Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఈ 5 చిట్కాలతో మీ దాంపత్యం సూపర్ హిట్..నాకు టైం ఇవ్వట్లేదని మీ భార్య ఎప్పటికీ అడగదు!
ప్రస్తుతం అందరి లైఫ్ లు బిజీగా మారిపోయాయి. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో టైం లేదు అనే మాట ప్రతి ఒక్కరి నోటా వినిపిస్తోంది. ఆఫీసు పనులు, టార్గెట్స్, బాధ్యతల ఒత్తిడిలో పడి..మన కోసం పరితపించే జీవిత భాగస్వామిని చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నారు. దీనివల్ల తెలియకుండానే ఇద్దరి మధ్య దూరం పెరిగిపోతుంది.
అయితే మీ బంధాన్ని బలపరుచుకోవడానికి, మీ ప్రియమైన వారితో క్వాలిటీ టైమ్ గడపడానికి మీరు విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదు లేదా ఖరీదైన రెస్టారెంట్లలో వేల రూపాయలు ఖర్చు చేయాల్సిన పనీ లేదు. చిన్న చిన్న మార్పులతో ఇంట్లోనే మధురమైన క్షణాలను ఎలా సృష్టించుకోవచ్చో ఇక్కడ చూడండి.

ప్రకృతి ఒడిలో ఒక మినీ పిక్నిక్
పిక్నిక్ అనగానే భారీగా వంటలు, బంధుమిత్రుల హడావిడి గుర్తుకు రావచ్చు. కానీ ఇక్కడ పిక్నిక్ కేవలం మీ ఇద్దరి కోసమే. మీకు సెలవు దొరికినా లేదా కొన్ని గంటల ఖాళీ టైం ఉన్నా ఇంట్లో ఉన్న ఆహారాన్ని ప్యాక్ చేసుకొని దగ్గర్లోని ఏదైనా పార్కుకో, సరస్సు గట్టుకో వెళ్ళండి.
ఒకరి పక్కన ఒకరు కూర్చుని, ప్రకృతిని ఆస్వాదిస్తూ కబుర్లు చెప్పుకోండి. ప్రకృతి ఒడిలో గడిపే ఆ కాసేపు మీ బంధాన్ని మళ్ళీ కొత్తగా మారుస్తుంది.
ఇంట్లోనే సినిమా డేట్
సినిమా చూడాలంటే మల్టీప్లెక్స్ కే వెళ్లనక్కర్లుదు. మీ ఇంటినే థియేటర్ గా మార్చేయండి. మీ ఇద్దరికీ నచ్చిన సినిమాను టీవీలో ప్లే చేయండి. గదిలో లైట్లన్నీ ఆపేసి, కాస్త డిమ్ లైటింగ్ పెట్టుకోండి. చేతిలో ఒక బౌల్ పాప్ కార్న్ లేదా స్నాక్స్ ఉంటే చాలు..థియేటర్ అనుభూతి మీ సొంతం.
వంట గదిలో ప్రేమ ప్రయాణం
మీకు కాస్త సమయం దొరికితే ఇద్దరూ కలిసి వంట చేయడానికి ప్రయత్నించండి. ఇది కేవలం ఆకలి తీర్చుకోవడానికే కాదు మీ మధ్య సాన్నిహిత్యాన్ని పెంచడానికి కూడా ఉపయోగపడుతుంది.
ఏ కూర వండాలో నిర్ణయించుకోవడం దగ్గరి నుండి కూరగాయలు తరగడం, వంట చేయడం వరకు అన్నీ కలిసి చేయండి. ఇలా చేయడం వల్ల పని ఒత్తిడి తగ్గడమే కాకుండా, ఒకరికొకరు సాయం చేసుకోవడం వల్ల స్నేహభావం బలపడుతుంది.
చేతిలో చేయేసి నడవడం
సాయంత్రం వేళ లేదా సెలవు రోజుల్లో సమయం దొరికితే ఇద్దరూ కలిసి కాసేపు వాకింగ్ కు వెళ్ళండి. చేతిలో చేయేసి, ప్రశాంతమైన వాతావరణంలో నడుస్తూ ఉంటే మనసు తేలికపడుతుంది.
మొబైల్ ఫోన్లను పక్కన పెట్టి మీ ఆలోచనలను, ఆశలను, భయాలను ఒకరితో ఒకరు పంచుకోండి. మౌనంగా నడిచినా సరే ఆ సాన్నిహిత్యం మీకు ఎంతో బలాన్నిస్తుంది.
ప్రేమలేఖ
పెళ్ళై ఏళ్లు గడుస్తున్న కొద్దీ బాధ్యతల బరువులో చిన్న చిన్న ప్రేమ వ్యక్తీకరణలు కనుమరుగవుతుంటాయి. ఆ కోల్పోయిన మాధుర్యాన్ని తిరిగి తేవడానికి మీ భాగస్వామికి ఒక లేఖ రాయండి.
వాట్సాప్ మెసేజ్ ల కాలంలో చేతితో రాసిన లేఖకు ఉన్న విలువ వెలకట్టలేనిది. మీ మనసులోని భావాలను, వారిపై మీకున్న ప్రేమను కాగితంపై పెట్టండి. ఈ చిన్న ప్రయత్నం మీ బంధంలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది.



Click it and Unblock the Notifications