Latest Updates
-
ప్రోటీన్ రిచ్ రాగి పనీర్ పరాఠా..షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..ఈజీగా చేసుకోండిల -
పని వేళలు కాదు.. పని పూర్తయ్యేవరకు ఉండాల్సిందే.. బ్యాంకు గేటుకు తాళం వేసిన మేనేజర్.. వైరల్ వీడియో.! -
స్నానం చేసేటప్పుడు మొదట ఏ భాగంపై నీళ్లు పోయాలి.?.. ఆయుర్వేదం ప్రకారం సరైన పద్ధతి ఏంటో తెలుసా.? -
తెలంగాణలో ఘనంగా బోనాల వేడుకలు.. ఆధ్యాత్మిక రహస్యం, చరిత్ర ఇదే.! -
మదురై స్పెషల్ మటన్ దోశ.. ఇలా చేస్తే జన్మలో ఆ రుచిని మర్చిపోలేరు! -
సూర్యగ్రహణం 2026..గ్రహణానికి ముందు, తర్వాత చేయాల్సిన పనులివే! -
డ్రై ఫ్రూట్స్ రోజుకు ఎన్ని తినాలో తెలుసా? ఆ తప్పు చేస్తే ప్రమాదమే! -
డెలులు డేటింగ్.. మీరూ ఇలాంటి భ్రమల్లో బతుకుతున్నారా.? -
పెనంపైనే రెస్టారెంట్ స్టైల్ లో.. దూదిలాంటి మెత్తని గార్లిక్ నాన్ చేసేయండిలా! -
మీ కళ్ల ముందే ఎవరైనా కుప్పకూలిపోతే వెంటనే ఏం చేయాలి?
పిల్లలు పుట్టగానే భార్యా భర్తల మధ్య పెరుగుతున్న సమస్యలు.. వాటికి కారణాలు..!
ప్రేమించుకొని వివాహం చేసుకున్న తరువాత లేక వివాహం చేసుకొని ప్రేమించిన తరువాత బిడ్డ జన్మించినప్పుడు అప్పటి వరకున్న భార్యా భర్తల బంధంలో కొంత మార్పు చోటుచేసుకుంటుంది. ఇద్దరి మధ్యలో బిడ్డ వచ్చిన తరువాత పరస్పరం చూపించుకునే ప్రేమలో కొంత వ్యత్యాషం వుటుంది. పిల్లలు జన్మించిన తరువాత అంతకు ముందున్న వారి వైవాహిక జీవితానికి తరువాత దానికి చాలా భిన్నంగా వుంటుంది. బిడ్డ పుట్టిన తరువాత భార్యా భర్తలు ఇద్దరూ ఎదుర్కొనే సమస్యలేంటి, వారు ఎలాంటి ఛాలెంజ్‌లను చూస్తారో ముందుగానే మీకు తెలియజేస్తున్నాం. ఈ అంశాలను బిడ్డలు పుట్టిన దంపతులకు అవగాహన వుండి వుంటుంది.
నిద్రలేకపోవడం
పిల్లలు పుట్టిన తరువాత భార్యా భర్తలిద్దరికీ నిద్ర లోపిస్తుంది. పసిపిల్లలు ఎక్కువగా రాత్రి మేలుకొని వుంటారు, ఉదయం పడుకొన వుటారు. ఉద్యోగం చేసి వచ్చిన భర్త అలసిపోయి నిద్రపోతే రాత్ర పిల్లలు గట్టిగా ఏడ్చినప్పుడు నిద్రకు భంగం ఏర్పడినప్పుడు కొన్ని సందర్భాల్లో కొందరు తల్లిదండ్రులకు చికాకు వస్తుంది. ఈ చికాకుంతో తల్లిదండ్రులిద్దరూ గొడవపెట్టుకుంటారు. ఇద్దరూ ఉద్యోగులైతే అప్పుడు సమస్య మరింత ఎక్కువగా వుంటుంది. ఇద్దరూ ఉదయం పనిలో అలసిపోవడం వల్ల పిల్లల ఏడుపుతో మేలుకవతో తీవ్రంగా డిస్టర్బ్ అవుతారు.

బాధ్యత
పిల్లలను కన్న తరువాత వారి బాధ్యతలను చూసుకునేందుకు తల్లిదండ్రులు కొంత వెనకడుగు వేస్తున్నారు. ఈ కాలం తల్లులు ఉద్యోగం చేయడం వల్ల పిల్లలను సరిగ్గా చూసుకోలేకపోతున్నామని అంటున్నారు. ఈ విషయంలో భార్య భర్తలిద్దరి మద్య తీవ్రమైన గొడవలు జరుగుతున్నాయ్. ఇద్దరూ ఏదో ఒక కారణంతో బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. పిల్లలంటేనే బాధ్యత ఆ బాధ్యతను తప్పుతున్నారు.
పార్ట్‌నర్‌కు సమయం కేటాయించడం
భార్య భర్త పిల్లలు పుట్టేవరకు ఒకరితో ఒకరు దగ్గరున్న ప్రతీ సందర్భంలో ఘాడంగా కలుసుకుంటారు. పిల్లలు పుట్టిన తరువాత బాధ్యతల్లో పడి భాగస్వామికి తక్కువ సమయాన్ని కేటాయిస్తారు. సమయం తక్కువ కేటాయించడం వల్ల ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది.
టూర్స్ ట్రావెల్స్
బిడ్డ పుట్టిన తరువాత దూరప్రయాణాలు చేయాలనే ఆలోచనను, ఏవైనా ప్లాన్స్ వుంటే తగ్గించుకుంటారు. దీని వళ్ల భార్యా భర్తలు కాలక్షేపం కోసం, రిలాక్స్ అవడానికి ఎక్కడికి వెళ్లలేకపోతున్నారు. ఈ విషయం పట్ల ఇద్దరికీ గొడవలు పెరుగుతున్నాయ్. ఎన్ని సమస్యలు వచ్చినా పిల్లలను తీసుకొని ఖచ్ఛితంగా ప్లాన్ చేసుకొని ఏదైనా ప్లేస్‌కు వెళ్లి కుటుంబంతో ఎంజాయ్ చేయాలి.
సమయం కేటాయించకపోవడం
భార్యా భర్తలు వివాహం చేసుకున్నది ఇద్దరూ కలిసి ఈ జీవిత ప్రయాణాన్ని కొనసాగించడానికి. కానీ బిజీ లైఫ్ వల్ల పిల్లలను చూసుకునే బాధ్యతలో పడి, భర్తకు లేదా భార్యకు సమయం కేటాయించడం లేదు. ఎన్ని అడ్డంకులు వచ్చినా, పిల్లలు ఉన్నా సమయం కేటాయించుకోవాలి. అటు పిల్లలకు సమయం కేటాయిస్తూనే జీవిత భాగస్వామికి కూడా తగిన సమయాన్ని కేటాయించాలి.
భర్త పై ప్రేమ
పిల్లలు పుట్టిన తరువాత చాలా మంది తల్లులు సమయం మొత్తం పిల్లలను చూసుకోవడానికే గడుపుతారు. శిశువులు నిద్రకు వెళ్లినా వారి పక్కనే ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. ఇలాంటి సమయంలో భర్త పై కేటాయించే సమయం తగ్గిపోతుంది. భర్త భోజనం, భర్తకు సంబంధించిన పనులు చూసుకోవడం తగ్గిపోతాయ్. ఈ క్రమంలో భార్యా భర్తలిద్దరి మధ్య కొంత దూరం పెరుగుతుంది.



Click it and Unblock the Notifications