Latest Updates
-
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
చిన్న నగరాల్లో కూడా వివాహేతర సంబంధాలు పెరిగినపోడానికి కారణాలు ఇవే!
మారుతున్న కాలంతో పాటు మనుషుల మధ్య బంధాలు, వాటి విలువలు కూడా మారిపోతున్నాయి. ఒకప్పుడు ప్రేమ, నమ్మకం పునాదులపై బలంగా నిలబడిన సంబంధాలు ప్రస్తుతం అపనమ్మకం,మోసం అనే పెనుగాలికి కుప్పకూలిపోతున్నాయి. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు ఎంతోమంది రిలేషన్స్ అర్ధాంతరంగా కట్ అవడానికి ఇదే ప్రధాన కారణం. ఈ అవిశ్వాసం ఎంతగా పెరిగిపోయిందంటే, కొన్నిసార్లు పవిత్రమైన భార్యాభర్తల బంధం కూడా ఒక క్రైమ్ థ్రిల్లర్ ను తలపిస్తోంది. ఇటీవల జరిగిన ఒక సర్వే మన సమాజంలో వివాహేతర సంబంధాలు ఏ స్థాయిలో పెరిగిపోయాయో కళ్ళకు కట్టేలా నివ్వెరపరిచే వాస్తవాలను వెలుగులోకి తెచ్చింది.
సర్వేలో షాకింగ్ నిజాలు
వివాహేతర సంబంధాలు అంటే ఢిల్లీ, ముంబై,బెంగళూరు, హైదరాబాద్ వంటి మహానగరాలకు మాత్రమే పరిమితం అనుకుంటే పొరపాటే. ఈ ధోరణి ఇప్పుడు చిన్న నగరాలకు, పట్టణాలకు కూడా వేగంగా విస్తరిస్తోందని ఈ సర్వే స్పష్టం చేసింది. ముఖ్యంగా గ్లీడెన్, యాష్లే మాడిసన్ వంటి వివాహేతర సంబంధాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన డేటింగ్ యాప్స్ లో భారతీయుల సంఖ్య గణనీయంగా పెరిగింది. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ యాప్స్ ఎక్కువగా వాడుతున్న వారిలో తమిళనాడులోని కాంచీపురం వంటి చిన్న నగరాల వారు ఉండటం. ఇది వివాహేతర సంబంధాలు ఒక నిషిద్ధమైన అంశం కాదనే చేదు నిజాన్ని తెలియజేస్తోంది? మరి ఇంతగా ఈ బంధాలు పెరిగిపోవడానికి అసలు కారణాలేంటి? దీనిపై నిపుణులు ఏం అంటున్నారో ఇక్కడ చూడండి.

తీరని అవసరాలు, మానసిక శూన్యం
దాంపత్య జీవితంలో భాగస్వామి నుంచి అందాల్సిన ప్రేమ, శ్రద్ధ, శారీరక సాన్నిహిత్యం కొరవడినప్పుడు ఒకరకమైన మానసిక శూన్యం ఏర్పడుతుంది. ఆ లోటును పూడ్చుకోవడానికి చాలామంది వివాహేతర బంధం వైపు ఆకర్షితులవుతారు. తమ అవసరాలను తీర్చే మరో వ్యక్తి కోసం వెతకడం మొదలుపెడతారు.
రహస్య స్వర్గం
వివాహేతర బంధాలు పెరగడానికి అతిపెద్ద కారణం డిజిటల్ ప్రపంచం. డేటింగ్ యాప్స్, సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ గోప్యతకు, ఏకాంతానికి చిరునామాగా మారాయి. ఇక్కడ తమ గుర్తింపును దాచుకుని, తమకు నచ్చిన వారితో ఎలాంటి భయం లేకుండా మాట్లాడే అవకాశం దొరుకుతుంది. ఎన్ క్రిప్టెడ్ చాటింగ్ వంటి సదుపాయాలు వీరికి మరింత ధైర్యాన్ని ఇస్తున్నాయి.
ఏకాంత ప్రదేశాలు
ఒకప్పుడు వివాహేతర సంబంధం పెట్టుకున్న వారు కలుసుకోవడానికి ఎన్నో ఇబ్బందులు పడేవారు. కానీ ఇప్పుడు గంటల చొప్పున గదులను అద్దెకు ఇచ్చే హోటళ్లు, హోమ్ స్టేలు విరివిగా అందుబాటులోకి వచ్చాయి. ఇవి గోప్యతకు భంగం కలగకుండా ప్రశాంతమైన వాతావరణాన్ని అందిస్తుండటంతో తమ ఎఫైర్ భాగస్వామితో సమయం గడపడం సులభతరంగా మారింది.

మానసిక బంధం కోసం అన్వేషణ
చాలా సందర్భాల్లో ముఖ్యంగా మహిళలు, కేవలం శారీరక ఆకర్షణతో ఈ బంధాలను వెతకరు. తమ భాగస్వామితో పంచుకోలేని భావాలను, బాధలను అర్థం చేసుకునే ఒక మానసిక తోడు కోసం చూస్తారు. ఈ భావోద్వేగ బంధమే క్రమంగా శారీరక సంబంధానికి దారితీస్తుంది.
ఒంటరితనం అనే పెనుభూతం
భాగస్వామి పక్కనే ఉన్నా ఒంటరితనం అనుభవించే వాళ్లు చాలామంది ఉంటారు. ఆ ఒంటరితనం అనే పెనుభూతం నుంచి బయటపడటానికి, తమను పట్టించుకునే వారు ఒకరున్నారనే భావన కోసం చాలామంది వివాహేతర సంబంధాల వైపు అడుగులు వేస్తారు. ఇది తిరుగుబాటు అని చెప్పలేం.. ఒంటరితనం నుంచి పుట్టే ఒక ఆర్తనాదం అని నిపుణులు చెబుతున్నారు.



Click it and Unblock the Notifications
