Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
నిజమైన ప్రేమను ఎలా గుర్తించాలి.. ఇలా ప్రవర్తిస్తే మీ లవర్ మిమ్మల్ని మోసం చేస్తున్నట్లే!
ప్రస్తుత కాలంలో ప్రేమ, క్రష్, డేటింగ్ అనేవి సర్వసాధారణంగా మారిపోయాయి. కొందరు కొద్దికాలం తోడు కోసం ప్రేమ పేరుతో కొంతమందికి దగ్గరవుతున్నారు. మరికొందరు ప్రేమిస్తున్నామనే అపోహలో ఇతర వ్యక్తులతో జీవించేస్తున్నారు. అమ్మాయి లేదా అబ్బాయి అందానికి ఆకర్షితులవడం, వారి డబ్బుకు ఆకర్షితువడం జరుగుతుంటాయి. దానినే ప్రేమ అని అనుకుంటున్నారు. కొద్దీ కాలం తరువాత అది ప్రేమ కాదని తెలిశాక.. బాధ, దుఃఖంతో కుంగిపోతున్నారు. అయితే నిజమైన ప్రేమను ఎలా గుర్తించాలి? క్రష్‌ను ఎలా గుర్తించాలి? నిజమైన ప్రేమికుల్లో ఎలాంటి లక్షణాలు ఉంటాయి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఆసక్తి తగ్గిపోవడం..
క్రష్ అనేది ఒక ఆకర్షణ మాత్రమే. ఒక వ్యక్తి అందం, అభినయం, డబ్బును చూసి ఏర్పడుతుంది. ఇది కొద్దీ కాలం మాత్రమే ఉంటుంది. ఒకవేళ మీకు కూడా కొద్దీ కాలం తరువాత ఒక వ్యక్తిపై ఆసక్తి తగ్గిపోయి వేరొక వ్యక్తి వైపు ఆకర్షణ పెరిగితే అది ఆకర్షణ అని గుర్తుంచుకోవాలి. నిజమైన ప్రేమలో ఎలాంటి ఆకర్షణలు ఉండదు. డబ్బు, స్టైల్, లుక్స్ అంటూ ఏదీ ఉండదు. ప్రతి కష్టంలోనూ ఒకరి కోసం మరొకరు నిలబడతారు.

వేరే వ్యక్తుల గురించి ఆలోచించడం..
నిజమైన ప్రేమ ఉన్న వ్యక్తులు.. వేరే వ్యక్తుల వైపు ద్రుష్టి మరలడం, వేరే వ్యక్తుల గురించి ఆలోచించడం వంటివి చేయరు. ప్రతిక్షణం తాను ప్రేమిస్తున్న వ్యక్తిని కలవాలనే ఉంటుంది. ఆ వ్యక్తితో మాట్లాడాలని అనిపిస్తుంటుంది. ప్రతి క్షణం ఆ వ్యక్తితోనే జీవించాలని ఉంటుంది. కానీ ఆకర్షణలో అలా ఉండదు. వేరే విషయాలు లేదా వ్యక్తుల గురించి ఆలోచనలు రావడం, వారి గురించి ఆలోచించడం వంటివి జరుగుతుంటాయి.
దూరంలోనూ చెరువే!
ఒకరి క్రష్ ఉన్నప్పుడు సాధారణంగా ఆ వ్యక్తి నుంచి దూరం వెళ్ళినప్పుడు అతనిపై ప్రేమ అనేది తగ్గిపోతుంటుంది. ఇతర విషయాల వైపు ద్రుష్టి కలుగుతుంది. కానీ నిజమైన ప్రేమలో అలా ఉండదు. ప్రేమిస్తున్న వ్యక్తి నుంచి ఎంత దూరం వెళ్లినా, దూరంగా ఎంతకాలం జీవించినా ప్రేమ ఆ వ్యక్తిపైనే ఉంటుంది. అతనితోనే జీవించాలనే కోరిక పెరుగుతుంది. ఎల్లప్పుడూ ఆ వ్యక్తికి సంబంధించిన ఆలోచలనలే వస్తాయి. ఎప్పుడెప్పుడు కలుస్తామన్న కోరిక ఉంటుంది. నిజమైన ప్రేమలో ఉన్న వ్యక్తులకు ఆ మైండ్ సెట్ తప్పా వేరొకటి ఉండదు.
ఆలోచనలు మారవు..
ప్రేమలో ఉన్న వ్యక్తుల ఆలోచనలు ఎప్పుడూ ఒకేలా ఉంటాయి. ఎల్లప్పుడూ తాము ప్రేమిస్తున్న వ్యక్తితో ఎలా జీవించాలి? తమ భవిష్యత్తు ఎలా ఉండాలి? తమ భవిష్యత్తు బాగుండాలంటే ఏం చేయాలి? డబ్బు ఉన్నా లేకున్నా ఎలా జీవించాలి అనే ఆలోచనలే వస్తుంటాయి. కానీ కేవలం ఆకర్షణ ఉన్న వ్యక్తులకు మాత్రం అలా ఉండదు. వారి ఆలోచనలు కాలానికనుగుణంగా మారుతుంటాయి. తమకు కావాల్సిన దానికోసం వేరే వ్యక్తులతో కూడా సంబంధాలు ఏర్పరచుకుంటారు. ఆలోచనలు అభిప్రాయాలను మార్చుకుంటుంటారు.
లోపాలను ఎత్తి చూపరు..
ఎవరితోనైనా క్రష్‌లో ఉన్నప్పుడు ఇతర వ్యక్తిలోని లోపాలు కనిపించవు. వారు మనకు సరైన వ్యక్తి అనే భావన కలిగి ఉంటారు. రాను రాను నిజం తెలిసినప్పుడు లోపాలను ఎత్తి చూపుతారు. ప్రతి విషయంలో లోపాలను ఎత్తి చూపి ఇతర వ్యక్తులను నిర్లక్ష్యం చేస్తారు. కానీ నిజమైన ప్రేమలో ఉన్న వ్యక్తికి అలా ఉండదు. తాను ప్రేమిస్తున్న వ్యక్తిలో ఎలాంటి లోపాలు ఉన్నా వాటిని మనస్ఫూర్తిగా అంగీకరిస్తారు. వారి పరిస్థితులను అర్ధం చేసుకుంటారు. కష్ట కాలంలో కూడా వారిని ఆదుకునేందుకు ముందుకు వస్తారు. కానీ క్రష్ అలా ఉండదు.



Click it and Unblock the Notifications