Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
అబ్బాయిలు పెళ్లి చేసుకోడానికి కరెక్ట్ ఏజ్ ఇదే!..సర్వేలో సంచలన నిజాలు
గతంలో చిన్న వయసులోనే అంటే 18-20 ఏళ్లకే పెళ్లిల్లు చేసుకువాళ్లు. భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో ఆడపిల్లలకు చిన్న వయస్సులోనే వివాహాలు జరిగాయి, ఇది చాలా చోట్ల ఇప్పటికీ కొనసాగుతోంది. అయితే పెళ్లి చేసుకోడానికి సరైన వయస్సు ఏది అనే ప్రశ్న వస్తే.. అమ్మాయిలకు 23-25 ఏళ్లలోపు పెళ్లి చేయాలని, అబ్బాయిలకు 27-32 ఏళ్లలోపు పెళ్లి చేయాలని సాధారణంగా మన పెద్దలు చెబుతుంటారు. చట్టపరంగా చూస్తే ఒక అబ్బాయి పెళ్లి చేసుకోవాలంటే మనదేశంలో అతనికి 21 ఏళ్ల వయస్సు ఉండాలి,అదే అమ్మాయికైతే 18 ఏళ్లు ఉండాలి.
ఈ వయస్సులో చేసుకుంటే విడాకులు
అబ్బాయిల విషయానికొస్తే 25-30 సంవత్సరాల మధ్యలోనే వివాహం చేసుకోవడం ఉత్తమమని మన పెద్దలు చెబుతుంటారు. ఎందుకంటే అప్పటికి అబ్బాయిలు చదువు,కెరీర్ మొదలైనవాటికి సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు,నిర్ణయాలు తీసుకోవడంలో పరిపక్వత పొందుతారు. అమెరికా నిర్వహించిన ఓ పరిశోధన ప్రకారం 27-32 ఏళ్లలోపు వివాహం చేసుకున్న జంటలు విజయవంతమైన వైవాహిక జీవితాన్ని గడుపుతారు. ఈ వయస్సులో పెళ్లి చేసుకున్న జంటలలో విడాకులు కూడా చాలా అరుదు.

లేట్ మ్యారేజ్
వాస్తవానికి అబ్బాయిలు ఇప్పుడు చదువు,కెరీర్‌తో పాటు పర్సనల్ స్పేస్ కి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం మొదలుపెట్టారు. ఒక్కసారి పెళ్లి చేసుకుంటే తమ స్వేచ్ఛను కోల్పోతామని చాలామంది మగవాళ్లు బలంగా నమ్ముతున్నారు. అంతేకాకుండా బాధ్యతలు కూడా పెరుగుతాయి. ఏది ఏమైనప్పటికీ వారు వివాహానికి వయస్సుతో సంబంధం కలిగి ఉండరు. దీని ఫలితమే నేటి యుగంలో అబ్బాయిలు మధ్య వయస్కుడైనా,పెద్దవాడైనా పెళ్లి చేసుకోవడానికి వెనుకాడటం లేదు.
35 ఏళ్ల తర్వాత చేసుకుంటే ఇలా
నేటికీ 35-38 సంవత్సరాల వయస్సులో వివాహం చేసుకుని సంతోషంగా వైవాహిక జీవితాన్ని గడుపుతున్నవాళ్లు మన చుట్టూ చాలామందే కనబడుతుంటారు. అయితే వయసు పెరిగే కొద్దీ పరస్పర విబేధాలు,అహం కూడా సంబంధ బాంధవ్యాలకు అడ్డుగా నిలుస్తాయన్నది కూడా నిజం. ఇటీవలి పరిశోధన ప్రకారం మీరు 35-40 ఏళ్ల తర్వాత వివాహం చేసుకుంటే విడాకుల అవకాశాలు ఐదు శాతం పెరుగుతాయి.
పెళ్లి చేసుకోడానికి కరెక్ట్ వయస్సు ఇదే
భారతీయ సమాజం కోణం నుండి చూస్తే 28-32 సంవత్సరాల వయస్సు అబ్బాయిల వివాహానికి అత్యంత అనుకూలమైన వయస్సుగా పరిగణించబడుతుంది. ఉద్యోగంలో, కెరీర్‌లో బాగా స్థిరపడిన తర్వాత పెళ్లి చేసుకోవడం అబ్బాయిలకు సౌకర్యంగా ఉంటుంది. చాలా మంది అబ్బాయిలు పెళ్లి కంటే జీవితంలో ఆర్థికంగా బలంగా ఉండటమే ముఖ్యమని భావిస్తారు.
పెళ్లి తర్వాత అబ్బాయిల జీవితాల్లో చాలా మార్పులు చోటుచేసుకుంటాయి. మానసికంగానూ, శారీరకంగానూ ఆ మార్పుకు వారు పూర్తిగా సిద్ధమయ్యారా లేదా అన్నది కూడా శ్రద్ద ముఖ్యం. సంతోషకరమైన వైవాహిక జీవితానికి ఈ విషయాలు చాలా ముఖ్యమైనవి. 30-32 సంవత్సరాల వయస్సులో అబ్బాయిల శరీరం అటువంటి మార్పులకు సిద్ధంగా ఉంటుంది. అందుకే ఈ వయసులో పెళ్లి చేసుకోవడం మంచిది. సాంప్రదాయ భారతీయ దృక్కోణం నుండి చూస్తే 20-25 సంవత్సరాల మధ్య వయస్సు.. వివాహానికి ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది.
బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధం
అమెరికాలో నిర్వహించిన ఓ సర్వేలో పురుషుల వివాహ వయస్సు 30-32గా అంచనా వేయబడింది. కానీ నేటి పరిస్థితుల్లో అబ్బాయిల పెళ్లికి 35 ఏళ్ల వయసు నిజంగానే సరిపోతుందని చెబుతున్నారు. దీనికి చాలా కారణాలున్నాయి. ఈ వయస్సులో అబ్బాయిలు తమ కెరీర్‌లో సెట్ అవుతారు. ఉద్యోగం కూడా పర్మినెంట్ అవుతుంది. వారు కూడా బాధ్యతలు స్వీకరించడానికి మానసికంగా సిద్ధమవుతారు. అంటే, వారు కుటుంబాన్ని, పిల్లలను చూసుకునే స్థితిలో ఉంటారు.



Click it and Unblock the Notifications