Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
స్నేహం ముసుగులో శత్రువులు.. ఈ 5 రకాల ఫ్రెండ్స్ తో చాలా డేంజర్!
ఫ్రెండ్స్ అంటే దేవుడు మనకివ్వడం మర్చిపోయిన తోబుట్టువులు.. మనం ఎంచుకునే కుటుంబం అని పెద్దలు చెబుతుంటారు. ఒక మంచి ఫ్రెండ్ పక్కనుంటే నరకం కూడా స్వర్గంగా మారుతుంది. కానీ, అదే స్నేహితుడు నకిలీ అయితే? వారు గడ్డిలో దాకున్న పాము కంటే ప్రమాదకరం. నకిలీ స్నేహితులు మీ ముఖం మీద నవ్వుతూనే, మీ వెనకాల గోతులు తవ్వగలరు.
చాలా సార్లు మనం భావోద్వేగాలకు లోనై, అనర్హులైన వారిని గుడ్డిగా నమ్మేస్తుంటాం. చివరకు మోసపోయాక బాధపడతాం. కానీ మనస్తత్వశాస్త్రం,జీవిత అనుభవాల సారం ఆధారంగా నిజమైన ఫ్రెండ్ కి, నకిలీ ఫ్రెండ్ కి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించడానికి 5 ఖచ్చితమైన మార్గాలను నిపుణులు సూచించారు. అవేంటో ఇక్కడ చూడండి.

కష్టకాలంలో కవరేజ్ దాటిపోయేవాళ్ళు
నకిలీ ఫ్రెండ్ ప్రధాన లక్షణం వారు సీజనల్ పక్షుల లాంటివారు. మీ జేబులో డబ్బులున్నప్పుడు, మీరు పార్టీలు ఇస్తున్నప్పుడు లేదా సంతోషంగా ఉన్నప్పుడు వారు అందరికంటే ముందు వాలిపోతారు. కానీ మీకు కష్టం వచ్చినప్పుడు, ఆర్థిక ఇబ్బందులు లేదా అనారోగ్యం చుట్టుముట్టినప్పుడు వారు అకస్మాత్తుగా మాయమైపోతారు.
ఆ సమయంలో వారికి ఫోన్ చేస్తే నేను చాలా బిజీగా ఉన్నాను అనో, ఫోన్ సైలెంట్‌లో ఉంది అనో రకరకాల సాకులు చెబుతారు. కష్టంలో తోడుండని వాడు స్నేహితుడు కానే కాడు.
మీ విజయాలను చూసి ఓర్వలేనివారు
ఒక నిజమైన ఫ్రెండ్ మీ గెలుపును తన గెలుపుగా భావిస్తారు. కానీ నకిలీ ఫ్రెండ్ మీ అభివృద్ధిని చూసి లోలోపల అసూయతో రగిలిపోతుంటారు. మీకు ప్రమోషన్ వచ్చినా, ఏదైనా శుభవార్త చెప్పినా వారి ముఖ కవళికలను గమనించండి.
వారు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారా? లేక కేవలం అదృష్టం వల్ల నీకు అది దక్కింది అని వెటకారం చేస్తున్నారా? మీ విజయం పట్ల వారి కళ్ళలో ఆనందం లేకపోతే, వెంటనే జాగ్రత్త పడండి.
వెటకారం పేరుతో విషం చిమ్మేవారు
స్నేహితుల మధ్య సరదాగా ఆటపట్టించడం సహజమే. కానీ నలుగురిలో మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడటం, మీ బలహీనతలను ఎత్తిచూపుతూ అందరి ముందు అవమానించడం నకిలీ స్నేహితుడి లక్షణం. మీరు నొచ్చుకుంటే అబ్బా ఊరికే జోక్ చేశాను, దానికి కూడా సీరియస్ అవుతావా? అని కవర్ చేస్తారు. మీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే వ్యక్తి ఎప్పటికీ మీ శ్రేయోభిలాషి కాలేరు.
మీ రహస్యాలకు రక్షణ లేకపోవడం
మీ ఫ్రెండ్ ఇతరుల రహస్యాలను మీ దగ్గర పూసగుచ్చినట్లు చెబుతున్నాడా? అయితే కచ్చితంగా మీ రహస్యాలను కూడా వేరే వాళ్ళ దగ్గర బయటపెడతాడని అర్థం చేసుకోండి. ఇలాంటి వారికి మీ వ్యక్తిగత విషయాలు చెప్పేముందు ఒకటికి వందసార్లు ఆలోచించుకోండి.
తమ స్వడబ్బా మాత్రమే కొట్టుకునేవారు:
స్నేహంలో సంభాషణ ఎప్పుడూ రెండు వైపులా ఉండాలి. కానీ నకిలీ స్నేహితులు ఎప్పుడూ తమ గురించి మాత్రమే ఆలోచిస్తారు. మీరు మీ సమస్యలు చెప్పుకోవడానికి ప్రయత్నిస్తే, వారు ఆ విషయాన్ని దాటవేసి, తమ సొంత గొప్పలు లేదా తమ కష్టాలను మొదలుపెడతారు. మీ భావాలకు, మీ మాటలకు అక్కడ విలువుండదు. వారికి కావాల్సింది శ్రోతలు మాత్రమే, స్నేహితులు కాదు.



Click it and Unblock the Notifications