Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పెళ్లిపై అక్షయ్ ఖన్నా 14 ఏళ్ల క్రితం చెప్పిన మాటలు నేడు వైరల్.. ధురంధర్ విలన్ వ్యాఖ్యలకు యువత ఫిదా!
బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా ప్రస్తుతం ధురంధర్ సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చారు. అందులో ఆయన పోషించిన రెహమాన్ దకైత్ పాత్ర, ఆ నటన, స్క్రీన్ ప్రెజెన్స్ విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నాయి. అయితే సినిమా విజయం కంటే ఎక్కువగా ఆయనకు సంబంధించిన ఒక పాత ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది.
2012 నాటి వీడియోలో అక్షయ్ ఖన్నా చెప్పిన మాటలు నేటి ఆధునిక భారతీయ యువత మనసులోని భావాలకు అద్దం పడుతున్నాయి.

అసలేం చెప్పారు?
అప్పుడు 36 ఏళ్ల వయసులో ఉన్న అక్షయ్ ఖన్నా.. తనకు పెళ్లి చేసుకోవడంపై ఎందుకు ఆసక్తి లేదో కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. నాకు బాధ్యతలంటే ఇష్టం ఉండదు..పిల్లలను కనడం, భార్య బాగోగులు చూడటం అనేది ఒక మనిషికి ఉండే అతిపెద్ద బాధ్యతలు.. నాకు ఆ బాధ్యత అక్కర్లేదు..నేను ఎవరినీ చూసుకోవాల్సిన పనిలేకుండా, ఎవరి గురించి ఆందోళన చెందకుండా నా గురించి మాత్రమే ఆలోచించుకుంటూ స్వేచ్ఛగా ఉండాలనుకుంటున్నాను.. ఇది అద్భుతమైన జీవితం అని బాలీవుడ్ హంగామాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు.
యువత ఎందుకు కనెక్ట్ అవుతున్నారు
ఈ వీడియో క్లిప్ ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో వైరల్ అవుతుండగా, యువత నుండి భారీ స్పందన వస్తోంది. ఇది కచ్చితంగా నా మనసులోని మాటే..నేను కోరుకుంటున్న జీవితం ఇదే.. అతను నా లాగే ఆలోచిస్తున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
అక్షయ్ ఖన్నాను మోడ్రన్ ఇండియా ఒంటరితనంకు ఐకాన్ గా చూస్తున్నారు. భారతదేశంలో పెళ్లి, కుటుంబం అనే విషయాల పట్ల దృక్పథం మారుతోంది అనడానికి ఇదే నిదర్శనం.
ఒకప్పుడు పెళ్లి, పిల్లలే జీవిత పరమార్థం అనుకునే సమాజంలో... ఇప్పుడు మానసిక ప్రశాంతత,స్వయం ప్రతిపత్తి ముఖ్యమని మిలీనియల్స్ భావిస్తున్నారు. గణాంకాల ప్రకారం 2011తో పోలిస్తే 2021 నాటికి పెళ్లికాని మహిళల సంఖ్య గణనీయంగా పెరిగింది.
నిపుణులు ఏమంటున్నారు?
మానసిక నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రజలు ఇప్పుడు సామాజిక ఆమోదం కంటే తమ భావోద్వేగ ఆరోగ్యానికి ఎక్కువ విలువ ఇస్తున్నారు. బలవంతంగా బంధాల్లో ఇరుక్కుపోవడం కంటే ఒంటరిగా సంతోషంగా ఉండటమే బాధ్యతాయుతమైన నిర్ణయమని భావిస్తున్నారు. నాకు నేనుగా సంతోషంగా ఉండగలనా? అన్న ప్రశ్నకు సమాధానమే ఈ మార్పు అని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఒంటరి జీవితాన్ని ఎంచుకుంటే..
అక్షయ్ ఖన్నా లాగా లేదా నేటి తరం లాగా మీరు కూడా ఒంటరి జీవితాన్ని ఎంచుకుంటే, భవిష్యత్తు కోసం కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి అని నిపుణులు సూచిస్తున్నారు.
-వృద్ధాప్యం కోసం పక్కాగా ప్లాన్ చేసుకోవాలి
-కుటుంబం లేనప్పుడు, మనకు అండగా నిలిచే బలమైన స్నేహితుల సర్కిల్ ముఖ్యం.
-ఫిట్ నెస్, ఆరోగ్య బీమాపై శ్రద్ధ పెట్టాలి.
14 ఏళ్ల క్రితం అక్షయ్ ఖన్నా తన ఎంపిక గురించి నిజాయితీగా మాట్లాడారు. నాడు అది వింతగా అనిపించినా, నేడు అదే నిజాయితీ వేలాది మంది యువతీయువకుల ఆలోచనలకు ప్రతిధ్వనిగా మారింది. పెళ్లి అనేది సమాజం కోసం చేసే పని కాదు అది పూర్తిగా వ్యక్తిగత ఎంపిక అని ఈ వైరల్ ట్రెండ్ నిరూపిస్తోంది.



Click it and Unblock the Notifications