Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
సెక్స్ సమయంలో నొప్పి, ఈ కారణాల వల్లే కావొచ్చు, జాగ్రత్త!
శృంగారం ఓ మధురమైన అనుభూతి. దంపతుల మధ్య తప్పకుండా ఉండాల్సిన, జరగాల్సిన కార్యం. ఈ అద్వితీయమైన అనుభూతిని ఆస్వాదించాలే తప్పా మాటల్లో చెప్పడానికి పదాలు దొరకవు. అయితే ఈ కార్యాన్ని ఆస్వాదించే సమయంలో స్త్రీ, పురుషులు ఇద్దరిలో కొన్ని సార్లు అసౌకర్యం కలగవచ్చు. చాలా మంది దంపతులు సెక్స్ ను ఆస్వాదించే సమయంలో నొప్పి ఉంటుంది. ఈ నొప్పి స్త్రీలలో మాత్రమే ఉంటుంది, పురుషుల్లో ఉండదు అనుకుంటే పొరబడినట్లే. ఇద్దరిలోనూ నొప్పి ఉంటుంది. మరి ఈ నొప్పికి కారణం ఏంటో తెలుసా?

గర్భాశయం:
ప్రోలాప్డ్స్ గర్భాశయం ఉన్న వారికి శృంగార సమయంలో నొప్పి ఉంటుంది. ప్రతి నలుగురు స్త్రీలలో ఒకరికి ప్రోలాప్డ్స్ గర్భాశయం ఉంటుంది. దీని వల్ల సంభోగ సమయంలో నొప్పి కలుగుతుంది.
లైంగిక స్థానాల్లో నొప్పి:
శృంగారంలో కొన్ని లైంగిక స్థానాలు యోని, అంగ సంభోగ సమయంలో లోతుగా చొచ్చుకుపోయినప్పుడు నొప్పిని కలిగిస్తాయి. అంగాన్ని లోపలికి వెళ్లకుండా చేస్తుంది. దీని వల్లే స్త్రీలలో నొప్పి కలుగుతుంది.
అండాశయ తిత్తులు:
గర్భాశయ వెలుపల ఏర్పడే ద్రవంతో నిండినవే అండాశయ తిత్తులు. ఈ గడ్డల వల్ల ఎలాంటి నొప్పి ఉండదు. అయితే కొందరిలో వీటి వల్ల నొప్పి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సంభోగ సమయంలో నొప్పిని కలిగిస్తాయి.
సిస్టిక్ బ్లాడర్:
సిస్టిటిస్, సిస్టిక్ బ్లాడర్ పెయిన్ సిండ్రోమ్ అని కూడాఅంటారు. ఇది చాలా మందిని ప్రభావితం చేసే సమస్య. దీని వల్ల మూత్రాశయం ప్రాంతంలో నొప్పి, ఒత్తిడిని కలిగిస్తుంది. ఈ సిస్టిక్ బ్లాడర్ వల్ల సంభోగ సమయంలో నొప్పి కలుగుతుంది.
యోని పొడిగా మారడం:
యోని పొడిగా మారితే కూడా సంభోగం అసౌకర్యాన్ని, నొప్పిని కలిగిస్తుంది. యోని పొడిగా మారడానికి చాలా కారణాలు ఉంటాయి. అందులో ఒకటి హార్మోన్ల అసమతుల్యత.
ప్రోస్టటిటిస్:
ప్రోస్టటిటిస్ అనేది మూత్రాశయం కింద ఉండే కండరాల గ్రంథి. ఈ ప్రోస్టటిటిస్ స్పెర్మ్ ను ఉత్పత్తి చేస్తుంది. శరీరం నుంచి వీర్యాన్ని బయటకు పంపుతుంది. దిగువ పొత్తి కడుపు నొప్పి, వెన్ను నొప్పి సాధారణ లక్షణాలు. కొంత మంది పురుషులు స్ఖలనం సమయంలో లేదా తర్వాత నొప్పిని అనుభవిస్తారు.
అంటువ్యాధులు:
వివిధ ఇన్ఫెక్షన్ల వల్ల కూడా సంభోగం సమయంలో మంట వస్తుంది. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, ఈస్ట్ ఇన్ఫెక్షన్లు, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు మంటకు కారణం అవుతాయి. మహిళలలో బ్యాక్టీరియల్ వాగినోసిస్ యోని మంటకు కారణం అవుతుందని వైద్యులు చెబుతున్నారు.
వల్వోడినియా:
వల్వోడినియా అనేది దీర్ఘకాలిక సమస్య. ఇది హైపర్ సెన్సిటివ్ నరాల చివరల కారణంగా యోని ప్రాంతంలో నొప్పిని, మంటను కలిగిస్తుంది. ఇది సంభోగం సమయంలో ఎక్కువగా ఉంటుంది. కటి ఫ్లోర్ ఫిజికల్ థెరపీ, సైకలాజికల్ కౌన్సెలింగ్ తో ఈ లక్షణాలను తగ్గించుకోవచ్చు.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications