Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
రొమాన్స్ లో కొత్త ట్రెండ్..ప్లాటోనిక్ లవ్ మీద యువత ఇంట్రెస్ట్!
మారుతున్న కాలంతో పాటు మనుషుల మధ్య సంబంధాలు, వాటి స్వరూపాలు కూడా పూర్తిగా మారిపోతున్నాయి. వాట్సాప్ స్టేటస్ ల దగ్గర నుంచి ఇన్ స్టాగ్రామ్ రీల్స్ దాకా ప్రేమను వ్యక్తపరిచే విధానాలు మారాయి. పెళ్లి, డేటింగ్ వంటి సంప్రదాయ సంబంధాలకు అతీతంగా, నేటి యువతరం కొత్త బంధాలను అన్వేషిస్తోంది. ఈ అన్వేషణలో పుట్టిందే ప్లాటోనిక్ లవ్ అనే సరికొత్త ట్రెండ్. ఇది స్నేహం కంటే గాఢమైనది, కానీ సంప్రదాయ ప్రేమ బంధానికి భిన్నమైనది. అసలేంటీ ప్లాటోనిక్ బంధం? నేటి తరానికి ఎందుకింత నచ్చుతోంది?
ప్లాటోనిక్ ప్రేమ
ఇద్దరు స్నేహితులు..కానీ అంతకుమించి. ప్రేమికులు.. కానీ ఆ నిర్వచనంలో ఇమడరు. ఇదే ప్లాటోనిక్ లవ్ అసలైన రూపం. ఈ బంధంలో ఇద్దరు వ్యక్తుల మధ్య విడదీయరాని మానసిక అనుబంధం, లోతైన నమ్మకం, అపారమైన ప్రేమ ఉంటాయి. కానీ ఇక్కడ శారీరక ఆకర్షణకు, సాన్నిహిత్యానికి ఏమాత్రం తావుండదు. ఇది కేవలం మనసుకు మనసుకు మధ్య ఏర్పడే ఓ అదృశ్య వారధి. ఒకరినొకరు అర్థం చేసుకోవడం, ఎలాంటి అంచనాలు లేకుండా ఒకరికొకరు తోడుగా నిలవడం ఈ బంధానికి పునాది.

నేటి తరానికి ఎందుకింత ప్రత్యేకం?
ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒకరకమైన ఒంటరితనంతో, ఒత్తిడితో పోరాడుతున్నారు. మనసులోని మాటలను పంచుకోవడానికి, మనల్ని పూర్తిగా అర్థం చేసుకునే ఒక తోడు కావాలని అందరూ కోరుకుంటారు. ప్రేమ సంబంధాలలో ఉండే అంచనాల బరువు, బాధ్యతల ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకునే ఓ ప్రదేశం కోసం వెతుకుతారు. ప్లాటోనిక్ బంధం సరిగ్గా అలాంటి భద్రతనే అందిస్తుంది. ఇక్కడ ఎలాంటి తీర్పులు ఉండవు, మనసు విప్పి మాట్లాడుకోవడానికి సంకోచాలు అడ్డురావు. అందుకే ఈ బంధం నేటి యువతకు మానసిక ఆసరాగా నిలుస్తోంది.
ప్రేమకు, ప్లాటోనిక్ బంధానికి తేడా ఏంటి?
సాధారణ ప్రేమ సంబంధంలో శారీరక సాన్నిహిత్యం, సామాజిక కట్టుబాట్లు, భవిష్యత్ ప్రణాళికలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. కానీ ప్లాటోనిక్ బంధంలో వీటికి తావుండదు. ఇక్కడ ప్రధాన పాత్ర పోషించేది ఎమోషనల్ సపోర్ట్, మేధోపరమైన చర్చలు, ఒకరి కష్టసుఖాల్లో ఒకరు పాలుపంచుకోవడం. కలిసి సినిమాలు చూడొచ్చు, గంటల తరబడి కబుర్లు చెప్పుకోవచ్చు కానీ ఆ బంధానికి శారీరక ఆకర్షణ అనే రంగు పులమరు.
ఈ బంధంలోని అందమైన ప్రయోజనాలు
- భాగస్వామిని మార్చాలనే ప్రయత్నం కానీ, వారిపై అంచనాలు రుద్దడం కానీ ఉండదు. దీంతో బంధం చాలా తేలికగా, ఆనందంగా ఉంటుంది.
-ఒంటరితనాన్ని దూరం చేసి, ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనకంటూ ఒకరున్నారనే ధైర్యాన్నిస్తుంది. ఇది మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది.
-శారీరక ఆకర్షణ అనే అంశం లేకపోవడంతో, ఈ సంబంధంలో దాపరికాలు లేకుండా స్వచ్ఛమైన నమ్మకం, నిజాయితీ ఉంటుంది
ఈ బంధం భవిష్యత్తులో మారుతుందా?
ప్రతి బంధం లాగే ఈ సంబంధం కూడా కాలక్రమేణా పరిణామం చెందే అవకాశం ఉంది. కొన్నిసార్లు ఈ గాఢమైన స్నేహం ప్రేమగా మారవచ్చు. అయితే, ఈ బంధం అసలైన అందం ఇద్దరి మధ్య ఉండే స్పష్టతలోనే దాగి ఉంది. తమ మధ్య ఉన్న సరిహద్దులను గౌరవించుకుంటూ, ఒకరికొకరు తోడుగా నిలవడమే దీనికి మూలం.



Click it and Unblock the Notifications