Latest Updates
-
లంచ్ బాక్స్‌లోకి క్విక్‌గా చేసుకునేలా ‘గీ రైస్’.. ముస్లిం వెడ్డింగ్ స్టైల్లో ఇలా చేసేయండి.! -
నలుగురితో నవ్వుతూ కలిసిపోవాలంటే ఈ 6 ప్రశ్నలు అస్సలు అడగకండి.! -
శ్రావణ మాసం స్పెషల్.. అమ్మవారికి ఎంతో ఇష్టమైన పాయసం.. పాలు లేకుండానే ఎంతో టేస్టీగా.! -
మెనోపాజ్ తర్వాత తీవ్రంగా కీళ్లు, ఎముకల సమస్య.. ఇందుకు కారణాలేంటి.. ఎలా బయటపడాలి.? -
మహిళల్లో పీరియడ్స్, ఫిట్నెస్ సమస్యలకు చెక్ పెట్టే ప్రొటీన్ పౌడర్.. తక్కువ ఖర్చుతో ఇంట్లోనే ఇలా చేసేయండి -
ఉల్లి, వెల్లుల్లి లేకుండా పూరీ, బగారాకి పర్ఫెక్ట్ కాంబినేషన్ ఆలూ టమాటర్ గ్రేవీ.. ఈ తాలింపుతోనే అసలు మజా.! -
ఇలాంటి టేస్ట్ ఎప్పుడూ చేసి ఉండరు.. టెంపుల్ స్టైల్ కాంచీపురం ఇడ్లీ, ఈ చట్నీతో తింటే అమోఘం.! -
ఉతికిన బట్టలు ఈ సమయంలో ఆరేస్తున్నారా.. వాస్తు ప్రకారం ఇంటికి ఎంత ప్రమాదకరమో తెలుసా.? -
వరలక్ష్మీ వ్రతం 2026: మీ ప్రియమైన వారికి శుభాకాంక్షలు తెలియజేయడానికి బెస్ట్ మెసేజెస్, వాట్సాప్ స్టేటస్ లు.. -
రోజుకు 2 యాలకులు తింటే..15 రోజుల్లో మీ శరీరంలో జరిగే అద్భుతాలు ఇవే!
పడకగది సుఖానికి రోజుల తరబడి గ్యాప్ వచ్చిందా? ఈ సైడ్ ఎఫెక్ట్స్ గురించి తెలుసుకోండి!
శృంగారం అనేది ప్రతి ఒక్కరూ అనుభవించాలనుకునే అనిర్వచణీయమైన అనుభూతి. దానిని మాటల్లో వివరించడం కంటే ఆస్వాదిస్తేనే అసలైన సుఖం, సంతృప్తి తెలుస్తుంది. మనుషులను బట్టి, వయస్సు బట్టి, కోరికలు, అవకాశాలు, సౌకర్యాలను బట్టి ఒక వ్యక్తి వారంలో ఎన్ని సార్లు శృంగారంలో పాల్గొంటాడనేది ఆధారపడి ఉంటుంది.
క్రమం తప్పకుండా లైంగిక చర్యలో పాల్గొనడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి. శృంగారంలో పాల్గొనే వారికి దాని వల్ల శారీరక, మానసిక ప్రయోజనాలు చేకూరుతాయని అంటున్నారు వైద్యులు. అయితే వారంలో తప్పనిసరిగా ఎన్నిసార్లు శృంగారం చేయాలన్న సంఖ్య కూడా ముఖ్యమా అనే ప్రశ్న తలెత్తుతుంది.

శృంగారం చేయకపోవడం వల్ల శారీరక, మానసిక ప్రభావాలు ఏంటి?
శృంగారం చేయకపోవడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. అలాగే శృంగారంలో వీటిని కచ్చితంగా పాటించాలన్న నియమాలు కూడా ఏవీ లేవు. ఎక్కువ కాలం శృంగారానికి దూరంగా ఉండటం వల్ల ఏలాంటి శారీరక, మానసిక సమస్యలు రావు.
వారంలో ఎన్నిసార్లు శృంగారం చేయాలనేది వ్యక్తులపై ఆధారపడి ఉంటుంది. వారి శారీరక దృఢత్వ స్థాయి, సెక్స్ డ్రైవ్, రిలేషన్‌షిప్ స్థితిపై ఆధారపడి ఉంటుంది.
శృంగారం చేయకపోవడం వల్ల కలిగే శారీరక పరిణామాలు:
క్రమరహిత, తరచూ శృంగారంలో పాల్గొనకపోవడం వల్ల లైంగిక ఆరోగ్య సమస్యలు, రుగ్మతలతో సహా వివిధ ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. పురుషులు ఎదుర్కొనే లైంగిక సమస్యలు
* అంగస్తంభన లోపం
* అకాల స్ఖలనం
* హైపోయాక్టివ్ సెక్సువల్ డిజైర్
* రెట్రోగ్రేడ్ స్ఖలనం
* మూత్ర నాళాల ఇన్ఫెక్షన్
* ప్రోస్టేట్ రుగ్మతలు
మహిళలు ఎదుర్కొనే లైంగిక సమస్యలు:
* యోని పొడిగా మారడం
* శృంగార సమయంలో నొప్పి
* యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్
* ఋతుస్రావం సమయంలో నొప్పి
* పెల్విక్ ఫ్లోర్ బలహీనత
* పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్
సెక్స్ చేయకపోవడం వల్ల కలిగే మానసిక పరిణామాలు:
సెక్స్ సమయంలో ఎండార్ఫిన్లు, ఇతర హార్మోన్లు విడుదల అవుతాయి. ఈ హార్మోన్ల వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుంది. ఎక్కువ కాలం పాటు తరచుగా సెక్స్ లేకపోవడం వల్ల మానసిక కల్లోలం, హార్మోన్ల తక్కువ ఉత్పత్తి వల్ల నిరాశకు కారణం కావొచ్చు.
తరచుగా సెక్స్ లేకపోవడం వల్ల నిద్రకు ఆటంకాలు, కొందరిలో ఒత్తిడి, ఆందోళన పెరగవచ్చు. చాలా సంవత్సరాల పాటు లైంగిక సంయమనం పాటించినప్పుడు వారిలో రోగనిరోధక శక్తి తగ్గవచ్చు. సెక్స్ చేయకపోవడం వల్ల మానసిక సమస్యలే కాకుండా భావోద్వేగా సమస్యలు రావొచ్చు. సంబంధంలో కలహాలు మొదలు కావొచ్చు. సంబంధంలో ఉన్నప్పుడు రోజులు, వారాలు, నెలల తరబడి సెక్స్ కు దూరంగా ఉంటే వారి మధ్య సాన్నిహిత్యం తగ్గవచ్చు.
Disclaimer: ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications