Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
Ratha Saptami Wishes in Telugu: రథసప్తమి శుభాకాంక్షలను ఈ విధంగా తెలుగులో అందంగా చెప్పేయండి
రేపు రథ సప్తమి. ప్రత్యక్ష దేవుడైన సూర్యుడిని ఈరోజున దేశంలోని ప్రతి ప్రాంతంలో పూజిస్తారు. ఈరోజున సూర్యుడికి ప్రత్యేకమైన పూజలు చేయడం ద్వారా ఆయన అనుగ్రహం మనపై కలుగుతుందని నమ్ముతారు. ప్రతి ఏడాది మకర సంక్రాంతి తరువాత వచ్చే ఈ పండగ రోజున సూర్యుడిని పూజించి దాన ధర్మాలు, నది స్నానాలు చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయని, సూర్య దేవుడి కరుణాకటాక్షాలు మనపై ఉంటాయని చెబుతుంటారు. అంతటి ప్రవిత్రమైన రోజున మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు ఈ విధంగా, అర్ధవంతంగా శుభాకాంక్షలను తెలుగులో చెప్పుకోవచ్చు.
రథ సప్తమి శుభాకాంక్షలు తెలుగులో
ప్రత్యక్ష దేవుడైన సూర్యుడి ఆశీస్సులతో.. మీరు, మీ కుటుంబ సభ్యులు రథసప్తమి పర్వదినం సందర్భంగా అన్ని శుభకరమైన మార్పులు అనుభవించాలని, మీ జీవితంలో శాంతి, ఆనందం, ఆరోగ్యం, సంపద సమృద్ధిగా లభించాలని కోరుకుంటున్నాను. రథ సప్తమి శుభాకాంక్షలు మిత్రమా

ఈ పవిత్ర రోజున సూర్యభగవానుడిని ఆరాధించడం వలన మీకు శక్తి, ధైర్యం, ఆరోగ్యం మరియు సంపద లభించాలనే ఆకాంక్షిస్తున్నాను. మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు రథసప్తమి శుభాకాంక్షలు.
"యదా జన్మకృతం పాపం మయాజన్మసు జన్మసు
తన్మీరోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమీ"
ఈ శ్లోకం ద్వారా మీరు మీ పాపాలను తొలగించుకొని.. మీ శరీరంతో పాటు మనస్సు కూడా ఆధ్యాత్మిక శాంతి పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రథసప్తమి శుభాకాంక్షలు.
సూర్య భగవానుడు కృప, అనుగ్రహం, కరుణా కటాక్షాలతో మీరు ఎల్లప్పుడూ నవ్వుతూ, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రథ సప్తమి శుభాకాంక్షలు
ఈ రోజు మీ పాపాలు, బాధలు మరియు శోకాలు అన్ని తొలగిపోవాలని, పుణ్యఫలితాలతో మీరు జ్ఞానం, శాంతి, ఆరోగ్యం మరియు సంపదను పొందాలని కోరుకుంటూ, మీకు మరియు మీ కుటుంబానికి రథసప్తమి శుభాకాంక్షలు.
ఈ రోజు సూర్యుని పూజ చేసి, దైవభక్తితో, మీరు అనుకున్న లక్ష్యాలను సాధించాలని, మీరు కోరుకున్న సంతోషాన్ని అందుకోవాలని దైవాన్ని ప్రార్థిస్తున్నాను.
రథసప్తమి పర్వదినం, ఈ పవిత్ర రోజు మీరు ఎంతో శుభకరమైన అనుభూతులను పొందాలని, సూర్యుని ఆశీర్వాదం తో మీ జీవితంలో వెలుగులు, ఆరోగ్యం, ఆనందం మరియు సమృద్ధి తగిలాలని ప్రార్థిస్తూ, మీకు, మీ కుటుంబానికి రథసప్తమి శుభాకాంక్షలు.
సూర్య భగవానుడివలె మీ జీవితం కూడా ఎల్లప్పుడూ ప్రకాశిస్తూ ఉండాలని, మీ జీవితంలో సూర్య భగవానుడు సుఖ సంతోషాలను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రథసప్తమి శుభాకాంక్షలు మిత్రమా!



Click it and Unblock the Notifications
