Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
చిరంజీవి గురించి రామ్ చరణ్ సంచలన వ్యాఖ్యలు.. అందరిలానే అరవింద్‌తోనే అంటూ..!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ సీజన్-4 షోలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ప్రోమోను ఆహ విడుదల చేసింది కూడా. రామ్ చరణ్‌తో పాటు శర్వానంద్, నిర్మాత విక్రమ్ కూడా ఈ షోలో పాల్గొని సందడి చేశారు. యూట్యూబ్‌లో ప్రస్తుతం ట్రెండింగ్‌లో కొనసాగుతుంది. ఈ ప్రోమోలో రామ్ చరణ్ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. అందులో తన తండ్రి, నిర్మాత అల్లు అరవింద్ గురించి కూడా ఉంది. అసలు రామ్ చరణ్ ఏం చెప్పారు? ఎలాంటి వ్యాఖ్యలు చేశారు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
అల్లు అరవింద్‌తో వెళ్తానని..
ఈ ప్రోమోలో బాలకృష్ణ ఒక ఆసక్తికరమైన ప్రశ్నను సంధించారు. చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ ఫోటోలను షేర్ చేసి.. ఈ ముగ్గురిలో ఎవరితో పార్టీకి వెళ్తావని రామ్ చరణ్‌ను అడుగుతారు. దానికి రామ్ చరణ్ చెప్పిన సమాధానానికి అక్కడ ఉన్న వారితో పాటు ఆ ప్రోమో చూసిన వ్యక్తులు కూడా షాక్ అయ్యారు. బాలకృష్ణ అడిగిన దానిలో అసలు లేని పేరును రామ్ చరణ్ తెరపైకి తెచ్చారు. అదే అల్లు అరవింద్.

తాను చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబుతో కాకుండా తన మామ అల్లు అరవింద్‌తో పార్టీకి వెళ్తానని పేర్కొన్నారు. అల్లు అరవింద్‌తో వెళ్లేందుకు తాను ఇష్టపడతానని, ఆయనతోనే తనకు పార్టీ చేసుకోవడం ఇష్టమని తెలిపారు. ఈ వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మెగా అభిమానులతో పాటు అల్లు అభిమానులు కూడా ఈ వార్తలు విని కుష్ అవుతున్నారు.
అందరిలాగానే రామ్ చరణ్ కూడా..
మనలో చాలా మంది తండ్రి కంటే ఎక్కువగా మామను ఇష్టపడుతుంటారు. మావయ్యతోనే ప్రతీది షేర్ చేసుకోవడానికి ఇష్టపడుతుంటారు. పైగా మావయ్యతోనే ఎక్కడికైనా వెళ్ళడానికి ఇష్టపడుతుంటారు. ప్రతి వ్యక్తి ఇదే చేస్తారు. రామ్ చరణ్ కూడా మనలో ఒకరే అని ఆయన ఈరోజు చేసిన వ్యాఖ్యలతో అర్థమైపోతుంది. దీనికి కొన్ని కారణాలు కూడా ఉంటాయి. తండ్రి కంటే మావయ్య ఎక్కువగా ఫ్రీడమ్ ఇవ్వడం కూడా దీనికి కారణం అవ్వొచ్చు. దీంతో పాటు మావయ్య ప్రతి విషయాన్ని పాజిటివ్‌గా తీసుకుంటారు. అలాగే సమస్యను పరిష్కరించుకునేందుకు సహాయపడతారు. అందుకే ప్రతి ఒక్కరూ తండ్రికంటే మావయ్యతోనే ప్రతీది పంచుకోవడానికి ఇష్టపడుతారు. అలాగే రామ్ చరణ్ కూడా.



Click it and Unblock the Notifications