Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
రోజూ హస్తప్రయోగం చేసుకుంటున్నారా?..పెళ్లాయ్యాక దీని ప్రభావం గురించి షాకింగ్ నిజాలు చెప్పిన డాక్టర్
ప్రస్తుతం ముఖ్యంగా యువతలో హస్తప్రయోగం ఒక సర్వసాధారణమైన అంశంగా మారింది. వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం..మహిళల కంటే పురుషుల్లోనే ఇది ఎక్కువగా కనిపిస్తుంది. లైంగిక కోరికలు, ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఇది ఒక సహజమైన, ఆరోగ్యకరమైన మార్గమని డాక్టర్లు అంగీకరిస్తున్నారు. ఇతరుల సహాయం లేకుండా స్వీయ సంతృప్తి పొందడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈ కోణంలో చూస్తే హస్తప్రయోగం మంచిదే. అయితే ఏదైనా శృతి మించితే అనర్థమే.
ఏ అలవాటైనా వ్యసనంగా మారితే అది సమస్యలకు దారితీస్తుందని ప్రముఖ వైద్య నిపుణురాలు డాక్టర్ బి. యోగా విద్య హెచ్చరిస్తున్నారు. యూట్యూబ్‌లో ఆమె పోస్ట్ చేసిన ఒక వీడియోలో ఈ రోజుల్లో పురుషులే మహిళల కంటే ఎక్కువగా హస్తప్రయోగం చేసుకుంటున్నారు. ఇది ఒక పరిధి వరకు మంచిదే అయినప్పటికీ పెళ్లికి ముందు ప్రతిరోజూ హస్తప్రయోగం చేసుకోవడం మంచిది కాదని ఆమె స్పష్టం చేశారు. ఆమె వ్యాఖ్యలు చాలా మందిని ఆలోచింపజేసేవిగా ఉన్నాయి. పెళ్లికి ముందు ప్రతిరోజూ దీనికి బానిసవ్వడం భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆమె చెబుతున్నారు.

పెళ్లికి ముందు హస్తప్రయోగం ఎందుకు ప్రమాదకరం?
డాక్టర్ యోగా విద్య విశ్లేషణ ప్రకారం..పెళ్ళికి ముందు ఎవరి సహాయం లేకుండా తమకు తాము లైంగిక సంతృప్తిని పొందడం అలవాటు చేసుకున్న వారు,భవిష్యత్తులో తమ జీవిత భాగస్వామిపై లైంగిక కోరికల కోసం ఆధారపడకపోవచ్చు. ఒకవేళ ఆధారపడినా వారికి సంపూర్ణ సంతృప్తి లభించకపోవచ్చు. తమను తాము తృప్తి పరచుకోవడానికి అలవాటుపడిన వారికి ఇతరుల వల్ల కలిగే ఆనందం లేదా సంతృప్తి తక్కువగా ఉండవచ్చు. ఫలితంగా వారు మళ్ళీ తమ పాత అలవాటు వైపే మొగ్గు చూపవచ్చు.. అది క్రమంగా వ్యసనంగా మారే ప్రమాదం ఉంది.
శారీరక ప్రభావాలు
హస్తప్రయోగం చేసేటప్పుడు చాలామంది వ్యక్తులు ఫోర్ ప్లే లేకుండానే నేరుగా స్కలనం వైపు వెళ్ళిపోతారు. దీనివల్ల 3 నిమిషాల్లోనే స్కలనం జరిగిపోవచ్చు. ఇది దీర్ఘకాలంలో స్ఖలనాన్ని నిలబెట్టుకునే సామర్థ్యాన్ని తగ్గించే అవకాశం ఉంది. వివాహం తర్వాత తమ భాగస్వామితో శృంగారంలో పాల్గొనేటప్పుడు ఈ సామర్థ్యం లేకపోవడం వల్ల శీఘ్రస్కలనం వంటి సమస్యలు తలెత్తవచ్చు. ఇది వైవాహిక సంబంధాలపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది.
మానసిక, సంబంధాలపై ప్రభావాలు
తరచుగా హస్తప్రయోగం చేసుకునే వాళ్లు పెళ్లి తర్వాత తమ లైంగిక కోరికలను తీర్చుకోవడానికి భార్య దగ్గరికి వెళ్లకపోవచ్చు. ఇది క్రమంగా దంపతుల మధ్య శారీరక సాన్నిహిత్యాన్ని తగ్గిస్తుంది. సాన్నిహిత్యం లేకపోవడం వల్ల వైవాహిక సంబంధంలో ఎడబాటు వచ్చి చీలిక వచ్చే ప్రమాదం ఉంది. ఒక ఆరోగ్యకరమైన వైవాహిక జీవితానికి శారీరక, మానసిక సాన్నిహిత్యం చాలా అవసరం. నిత్యం హస్తప్రయోగం చేసుకునే అలవాటు ఈ సాన్నిహిత్యానికి అడ్డుగోడగా మారవచ్చు. అందువల్ల వివాహానికి ముందు తరచుగా లేదా రోజువారీ హస్తప్రయోగానికి దూరంగా ఉండటం మంచిదని డాక్టర్ యోగా విద్య గట్టిగా సూచిస్తున్నారు. ఇది కేవలం ఒక శారీరక అలవాటుగా కాకుండా భవిష్యత్తు సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపే అంశంగా యువత గుర్తించాలి.



Click it and Unblock the Notifications