Latest Updates
-
ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ 7 చిట్కాలు మీకోసమే! -
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ పెసర ఉత్తప్పం..కొబ్బరి చట్నీతో కలిపి తింటే స్వర్గమే! -
వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకోండి! ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఈ ఆహారపు అలవాట్లు తప్పనిసరి -
ఒక్కసారి చేస్తే నెలల తరబడి నిల్వ ఉండే మామిడికాయ తీపి పచ్చడి..టేస్ట్ అదుర్స్! -
ఆది శంకరాచార్య జయంతి: ఇంట్లో పూజలు చేస్తున్నారా? ఈ శుభ ముహూర్తాలు, నియమాలు మీకు తెలుసా? -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత యోగం.. మీ జాతకం ఎలా ఉంది? - మంగళవారం, 21 ఏప్రిల్ 2026 -
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్ -
ఎండలు మండిపోతున్నాయి.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్! వేడుకలను మార్చుకోకపోతే కష్టమేనా? -
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి! -
వడగాల్పుల ఎండలు భయపెడుతున్నాయా? ఈ చిన్న చిట్కాలతో ప్రాణాలు కాపాడుకోండి
డేటింగ్ యాప్ లో కలిశారా? మొదటిసారి కలిసినప్పుడు ఇలా చేస్తే ఫుల్ ఖుషీ
ఈ మధ్యకాలంలో సంబంధాలు అన్నీ ఆన్ లైన్ వేదికగానే ఉంటున్నాయి. ఆన్ లైన్ డేటింగ్ ప్రపంచం ఒక రంగుల పూలతోట లాంటిది. కొత్త పరిచయాలు, ఆసక్తికరమైన సంభాషణలు, విభిన్న మనస్తత్వాలు. అన్నీ మనల్ని ఉత్తేజపరుస్తాయి. కానీ ఆ అందమైన తోటలో కొన్ని ముళ్ళు కూడా ఉంటాయని గుర్తుంచుకోవాలి. డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన వ్యక్తితో మొదటిసారి డేట్ కు వెళ్తున్నారా? అయితే ఒక్క క్షణం ఆగి కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. అవేంటో ఇక్కడ చూడండి.
స్పష్టమైన సంభాషణే సంబంధానికి పునాది
డేటింగ్ యాప్స్ లో చాలా అపోహలకు, గందరగోళానికి కారణం ఒకటే.. ఎదుటి వ్యక్తి మనసులో ఏముందో సరిగ్గా అర్థం చేసుకోకపోవడం. అందుకే మొదటి నుంచే మీ ఉద్దేశాలను సూటిగా, స్పష్టంగా చెప్పండి. మీరు సీరియస్ రిలేషన్ షిప్ కోసం చూస్తున్నారా? లేక ఫ్రెండ్ షిప్ మాత్రమే కోరుకుంటున్నారా? లేదా సరదాగా కాలక్షేపం కోసమా? మీ మనసులో ఏముందో దాచుకోకుండా ధైర్యంగా చెప్పండి. ఇది మీకు మాత్రమే కాకుండా అవతలి వ్యక్తికి కూడా సమయాన్ని సేవ్ చేస్తుంది. తప్పుడు అంచనాలకు, భవిష్యత్తులో కలిగే మనస్తాపానికి ఇది మొదటి నుంచే అడ్డుకట్ట వేస్తుంది.

మీ ఆత్మవిశ్వాసమే మీ కవచం
కొత్త వ్యక్తితో మాట్లాడాలంటే మొదట్లో కాస్త సిగ్గు, భయం కలగడం సహజం. ఆన్ లైన్ లో మాట్లాడినంత మాత్రాన వెంటనే ఒక లోతైన బంధంలోకి అడుగుపెడుతున్నారని కాదు. ఇది కేవలం ఒక పరిచయ వేదిక. స్నేహపూర్వకంగా ఉంటూనే మీకంటూ కొన్ని సరిహద్దులు గీసుకోండి. సంభాషణలో మీకు ఏదైనా అసౌకర్యంగా అనిపిస్తే లేదా అవతలి వ్యక్తి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేలా ప్రవర్తిస్తే వద్దు లేదా నాకు ఇది నచ్చలేదు అని చెప్పడానికి అస్సలు సంకోచించకండి. మీ ఆత్మవిశ్వాసమే మిమ్మల్ని కాపాడే కవచం.
ప్రతి తిరస్కరణనూ మనసుకి తీసుకోవద్దు
మీరు పంపిన ప్రతి మెసేజ్ కు ఎవరైనా సమాధానం ఇవ్వకపోయినా లేదా మీ డేటింగ్ ప్రతిపాదనను తిరస్కరించినా దాన్ని వ్యక్తిగతంగా తీసుకోవద్దు. ఆన్ లైన్ ప్రపంచంలో ప్రతి ఒక్కరి ప్రాధాన్యతలు, పరిస్థితులు వేర్వేరుగా ఉంటాయి. ప్రతి సంభాషణ ప్రేమకథగా మారాలని నియమం లేదు. తిరస్కరణ అనేది మీ విలువను తగ్గించదు. దాన్ని ఒక అనుభవంగా స్వీకరించి, సానుకూల దృక్పథంతో ముందుకు సాగండి. తర్వాతి పరిచయం మీరు ఊహించిన దానికంటే అద్భుతంగా ఉండొచ్చేమో.
యాప్ ను వ్యసనంగా మార్చుకోవద్దు
నిరంతరం డేటింగ్ యాప్‌ను తెరిచి చూడటం, మెసేజ్‌ల కోసం ఎదురుచూడటం, ఒకేసారి పదుల సంఖ్యలో వ్యక్తులతో మాట్లాడటం ఇవన్నీ నెమ్మదిగా మీ నిజ జీవితంపై ప్రభావం చూపే వ్యసనంగా మారే ప్రమాదం ఉంది. మీ వర్చువల్ ప్రపంచానికి, వాస్తవ జీవితానికి మధ్య ఒక బ్యాలెన్స్ ను పాటించండి. యాప్ ను ఉపయోగించడానికి ఒక సమయాన్ని నిర్దేశించుకోండి. ఆన్ లైన్ బంధాలు ముఖ్యమే, కానీ అవే మీ ప్రపంచం కాకూడదని గుర్తుపెట్టుకోండి.

మొదటి కలయిక..అత్యంత జాగ్రత్తగా
ఇదే అత్యంత కీలకమైన ఘట్టం. మొదటిసారి కలుసుకోవడానికి ఎల్లప్పుడూ బహిరంగ ప్రదేశాన్ని ఎంచుకోండి. కాఫీ షాప్, రెస్టారెంట్ లేదా పార్క్ వంటివి సురక్షితమైనవి. మీ ఇంటి అడ్రెస్, జీతం, బ్యాంకు వివరాలు వంటి అత్యంత వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవడంలో తొందరపడొద్దు. అలాగే ఎదుటి వ్యక్తిని ఆకట్టుకోవాలనే ఉద్దేశంతో అవసరానికి మించి డబ్బు ఖర్చు చేయడం లేదా ఆర్థిక సహాయం పేరుతో డబ్బు ఇవ్వడం వంటివి చేయకండి. నిజమైన బంధం ఆడంబరాలపై కాదు, పరస్పర నమ్మకం, అవగాహనపై ఆధారపడి ఉంటుంది.
ఇది కీలకం
ఆన్ లైన్ డేటింగ్ ఎంత థ్రిల్లింగ్‌గా ఉంటుందో, అంత జాగ్రత్త కూడా అవసరం. మీరు మాట్లాడే వ్యక్తి ప్రొఫైల్ వీలైతే వెరిఫైడ్ అయిఉందో లేదో చూడండి. వారి సోషల్ మీడియా అకౌంట్స్ ఒకసారి పరిశీలించడం ద్వారా వారి గురించి మరింత తెలుసుకోవచ్చు. అన్నింటికన్నా ముఖ్యంగా డేట్ కు వెళ్లే ముందు, మీ నమ్మకమైన స్నేహితుడికి లేదా కుటుంబ సభ్యునికి మీరు ఎక్కడికి వెళ్తున్నారో, ఎవరిని కలుస్తున్నారో తెలియజేయడం తెలివైన పని అని గుర్తుంచుకోండి.



Click it and Unblock the Notifications











