Latest Updates
-
మీ కళ్ల ముందే ఎవరైనా కుప్పకూలిపోతే వెంటనే ఏం చేయాలి? -
నెలసరి సమయంలో వ్యాయామం చేయడం సురక్షితమేనా.. నిపుణుల సలహా ఏంటంటే.? -
ఎముకలకు బలాన్నిచ్చే సంప్రదాయ మటన్ షోర్బా.. ఒక్కసారి రుచి చూస్తే వదిలిపెట్టరు! -
వర్షాకాలం అలర్ట్.. గోడలపై ఇలా ఉంటే ఊపిరితిత్తుల వ్యాధికి దారితీస్తుందా.. డాక్టర్లు చెబుతున్న వాస్తవాలు -
మీ పిల్లలు కెరీర్లో ఉన్నతంగా ఎదగాలంటే.. స్టడీ రూమ్లో ఈ వాస్తు సలహాలు పాటించాల్సిందే.! -
ఈ వారం ఈ నాలుగు రాశుల వారికి తిరుగే లేదు.. అన్నింటా విజయమే, కష్టానికి తగిన ప్రతిఫలం.! -
కండల వీరుడికి ఏమైంది? సల్మాన్ ఖాన్ ఇలా అయిపోడానికి కారణం అదేనా? -
ఈ సింపుల్ చిట్కాతో ఎంతటి నల్లటి కడాయి అయినా సరే.. కొత్తదానిలా మెరవాల్సిందే! -
అద్భుత శక్తులున్న 4 రామాలయాలు ఇవే! -
చుక్క పాలు లేకుండానే గడ్డ పెరుగు.. ఇలా సులభంగా తయారు చేయండి!
బ్రేకప్ లేదా విడిపోయిన వెంటనే చేసుకోవాల్సిన అలవాట్లివే!
లవ్ బ్రేకప్ లేదా భాగస్వామి నుంచి విడిపోవడం జీవితంలో అత్యంత బాధాకరమైన అనుభవాలలో ఒకటి. విడిపోవడం అంటే కలలు, జ్ఞాపకాలు, భవిష్యత్తుకు సంబంధించిన ఆశలు అన్నీ ఒక్కసారిగా కూలిపోవడం. విడిపోయాక పాత జ్ణాపకాలు తలుచుకొని పదే పదే కుమిలిపోతుంటారు చాలామంది. నిద్రపట్టదు..తినాలనిపించదు, ఏ పని సరిగ్గా చేయలేకపోతుంటారు. చుట్టుపక్కల ఎందరున్నా ఒంటరిగా వీక్ గా ఉన్నట్లు అనిపిస్తుంది. అయితే దీని నుంచి బయటపడటానికి ఒక దారి ఉంది. కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లను మీ జీవితంలో భాగం చేసుకుంటే ఈ బాధ నుంచి బయటపడి, మరింత బలమైన వ్యక్తిగా మారవచ్చు.
శారీరక శ్రమతో మానసిక స్వస్థత
విడిపోయిన తర్వాత చాలామంది తమను తాము ఒక గదికి పరిమితం చేసుకుంటారు. బయటి ప్రపంచంతో సంబంధాలు తెంచుకుని, దుప్పటి ముసుగులో దుఃఖాన్ని దాచుకోవాలని చూస్తారు. అయితే ఇది బాధను మరింత పెంచుతుంది. కాబట్టి శారీరక శ్రమకు ప్రాధాన్యత ఇవ్వండి. మీరు వ్యాయామం చేసినప్పుడు మీ మెదడులో ఎండార్ఫిన్లు అనే ఫీల్ గుడ్ హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి సహజమైన నొప్పి నివారిణులుగా పనిచేసి మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి. ప్రతిరోజూ కనీసం అరగంట జిమ్ లో వర్కౌట్ కావచ్చు, యోగా కావచ్చు, ఉదయాన్నే చల్లగాలిలో నడక కావచ్చు, లేదా మీకు ఇష్టమైన పాటకు డ్యాన్స్ అయినా చేయండి. మీ శరీరం నుంచి చెమట బయటకు వెళ్తున్నప్పుడు మీలోని నెగిటివ్ ఆలోచనలు, నిరాశ కూడా బయటకు వెళ్లిపోతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

ఆరోగ్యకరమైన ఆహారంతో బలాన్ని పొందండి
విచారం కలిగినప్పుడు చాలామంది కంఫర్ట్ ఫుడ్ వైపు మొగ్గు చూపుతారు. ఐస్ క్రీమ్ లు, జంక్ ఫుడ్, స్వీట్లు వంటివి తాత్కాలికంగా ఉపశమనాన్ని ఇచ్చినట్లు అనిపించినా దీర్ఘకాలంలో అవి మీ శరీరాన్ని, మనసును మరింత నీరసపరుస్తాయి. అయితే వీటిని కాకుండా మీ శరీరానికి పోషణను అందించే ఆహారం తీసుకోండి. తాజా పండ్లు, ఆకుకూరలు, రంగురంగుల కూరగాయలు, ప్రొటీన్లు అధికంగా ఉండే పప్పుధాన్యాలు, నట్స్ వంటివి మీ ఆహారంలో చేర్చుకోండి. ఆరోగ్యకరమైన ఆహారం మీ శరీరానికి అవసరమైన శక్తిని ఇవ్వడమే కాకుండా మీ మూడ్ ను స్థిరంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

ప్రియమైన వారి అండతో ధైర్యం
బ్రేకప్ తర్వాత ఒంటరిగా ఉండాలనిపించడం సహజమే. అయితే మిమ్మల్ని మీరు ఒంటరి చేసుకోవడం సమస్యను మరింత జఠిలం చేస్తుంది. మీ బాధను అర్థం చేసుకోగల ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులతో టైం గడపండి. మీ భావాలను, ఆలోచనలను వారితో పంచుకోండి. మీ మనసులోని భారాన్ని దించుకున్నప్పుడు, ఒత్తిడి సగానికి తగ్గినట్లు అనిపిస్తుంది. వారి మద్దతు, ప్రేమ ఈ కష్టకాలంలో మీకు కొండంత అండగా నిలుస్తాయి. వారు చెప్పే ఓదార్పు మాటలు, మీతో గడిపే సమయం మీ గాయాన్ని మాన్పడంలో సహాయపడతాయి.
కొత్త స్కిల్స్ తో నూతన అధ్యాయం
ఖాళీగా ఉన్న మెదడు పదేపదే పాత జ్ఞాపకాలనే నెమరువేసుకుంటుంది. అందుకే మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. మీకు ఆసక్తి ఉన్న కొత్త అభిరుచిని అలవర్చుకోండి. అది పెయింటింగ్, సంగీతం, వంట చేయడం, కొత్త భాష నేర్చుకోవడం లేదా ఏదైనా ఆన్ లైన్ కోర్సు కావచ్చు. కొత్త విషయాలు నేర్చుకుంటున్నప్పుడు మీ దృష్టి గతం నుంచి వర్తమానం వైపు మళ్లుతుంది. ఇది మీలో ఒక కొత్త గుర్తింపును, స్వావలంబన భావనను పెంపొందించి జీవితంలో ముందుకు సాగడానికి అవసరమైన ధైర్యాన్ని ఇస్తుంది.



Click it and Unblock the Notifications