Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
Relationship Tips: తాగేసి శృంగారం చేస్తున్నారా? వీటి గురించి తప్పకుండా తెలుసుకోండి
శృంగారం అనేది అనిర్వచణీయమైన అనుభూతి. దానిని ఆస్వాదించాల్సిందే కానీ ఆ అనుభవాన్ని చెప్పడం సాధ్యం కాదు. వర్ణనకు అందని ఆనందం అది. శృంగారం ద్వారా మానసిక, శారీరక, భావోద్వేగ ప్రయోజనాలు అనేకం ఉన్నాయి.

కొందరు శృంగారాన్ని ఏదో మొక్కుబడిగా కానిచ్చేస్తుంటారు. మరికొందరు భాగస్వామి ఇష్టాయిష్టాలను పట్టించుకోకుండా ఉద్వేగానికి గురై ఆపై చల్లబడిపోతారు. ఇద్దరు వ్యక్తులు శారీరకంగా, మానసికంగా పెనవేసుకుని స్వర్గపు అంచులకు వెళ్లిరావడమే శృంగారం అంటే.
కొందరు వ్యక్తులు మద్యం సేవించి శృంగారంలో పాల్గొంటారు. మరికొందరికి మందు తాగితేనే భాగస్వామి పట్ల శృంగార భావన కలుగుతుందని చెబుతారు. అయితే తాగేసి శృంగారం చేయడం వల్ల ఉన్న లాభాలు, నష్టాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
తాగిన ఆడవారిలో కనిపించే లైంగిక ప్రభావాలు
లైంగిక కోరికను పెంచుతుంది, కానీ..:
ఒకటి లేదా రెండు పెగ్గులు తాగడం వల్ల ఉద్రేకం పెరుగుతుంది. అయితే కచ్చితంగా పెరుగుతుందని చెప్పలేం. మద్యం సేవించడం వల్ల ,ఆడవారిలో టెస్టోస్టెరాన్ స్థాయిలు పెరుగుతాయి. ఇది మగ సెక్స్ హార్మోన్ లైంగిక కోరికలో కీలక పాత్ర పోషిస్తుంది. మద్యం తాగిన మహిళల్లో సెక్స్ పట్ల కోరికలు రావడానికి ఇదే కారణం.
స్త్రీల లిబిడో, ఉద్రేకాన్ని ప్రభావితం చేస్తుంది. అధిక మోతాదులో ఆల్కహాల్ తీసుకోవడం వల్ల లైంగిక ప్రేరేపణలు కనిపించవని పలు అధ్యయనాల్లో తేలింది.
లైంగిక ప్రేరేపణ పెరుగుతుంది, అయితే..:
కొంత మంది స్త్రీలు మద్యం తీసుకుంటే వారిలో సెక్స్ పట్ల కోరికలు పెరగవచ్చు. దీనర్థం వారు శృంగారాన్ని బాగా ఎంజాయ్ చేస్తారని కాదు. మద్యపానం వల్ల జననేంద్రియ ప్రతిస్పందన తగ్గుతుంది. శారీరకంగా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.
ఒక స్థాయి వరకు ఆల్కహాల్ తీసుకోవడం వల్ల లైంగిక ప్రేరేపణ ఉంటుంది. ఆ స్థాయి దాటి ఎంత ఎక్కువగా తాగితే, జననేంద్రియ ప్రతిస్పందన, శారీరక ఉద్రేకం అంత అధ్వాన్నంగా ఉంటాయి.
భావప్రాప్తి రావడం కష్టం:
ఒకటీ రెండూ పెగ్గుల వల్ల పెద్దగా ప్రభావం ఉండదు. అయితే కొంత మత్తుతో ఉంటే శృంగారాన్ని ఎక్కువ సేపు చేయవచ్చు. క్లైమాక్స్ కు రావడానికి సమయం పడుతుంది. ఉద్రేకం పెరుగుతుంది కానీ అది భావప్రాప్తిని ఆలస్యం చేస్తుంది. ఎక్కువ సేపు శృంగారం చేయాలనుకునే వారికి ఇది బాగుంటుంది.
తాగిన మగవారిలో కనిపించే లైంగిక ప్రభావాలు
అంగస్తంభన కష్టమవుతుంది:
ఆల్కహాల్ తీసుకోవడం వల్ల జననేంద్రియాలకు రక్త ప్రసరణపై ప్రభావం పడుతుంది. దీని వల్ల అంగస్తంభన కొద్దిగా కష్టంగా ఉంటుంది. రెగ్యులర్ గా ఎక్కువగా తాగే వారిలో అంగస్తంభన లోపం తలెత్తుతుంది. అంగస్తంభనను కల్పించే యాంజియోటెన్సిన్ హార్మోన్ ను పెంచుతుంది.
స్ఖలనం ఆలస్యమవుతుంది:
ఒకటీ రెండు పెగ్గులతో పెద్దగా ప్రభావం ఏమీ ఉండదు. అయితే అతిగా తాగితే మాత్రం అది స్ఖలనంపై ప్రభావం చూపిస్తుంది. మద్యపానం స్ఖలనాన్ని ఆలస్యం చేస్తుంది. ఉద్రేకం రావడానికి, లైంగిక ప్రేరణతో స్ఖలనం కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. కొందరిలో స్ఖలనం జరగకపోవచ్చు.
రొమాంటిక్ గా మారుస్తుంది, అయితే..:
కొద్దిగా మత్తు ఆడవారితో పాటు మగవారిని రొమాంటిక్ గా మారుస్తుంది. కొంత మొత్తంలో తాగడం వల్ల లైంగిక కోరిక, ఉద్రేకం పెరుగుతుంది. అయితే మోతాదు ఎక్కువ అయితే శృంగారంపై ఆలోచనలు కూడా రావు.
Disclaimer: ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications