Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
రియల్ లవ్వా.. లేక ఫేక్ లవ్వా.. ఇలా పట్టేయాలి..!!
ఈ కాలంలో నూటికి 99 శాతం మంది ఎవరో ఒకరితో ప్రేమలో పడుతూనే వున్నారు. అలా ప్రేమించిన 100 మందిలో 90 మంది ప్రేమ బ్రేకప్ అయి దాన్ని మరిచిపోలేక జీవితాంతం బాధపడుతూనే వుంటారు. ఈ ప్రేమ వల్ల సంతోషంగా వుండేవారికంటే బాధపడేవారే ఎక్కువగా వున్నారు. దానికి కారణం నిజాయితీతో ప్రేమించేవారిని కాకుండా ప్రేమపేరుతో మోసం చేసేవారిని గుడ్డికా నమ్మి ప్రేమించడం. ప్రేమలో మోసపోయేంత వరకు తెలియదు, వారిని కేవలం అవసరాల కోసం మాత్రమే ప్రేమించారని. నిజంగా ప్రేమించే వారికి, ప్రేమను నటించే వారికి మధ్య వున్న తేడాను మనం తెలుసుకుందాం.
నిజమైన ప్రేమలో ఒకరిపై ఒకరికి నమ్మకమనేది వుంటుంది. ఏదీ దాచుకోకుండా వున్నది వున్నట్లు చెప్పేస్తారు. అదే ఫేక్ లవ్‌లో అయితే సీక్రెట్లు, పాస్‌వర్డులు, అనుమానం, గొడవలు వుంటాయ్. నిజాయితీగా ప్రేమిస్తే ఏది చెప్పినా నమ్ముతారు. అబద్దం కూడా ఆడరు. అదే ఫేక్ లవ్‌లో అయితే దేన్ని త్వరగా నమ్మరు. నమ్మకపోగా నువ్వు చెప్పేది నిజమేనన్న గ్యారెంటీ ఏంటని ప్రశ్నిస్తారు.
మిమ్మల్ని స్వచ్ఛంగా ప్రేమించే వారు మీరు చేసే ప్రతీ పనిలో వారు సపోర్ట్‌గా నిలుస్తారు. ఫేక్ లవ్‌లో అయితే మ్యానిపులేట్ చేయడం, తమకు అనుకూలంగా మిమ్మల్ని మార్చుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. మిమ్మల్ని నిజాయితీగా ప్రేమిస్తే మీరు చేసే పనులను పొగుడుతూ, మీకు సపోర్టుగా నిలుస్తుంటారు. మీకూ మీ చుట్టు పక్కల వారికి కూడా పూర్తి గౌరవాన్ని ఇస్తారు. ఫేక్ లవ్‌లో మీకు గౌరవం ఇవ్వకపోగా మీరు తీసుకునే నిర్ణయాలను తప్పుబడుతూ మిమ్మల్ని చిన్న చూపు చూస్తారు.
మిమ్మల్ని నిజంగా ప్రేమించే వారు మీకోసం దేన్నైనా వదులుకోవడానికి సిద్ధపడతారు. అదే ఫేక్ లవ్‌లో అయితే తమకు కావాల్సింది చేయించుకుంటారు. మీకోసం ఎలాంటి త్యాగాన్ని కూడా వారు చేయరు. మిమ్మల్ని నిజాయితీగా ప్రేమించేవారు మీకు పూర్తి స్వేచ్ఛను ఇస్తారు. మీరు చేసే పనులకు పూర్తిగా కట్టుబడి వుంటారు. అదే ఫేక్ లవ్‌లో అయితే మిమ్మల్ని ఎప్పుడూ కంట్రోల్ చేయడానికి, అదుపులో వుంచుకోవడానికే ట్రై చేస్తారు. ప్రతీ దానికి కంప్లైంట్ ఇవ్వడం, ప్రతీ విషయంలో తానే కరెక్ట్ అని వాదించడం, మిమ్మల్ని మీ ఫ్యామిలీ మెంబర్స్‌ను విడదీయాలని చూస్తుంటారు.

మీకూ మీ పార్ట్‌నర్‌కు నిజమైన ప్రేమ వుంటే మీ లైఫ్ సంతోషంగా సాగిపోతూ వుంటుంది. అదే ఫేక్ లవ్‌లో రోజులు గడుస్తున్నా కొద్దీ మీ మధ్య దూరమనేది పెరిగిపోతూనే వుంటుంది. మీ లైఫ్‌పై మీ లవ్‌పై మీకు భయమనేది ఏర్పడుతూ వస్తుంది. నిజమైన లవ్‌లో మీ నుండి ఏదీ ఆశించకుండా మీకు నచ్చింది చేస్తారు. ఫేక్ లవ్‌లో అయితతే మీ నుంచి ప్రతీ సారి ఏదో ఒకటి ఆశిస్తూనే వుంటారు. కావాల్సింది చేయించుకొని, తమ అవసరాల కోసమే ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు.
మిమ్మల్ని నిజాయితీగా ప్రేమించేవారు మీరు బాధపడినప్పుడు ఓదారుస్తారు. ఏదైనా మనస్పర్ధలు వచ్చినప్పుడు నాదే తప్పు క్షమించమని అడుగుతారు. ఫేక్ లవ్‌లో అయితే ప్రతీ దానికీ తానే కరెక్ట్ అని నువ్వే నన్ను హర్ట్ చేశావని అంటారు. కనీసం ఒక్క సారీ అయినా చెప్పలేదని టార్చర్ పెడుతూ వుంటారు.

నిజమైన ప్రేమలో అమ్మాయి అబ్బాయి మధ్య రిలేషన్ అనేది ఒక మంచి రొమాంటిక్ మెలోడీ సాంగ్‌లాగా వుంటుంది. ఫేక్ లవ్‌లో అయితే ప్రతీది కూడా సెక్స్, సెక్స్, సెక్స్ కోసమే చేస్తారు.
గమనిక : పైన రియల్ లవ్ ఫేక్ లవ్ గురించి ఇచ్చిన వివరాలన్నీ ప్రముఖ మానసిక నిపుణులు, ఇంటర్నెట్ నుంచి సేకరించింది. ఇవి వాస్తవానికి దగ్గరగా వుండవచ్చు లేకపోవచ్చు. కాబట్టి వీటిని మేము ఎట్టి పరిస్థితుల్లో దృవీకరించము.



Click it and Unblock the Notifications