Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
వానాకాలంలో రగిలే శృంగార కోరికలు..సైన్స్,సైకాలజీ చెప్పే నిజాలివే
వానాకాలంలో సాధారణంగా శృంగార కోరికలు కొంచెం ఎక్కువగానే ఉంటాయి. వర్షాకాలంలో పెళ్లి చేసుకున్నోళ్లు అదృష్టవంతులు అని బ్యాచిలర్స్ సరదాగా జోక్స్ కూడా వేసుకుంటారు. ఒకపక్క చల్లని చినుకులు, మట్టి నుండి వచ్చే సువాసన చల్లని గాలి ఈ వాతావరణం కేవలం మనసుకు ఆహ్లాదాన్నే కాకుండా హృదయంలో తెలియని ఓ మధురమైన భావనకు ప్రాణం పోస్తుంది. వర్షం పడే సమయంలో మనకు ఇష్టమైన వాళ్లు పక్కన ఉండే బాగుండు అని అనిపిస్తుంది. దూరంగా ఉన్న భాగస్వామి జ్ఞాపకాలు ముసురుకుంటాయి. అయితే అసలు వర్షాకాలానికి, ప్రేమకు లేదా శృంగారానికి మధ్య ఉన్న ఈ విడదీయరాని బంధానికి కారణమేంటి? కేవలం వాతావరణమేనా లేక దీని వెనుక బలమైన శాస్త్రీయ, మానసిక కారణాలు కూడా ఉన్నాయా వంటి ఇంట్రెస్టింగ్ విషయాలను ఇక్కడ చూడండి.
ప్రేమ వెనుక సైన్స్, సైకాలజీ
వర్షపు చినుకులు మనల్ని తాకినప్పుడు..మన శరీరంలో ఆక్సిటోసిన్ (ప్రేమ హార్మోన్), డోపమైన్ (ఆనందాన్ని ఇచ్చే హార్మోన్) వంటివి ఎక్కువగా విడుదలవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ హార్మోన్లు మనసును తేలికపరిచి, భావోద్వేగ బంధాలను అద్భుతంగా బలపరుస్తాయి. అంతేకాకుండా వర్షాకాలంలో ఎక్కువ సమయం ఇంటికే పరిమితం అవ్వడం వల్ల కలిగే ఒంటరితనం, ఒక తోడు కావాలనే కోరికను బలంగా రేకెత్తిస్తుంది. మనసులోని ఈ భావనే ప్రేమకు తొలిమెట్టు అవుతుంది.

సినిమాల ప్రభావం
సినిమాల ప్రభావం కూడా దీనికి ఒక ప్రధాన కారణంగా చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదే. ఎన్నో అద్భుతమైన పాటలు, శృంగారభరితమైన సన్నివేశాలు వర్షం నేపథ్యంలోనే చిత్రీకరించారు. ఈ దృశ్యాలు ప్రేక్షకుల మనసులో బలంగా నాటుకుపోయి, నిజ జీవితంలోనూ ప్రేమను వ్యక్తపరచడానికి వర్షాన్ని ఒక అందమైన సాకుగా మార్చేశాయి.
కలిసి పంచుకునే మధుర క్షణాలు
వర్షం పడుతున్న టైంలో ఒకే గొడుగు కింద నడుస్తూ వేడి వేడి ఛాయ్ తాగుతూ కబుర్లు చెప్పుకోవడం, సరదాగా వర్షంలో తడవడం వంటి చిన్న చిన్న క్షణాలు జంటల మధ్య సాన్నిహిత్యాన్ని, అనుబంధాన్ని పెంచుతాయి. జీవితంలోని హడావిడి తగ్గి ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకోవడానికి వర్షాకాలం ఒక చక్కని అవకాశం ఇస్తుంది. ఈ నిదానమైన, ప్రశాంతమైన క్షణాలే లోతైన బంధాలకు దారితీస్తాయి.
కాబట్టి వర్షాకాలంలో ప్రేమ పెరగడం అనేది కేవలం యాదృచ్ఛికం కాదు. దాని వెనుక శాస్త్రం, మనస్తత్వం, సంస్కృతి, కలిసి గడిపే మధురమైన సమయం వంటి ఎన్నో కారణాలు దాగి ఉన్నాయి.
ఇన్ఫెక్షన్లు వస్తాయి
ఈ శృంగారభరితమైన కాలంలోనే ఆరోగ్యం పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలని ఆయుర్వేదం హెచ్చరిస్తుంది. వానాకాలంలో సూర్యరశ్మి తక్కువగా ఉండటం వల్ల సహజంగానే మనలోని ఎనర్జీ, రోగనిరోధక శక్తి తగ్గుముఖం పడతాయి. ఈ సమయంలో అధికంగా శృంగారంలో పాల్గొనడం వల్ల శక్తి మరింత క్షీణిస్తుంది. ఇది శరీరాన్ని మరింత బలహీనపరిచి, అనారోగ్యాల బారిన పడేలా చేస్తుంది. వర్షాకాలంలో తేమ కారణంగా బ్యాక్టీరియా, ఫంగస్ వేగంగా వృద్ధి చెందుతాయి. వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోతే లైంగిక కలయిక ద్వారా ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మహిళల్లో యూటీఐ (UTI), ఫంగల్ ఇన్ఫెక్షన్ల వంటి సమస్యలు తలెత్తవచ్చు.



Click it and Unblock the Notifications