Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
Happy Propose Day 2025: ప్రపోజ్ డే ఐడియాస్.. ఇలా ప్రపోజ్ చేస్తే ఎలాంటి అమ్మాయి అయినా పడిపోవాల్సిందే
ప్రేమలో అత్యంత కఠినమైన పని ఏదైనా ఉందంటే.. అది ప్రేమను వ్యక్తపరచడమే. తాము ప్రేమిస్తున్న వ్యక్తి తమ ప్రేమను ఒప్పుకుంటారో లేదో అని, ఎలా చెప్పాలో అని చాలా మంది టెన్షన్ పడుతుంటారు. అయితే ప్రేమలో అత్యంత ముఖ్యమైన ఈ కార్యాన్ని అత్యంత సొగసుగా, నిజాయితీగా, ధైర్యంగా వ్యక్తపరచడానికి ప్రపోజ్ డే సరైన సమయం. అయితే ఈ ప్రపోజ్ డే రోజున మీ ప్రేయసికి ఏ విధంగా ప్రపోజ్ చేయాలనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
1. సమయం, స్థలం ఎంచుకోండి
మీ ప్రేమను వ్యక్త పరిచేందుకు సరైన సమయం, స్థలం ఎంచుకోవడం చాలా ముఖ్యం. మీరు ఇష్టపడే వ్యక్తి మంచి ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నప్పుడు ప్రపోజ్ చేయడం ఉత్తమం. అందుకోసం ఒక మంచి రొమాంటిక్ ప్లేస్, లేదా మీ ఇద్దరూ ఇష్టపడే ప్రదేశాన్ని ఎంచుకొని, సాయంకాలం సమయంలో అక్కడికి తీసుకెళ్లి ప్రపోజ్ చేస్తే కచ్చితంగా మీ ప్రేమకు ఒప్పుకునే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు సముద్రతీరంలో లేదా కాఫీ షాప్‌లో లేదా మీ ఇద్దరికీ మంచి జ్ఞాపకాలు ఉన్న ప్రదేశంలో ప్రపోజ్ చేయడం మంచిది.

2. సరైన భావాలు
మీరు ప్రపోజ్ చేసేటప్పుడు సరళమైన, నిజమైన మాటలు ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. అందురు ప్రపోజ్ చేయడానికి ముందు మీరు సరైన భావాలు వచ్చే విధంగా మాట్లాడండి. మీరు మాట్లాడితేనే ప్రేమ, గౌరవం, మీపైన నమ్మకం, మీ ఆత్మీయత, స్నేహం వంటి అంశాలు తెలిసేలా మాట్లాడండి. ఉదాహరణ: "నువ్వు నా జీవితంలోకి వచ్చిన రోజు నా ప్రపంచం మారింది. నేను నీతో ఎప్పటికీ ఆనందంగా జీవించాలనుకుంటున్నాను. నువ్వు నా జీవిత భాగస్వామిగా ఉండగలవా?" అని ప్రపోజ్ చేయండి.
3. ఓ కస్టమైజ్డ్ గిఫ్ట్‌తో
ప్రపోజ్ డే సందర్భంగా ఒక కస్టమైజ్డ్ గిఫ్ట్ ఇవ్వడం మరింత ప్రత్యేకంగా మారుతుంది. అది ఇష్టమైన పుస్తకం, ఫోటో ఆల్బమ్, ఫొటో ఫ్రేమ్ లేదా ఒక చిన్న దుస్తులు కావచ్చు. ఇలా మీరు మీరు అనుకున్న వ్యక్తి కోసం ప్రత్యేకంగా ఆలోచించి ఇచ్చినది మరింత ప్రభావం చూపుతుంది.
4. హృదయపూర్వకమైన ఆలోచనలు
ఆత్మీయంగా, నిజాయితీగా, ప్రేమను వ్యక్తం చేస్తూ ప్రపోజ్ చేయడం చాలా గొప్ప విషయం. అందుకోసం కవితలు చెబుతూ.. మీరు చేసిన ప్రయాణాన్ని కవితల రూపంలో వివరిస్తూ.. ప్రపోజ్ చేస్తే కచ్చితంగా మీ ప్రేమ ఒప్పుకునే అవకాశం ఉంటుంది. ఇందుకోసం మీ జీవితానికి, మీ ప్రయాణానికి సంబంధించిన ఓ చిన్న స్క్రిప్ట్ రాసుకొని.. అందులో మీరు అనుభవించిన గొప్ప క్షణాలను, మీరు చేసిన పనులను వివరించండి.
5. క్యాండిల్‌లైట్ డిన్నర్
ఒక చిన్న, రొమాంటిక్ క్యాండిల్‌లైట్ డిన్నర్ ప్లాన్ చేయడం వల్ల మొత్తం మూడ్ మారిపోతుంది. ఈ డిన్నర్‌తో పాటుగా సున్నితమైన సంగీతం, ప్రేమతో కూడిన ఆహారం, చక్కని ప్రపోజల్ మాటలు ఈ రోజును మీకు ప్రత్యేకమైనదిగా మార్చేస్తుంది.
6. ఒక చిన్న షాక్, అద్భుతమైన తీరుబాటు
ప్రపోజ్ చేసేటప్పుడు, మీరు ఏదైనా చిన్న, ఊహించని షాక్ ఇవ్వడం కూడా చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ఉదాహరణకు.. బహుమతి పెట్టి కొంచెం డిఫరెంట్‌గా ప్రాంక్ చేసి ప్రపోజ్ చేయడం, లేదా ఒక రియాలిటీ ఘటనను సృష్టించి దానికి ఆధారంగా ప్ప్రపోజ్ చేయడం వలన కచ్చితంగా మీ ప్రేమలో నిజాయితీ వారికి అర్ధం అవుతుంది. అలాగే మీ ప్రేమను ఒప్పుకుంటారు. వీటితో పాటు ఇంకా కొన్ని విషయాలు పాటించి ప్రపోజ్ చేస్తే కచ్చితంగా లవ్ సక్సెస్ అయిపోయినట్లే.



Click it and Unblock the Notifications