఖాళీ చేస్తారు!
జపాన్ లో కొత్త రకం పెళ్లిళ్లు..భారత్ లో కూడా ఫ్రెండ్ షిప్ మ్యారేజెస్?
ఇప్పటిదాకా మనం లవ్ మ్యారేజ్ లు, అరేంజ్డ్ మ్యారేజ్ ల గురించే విన్నాం. రెండు మనసులు కలిసినప్పుడు పెళ్లి బంధంతో ఒక్కటయ్యేందుకు ఉన్న ఆప్షన్లు ఈ రెండేనని మనకు తెలిసిందే. అయితే మనకు మరో ఆప్షన్ కూడా అందుబాటులోకి వచ్చేస్తోంది.20 ఏళ్ల క్రితం వచ్చిన కుచ్ కుచ్ హోతా హై అనే బాలీవుడ్ సినిమాలో హీరో షారుఖాన్ ఖాన్ ప్రేమ అంటే ప్రెండ్ షిప్ అని చెప్తాడు. అంటే ఓ రొమాంటిక్ రిలేషన్ షిప్ కి ప్రెండ్ షిప్ అనేది ఓ ఫౌండేషన్ అని మనకు షారుఖ్ ఖాన్ ఆ సినిమా ద్వారా తెలియజేశాడు. ఇప్పుడు అదే బాటలో జపాన్ పయనిస్తోంది. అయితే అందులో కొన్ని కండీషన్స్ పెట్టుకుంది.
జపాన్ లో పెళ్లిళ్లు చేసుకునేవాళ్ల సంఖ్య రోజురోజుకి తగ్గిపోతున్న క్రమంలో కొత్త రిలేషన్ షిప్ ట్రెండ్ అక్కడ స్టార్ట్ అయ్యింది. దాని పేరు ఫ్రెండ్ షిప్ మ్యారేజ్. జనాభా తగ్గుదలతో బాధపడుతున్న జపాన్ లో ఈ ఫ్రెండ్ షిప్ మ్యారేజ్ ట్రెండ్ చాలా క్రితమే వెలుగులోకి వచ్చినా..గత కొన్నాళ్లుగా దీనికి ఆదరణ పెరుగుతోంది. చాలామంది జపనీస్ యువత ఈ కొత్త వివాహ సంబంధాన్ని కోరుకుకుంటున్నట్లు లేటెస్ట్ రిపోర్ట్ లు చెబుతున్నాయి.

ప్రెండ్ షిప్ మ్యారేజ్ అంటే మీ బెస్ట్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకోవడం అని అర్థం కాదు..ఒకే రకమైన వ్యాల్యూస్, ఆసక్తులను కలిగి ఉన్న వారితో కలిసి జీవించడం అని అర్థం చేసుకోవచ్చు.ఈ ఫ్రెండ్ షిప్ మ్యారేజ్ లో మెడలో దండ వేయడం లేదా తాళి కట్టడం లేదా రింగ్ లు మార్చుకోవడం వంటి సంప్రదాయ పెళ్లిలో ఉండేటివేవీ ఉండవు. జస్ట్ ఇది లీగల్ మ్యారేజ్. అంటే ఫ్రెండ్ షిప్ మ్యారేజ్ లో జీవితాంతం తోడు ఉంటాను,నాతిచరామి అంటూ ఒట్టు వేయాల్సిన పనిలేదు. నచ్చినన్ని రోజులు కలిసి ఉంటామని అగ్రిమెంట్ పై సంతకాలు చేస్తే చాలు. ఆ తర్వాత ఇద్దరూ ఒకే ఇంట్లో కలిసి భార్య,భర్తలా జీవించవచ్చు. ప్రెండ్ షిప్ మ్యారేజ్ లో జస్ట్ స్నేహం మాత్రమే ఉంటుంది.. అంటే పెళ్లి తర్వాత రొమాన్స్ లేదా సెక్స్, పిల్లల్ని కనడం వంటివి ఉండవు.ఒకవేళ పిల్లల్ని కనాలి అనుకుంటే కృత్రిమ గర్భధారణ పద్దతులను ఫాలో అవుతారు.
ఈ రిలేషన్ షిప్ లో ఉంటూనే ఒకరికన్నా ఎక్కువమంది పార్ట్ నర్స్ ని కొనసాగించవచ్చు. అయితే దీనికి ముందుగానే అగ్రిమెంట్ లో ఈ విషయం రాసుకోవాల్సి ఉంటుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఒకే రకమైన అభిరుచులు కలిగిన రూమ్ మేట్ ని పెళ్లి చేసుకోవడం లాంటిదే ఈ ఫ్రెండ్ షిప్ మ్యారేజ్.
ప్రెండ్ షిప్ మ్యారేజ్ ట్రెండ్ వైపు ముఖ్యంగా లైంగిక ఆసక్తులు లేనివాళ్లు, హోమో సెక్సువల్స్ ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. జపాన్ లో స్వలింగ వివాహాలు లేదా సేమ్ సెక్స్ మ్యారేజ్ లు చట్టబద్దం కాలేదు. అంటే సేమ్ జెండర్ వ్యక్తులు పెళ్లి చేసుకోవడం జపాన్ లో చట్ట విరుద్దం. కాబట్టి ఫ్రెండ్ షిప్ కోరుకునే లైంగిక ఆసక్తులు లేనివాళ్లు, హోమో సెక్సువల్స్ ఈ ఫ్రెండ్ షిప్ మ్యారేజ్ ల ద్వారా ప్రయోజనం ప్రయోజనం పొందవచ్చు. అంతేకాకుండా, వివాహిత జంటలకు ట్యాక్స్,హెల్త్ ఇన్స్యూరెన్స్ ప్రయోజనాలను కూడా జపాన్ ప్రభుత్వం అందిస్తోంది. ప్రెండ్ షిప్ మ్యారేజ్ అనేది జంటలు సామాజిక ఒత్తిడిని ఎదుర్కోవడానికి కూడా సహాయపడుతుంది.
పెద్ద నగరాల్లో నివసించాలంటే పెద్ద ఖర్చుతో కూడుకున్నదిగా మారడం, డిమాండింగ్ వర్క్ కల్చర్ కారణంగా జపనీస్ యువకులు పెళ్లి చేసుకోడానికి లేదా ఒకవేళ చేసుకున్నా పిల్లల్ని కనడానికి ఇష్టపడటం లేదని అనేక రిపోర్ట్ లు సూచిస్తున్నాయి. ఫ్రెండ్ షిప్ మ్యారేజ్ లు ఆర్థిక భాగస్వామ్యాన్ని, స్నేహాన్ని అందించగలవు అదే సమయంలో ఒంటరితనాన్ని దూరం చేస్తాయి. జపాన్ లో 2024 ఆర్థిక సంవత్సరంలో ఒంటరిగా నివసిస్తున్న 37,227మంది తమ ఇళ్లల్లో మరణించారు. చాలా సందర్భాలలో వీరు మరణించిన విషయం బయటకు భారీగా వాసన వచ్చేదాకా ఎవరికీ తెలియడం లేదు.
భారత్ లో ఫ్రెండ్ షిప్ మ్యారేజ్ ట్రెండ్
భారత్ కుటుంబ విలువల వ్యవస్థలో బలంగా ఉంది..సంప్రదాయ వివాహాల వ్యవస్థ కొనసాగే అవకాశం ఉన్నప్పటికీ ప్రెండ్ షిప్ మ్యారేజ్ ట్రెండ్ మన దగ్గర కూడా ఆదరణ పొందే అవకాశం లేకపోలేదని నిపుణులు చెబుతున్నారు. అయితే పేర్లు వేరేగా ఉన్నా ఫ్రెండ్ షిప్ డే మ్యారేజ్ లు లాంటివి భారత్ లో ఇప్పటికే ఉన్నాయి.
ముఖ్యంగా తల్లిదండ్రుల లేదా ఇతర కుటుంబ సభ్యుల ఒత్తిడి కారణంగా పెళ్లిళ్లు చేసుకునే LGBTQ వ్యక్తులు ఈ కొత్త మ్యారేజ్ ట్రెండ్ వైపు కనెక్ట్ అయ్యే అవకాశముందంటున్నారు. వీళ్లు ఫ్రెండ్ షిప్ మ్యారేజ్ ల ద్వారా ఎమోషనల్ సపోర్ట్,సాంగత్యాన్ని పొందవచ్చని చెబుతున్నారు. మనదేశంలో కూడా పిల్లల్ని కనేందుకు ఇంట్రెస్ట్ చూపని వారి సంఖ్య క్రమంగా పెరుగుతున్న క్రమంలో ఫ్రెండ్ షిప్ మ్యారేజ్ కాన్సెప్ట్ అలాంటివారికి సహాయం చేస్తుందని నిపుణులు అంటున్నారు.



Click it and Unblock the Notifications











