Latest Updates
-
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా..
ఆరోజు ప్రపోజ్ చేస్తే లవ్ పక్కా సక్సెస్ అవుతుందట.. కానీ ఆ సమయంలోనే ప్రపోజ్ చేయాలట!
అన్ని వారాల్లో శుక్రవారానికి చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తూ ఉంటారు. ఆ రోజు లక్ష్మీదేవికి సంబంధించిన రోజు అని, అలాగే ఆరోజు లక్ష్మీదేవి అనుగ్రహం మెండుగా లభిస్తుందని చెబుతూ ఉంటారు. అలాంటి పవిత్రమైన రోజున ప్రేమికులు తమ ప్రేమను వ్యక్తపరిస్తే అది తిరస్కరణకు గురయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని పండిత నిపుణులు పేర్కొంటున్నారు.
అలాగే కొన్ని వస్తువులు కొనుగోలు చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందొచ్చని, కొన్ని పనులు చేయడం వల్ల దారిద్య్రం చుట్టుకుంటుందట. అయితే ఆ పనులు చేయడానికి కూడా ఒక సమయం ఉంటుందని, ఆ సమయం ప్రకారమే ఆ పనులు చేయాలంటున్నారు. ఆ సమయం ఏంటి, ఎలాంటి పనులు చేయాలి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

ఏ సమయంలో ప్రపోజ్ చేయాలంటే..
శుక్రవారం రోజు ఎవరైనా తమకు ప్రియుడికి లేదా ప్రేయసికి ప్రపోజ్ చేస్తే.. వారి ప్రేమ కచ్చితంగా సక్సెస్ అవుతుందని జ్యోతిష్యశాస్త్రం చెబుతోందట. అయితే కొన్ని అనుకూల సమయంలోనే తమ ప్రేమను వ్యక్తపరచాలంటున్నారు. శుక్రవారం రోజు ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు.. మధ్యాహ్నం 1 నుంచి రెండు గంటల వరకు, రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల మధ్యలో ప్రపోజ్ చేస్తే.. అవతలి వ్యక్తి రిజెక్ట్ చేసే అవకాశం చాలా తక్కువగా ఉంటుందట.
ఈ సమయాల్లో శుక్ర హోరు చాలా అమోఘంగా ఉంటుందని, ఆ శుక్ర హోరు సమయంలో ప్రపోజ్ చేయడం వల్ల పాజిటివ్ ఎనర్జీ రావడంతో పాటు ప్రేమ తిరస్కరణకు గురయ్యే ఆస్కారం కూడా చాలా తక్కువగా ఉంటుందని పలువురు జ్యోతిష్యులు చెబుతున్నారు.
ఆభరణాలు కొనొచ్చా?
శుక్రవారం రోజు ఆభరణాలు కొంటే చాలా మంచిదని జోతిష్య నిపుణులు పేర్కొంటున్నారు. విలాస వస్తువులు, బంగారు ఆభరణాలు, నూతన వస్త్రాలు, నూతన ఆభరణాలు, గాజులు, పువ్వులు, సెంట్ వస్తువులు కొంటే శుభసూచకమని, అలా చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం లభిస్తుందని, అలా చేయడం చాలా వరకు సుఖ శాంతులను కూడా కలగజేస్తాయని చెబుతున్నారు.
సినీ రంగాల్లో రాణించడం..
సాధారణంగా ఏ సినిమా అయినా శుక్రవారం మాత్రమే విడుదలవుతుంది. ఎందుకంటే శని ఆదివారాలు సెలవు ఉండడంతో పాటు, శుక్రవారం విడుదలైతే మంచి గుర్తింపు, దేవుడి కరుణ తమ సినిమాపై ఉంటుందని నమ్ముతుంటారు. అలానే సినిమా, ఎంటర్టైన్మెంట్ రంగాల్లో ఉద్యోగాల కోసం, అవకాశాల కోసం ప్రయత్నాలు చేసేవారు.. శుక్రవారం రోజు ప్రయత్నిస్తే కచ్చితంగా విజయవంతమవుతారట.
వారి జీవితంలో కూడా ఎన్నో విజయాలు పొందే ఆస్కారం ఉంటుందని చెబుతున్నారు. అలాగే చిన్నపిల్లలకు అన్న ప్రాసన, అక్షరాభ్యాసం, చెవులు కుట్టించడం, నామకరణం, సీమంతం వంటి కార్యక్రమాలు శుక్రవారం రోజు చేస్తే చాలా మంచిదని, అలాగే పిల్లలకు కూడా భవిష్యత్తులో చాలా శుభ పరిణామాలు జరుగుతాయని చెబుతున్నారు.
ఎలాంటి పనులు చేయకూడదంటే..
సాధారణంగా శుక్రవారం రోజు ఆడపిల్లను అత్తారింటికి పంపించరు. అయితే ఆరోజు ఆడపిల్లలను ఎట్టిపరిస్థితుల్లోనూ అత్తారింటికి పంపించొద్దట. శుక్రవారం రోజు దేవతలు ఇంట్లోకి ప్రవేశిస్తారని, అలాంటి సమయంలో ఇంట్లోని ఆడవాళ్ళు జుట్టు విరబోసుకొని ఉండొద్దని, ఇలా చేయడం వల్ల దేవతలు ఇంట్లోకి ప్రవేశించరని చెబుతున్నారు. అలాగే శుక్రవారం పూట లక్ష్మీదేవికి సంబంధించిన మంత్రాలను జపం చేస్తే లక్ష్మీకటాక్షం లభిస్తుందని తెలుపుతున్నారు.
గమనిక: ఈ కథనంలో మేము పొందుపరిచిన అంశాలు ఇంటర్నెట్‌లో మాకు దొరికిన సమాచారంతో పాటు పలు అధ్యయనాలు, జోతిష్యశాస్త్రం అందించబడింది. వీటిని పాటించే ముందు తప్పనిసరిగా నిపుణుల సలహాలు తీసుకుంటే మంచిది.



Click it and Unblock the Notifications