For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Relationship: చెడు సంబంధంలో ఉండటం కంటే సింగిల్ గా ఉండటమే బెటరా.. అదెంత నిజం?

|

Relationship: ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో మరో వ్యక్తి ఉంటారు. అది జీవిత భాగస్వామి అయినా లేదా తల్లిదండ్రులు, అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్లు ఇలా ఎవరో ఒకరు తోడుగా ఉంటారు. మంచి, చెడులు షేర్ చేసుకోవడానికి... కష్ట, సుఖాలు పంచుకోవడానికి ప్రతి వ్యక్తి జీవితంలో ఒకరు ఉండాలి అంటారు మనస్తత్వ శాస్త్రవేత్తలు. అయితే ఆ సంబంధం, అనుబంధం ఆహ్లాదంగా, ఆనందంగా ఉండాలనేది విస్మరించలేని నిబంధన. ఎందుకంటే జీవిత భాగస్వామి అని ఒకరు ఉన్న తర్వాత వారి వల్ల మనకు మంచే జరగాలి. చెడు జరిగితే ఆ రిలేషన్ షిప్ కు అర్థం ఉండదు.

Reasons Why Is Being Alone Better Than Being In A Bad Relationship in Telugu

ప్రతి ఒక్కరికి సంబంధాలు ఉన్నంత మాత్రాన ఆనందంగా ఉన్నారని అనుకోవడానికి వీలు లేదు. సంబంధంలో ఉండటం అనేది నిజంగా సంతోషంగా ఉండటమే తప్ప జీవితానికి అంతిమ లక్ష్యం కాకూడదు. ఒక అధ్యయనం ప్రకారం, కౌమార దశలో ఒకరి డేటింగ్ సంబంధాలు భవిష్యత్తులో ప్రభావం చూపుతాయని తేలింది. భాగస్వామ్యాలకు సంబంధించిన వారి వైఖరిని ప్రవర్తనను రూపొందించడంలో... సొంత గుర్తింపు, అభివృద్ధి, ఆత్మగౌరవం వంటి వాటిపై ప్రభావం చూపుతున్నట్లు వెల్లడైంది.

ఒకరు ఒక వ్యక్తితో సంబంధం కొనసాగిస్తున్నట్లైతే.. వారు డేటింగ్ లో ఉన్నట్లైతే కొంత మందిలో కలవరపాటు గమనించవచ్చు. తాము ఏమైన చెడు సంబంధంలో ఉన్నామా అనే భయం వారిలో ఉంటుంది. అలాగని వారు ఆ రిలేషన్ షిప్ ను వదిలి పెట్టలేరు. ఎందుకంటే ఒంటరిగా ఉండటం కూడా వారికి భయమే. కాబట్టి వారు తమ ఆదర్శాలకు అనుగుణంగా జీవించని వారితో కలిసి ఉండటానికి సిద్దపడతారు.

ఎవరికి వారు తమ రిలేషన్ షిప్ గురించి సమీక్షించుకోవాలి. అనారోగ్యకరమైన సంబంధంలో ఉన్నట్లు అనిపిస్తే.. దాని గురించి మరో సారి ఆలోచించాల్సిందే. చెడు సంబంధంలో ఉండేకంటే.. ఒంటరిగా ఉండటం మేలు అనేది ఎలా మేలు చేస్తుంది.

1. స్వేచ్ఛ

ఎవరికైనా స్వేచ్ఛ ఉండాల్సిందే. అన్ని సంబంధాల్లోనూ ఈ స్వేచ్ఛకు కొన్ని పరిమితులు ఉంటాయనేది గుర్తుంచుకోవాల్సిన విషయం. అది ఎలాంటి సంబంధం అయినా... దాంపత్య సంబంధం అయినా.. భార్య, భర్తలైనా.. వారి కంటూ సొంత స్వేచ్ఛ, స్వాతంత్రం ఉండాలి. ఈ స్వేచ్ఛ లేకుండా పోయినప్పుడే సమస్య తలెత్తుతుంది. ఇలాంటి సంబంధం ఉండటం కంటే కూడా ఒంటరిగా ఉండటం ఉత్తమం అనిపిస్తుంది. మీరు ఒంటరిగా ఉన్నట్లైతే మరొకరితో సమర్థించుకోవాల్సిన అవసరం ఉండదు. అలాగే.. మీకు నచ్చిన విధంగా ఉండటానికి, నచ్చిన చోటుకు వెళ్లడానికి, అలాగే మీకిష్టమైన వారితో మాట్లాడటానికి స్వేచ్ఛ ఉంటుంది.

2. మీలో ఆనందాన్ని గుర్తించడానికి సాయం చేస్తుంది

ప్రతి ఒక్కరూ గౌరవించబడటానికి, ప్రశంసించబడటానికి అలాగే సంతృప్తి చెందడానికి అర్హులే. ఈ భావాలను అందించలేని సంబంధంలో ఉంటే దాని నుండి బయట పడాల్సిన సమయం వచ్చిందని గ్రహించాలి. ఆ జోన్ నుండి బయటకు వచ్చి... ఎవరిపైనా ఆధారపడకుండా.. మీకు మీరుగా మీ ఆనందాన్ని కనుక్కోవాలి. ఒంటరిగా ఉండటం వల్ల మీ లక్ష్యాలను తిరిగి అంచనా వేయడానికి వీలు కలుగుతుంది. మీకు ఆనందాన్ని ఇచ్చే పనులు కొనసాగించడానికి సమయం లభిస్తుంది. మీరు ఎవరు అనే ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. మిమ్మల్ని సంతోషపరిచే వాటి గురించి మరింత తెలుసుకోవడానికి తగినన్ని అవకాశాలు ఉంటాయి.

Reasons Why Is Being Alone Better Than Being In A Bad Relationship in Telugu

3. కోల్పోయిన ఆత్మగౌరవాన్ని తిరిగి పొందవచ్చు

నేను ఎవరికీ సరిపోనూ లేదా నేను జీవితంలో మంచి వ్యక్తిని పొందేందుకు అర్హుడిని కాదు అనేవి ఆత్మన్యూనత భావాలు. ఇవి అనారోగ్య సంబంధాన్ని నిర్వర్తిస్తాయి. ఇలా అనుకోవడానికి కారణాలు ఉన్నాయి. మీ ఆత్మగౌరవాన్ని ఎవరైనా దెబ్బతీయడం వల్ల ఇలా అనుకునే అవకాశాలు ఉన్నాయి. ఒకరితో బంధంలో కొనసాగుతున్నారంటే.. కచ్చితంగా ఈ భావాలు ఉండవు. కాబట్టి మిమ్మల్ని మీరు గౌరవించుకోవాల్సిన సమయం వచ్చిందని నమ్మాలి. అందుకోసం బ్యాడ్ రిలేషన్ షిప్ ను వదులుకోవడమే ఉత్తమం. ఇది మిమ్మల్ని స్వార్థపూరిత వ్యక్తులుగా కనిపించేలా చేసినప్పటికీ.. ఇది మీకు మంచి చేసేదే.

4. పట్టించుకోకపోవడం

ప్రారంభంలో ఏ రిలేషన్ షిప్ అయినా చాలా పర్ఫెక్ట్‌గా ఉన్నట్లు అనిపిస్తుంది. అయితే కొందరిలో మెల్లిమెల్లిగా మార్పు కన్పిస్తుంది. అది ఎలాంటి మార్పు అంటే భాగస్వామిని పెద్దగా పట్టించుకోకపోవడం, లేదా వారికి గౌరవం ఇవ్వకపోవడం. కొంత మంది తమ జీవిత భాగస్వామికి అత్యంత విలువ ఇస్తారు.. గౌరవిస్తారు. అలాంటి వారి జీవితాల్లో ఎలాంటి సమస్య ఉండదు. కానీ గౌరవం ఇవ్వని వ్యక్తులతో ఉండటం కంటే, నిర్లక్ష్యం చేసే వారితో జీవితం పంచుకునే కంటే.. ఒంటరిగా ఉండటం అత్యుత్తమం. అప్పటి వరకు రిలేషన్ షిప్ లో ఉండి, ఒంటరిగా మారితే మొదట్లో మంచి అనుభూతి కలగదు. కానీ దాని ఫలాలు దీర్ఘకాలంలో కనిపిస్తాయి.

5. మనశ్శాంతి పొందడం

ఏ సంబంధంలోనైనా హెచ్చు తగ్గులు ఉంటాయి. మీకు అలాగే మీ భాగస్వామికి మధ్య తగాదాలు అవుతాయి. కానీ అవి జీవితంపై, సంతోషంపై ఎలాంటి ప్రభావం చూపకూడదు. రెండు వేర్వేరు మనస్తత్వాలు ఉన్న వారు ఒక చోట ఉంటే ఏదో ఒక విషయంలో వాదనలు తప్పవు. అది మానవ నైజం. కానీ... జీవితం అంతా అలాగే వాదనలు, తగాదాలు ఉంటే మాత్రం అలాంటి రిలేషన్ షిప్ ను వదులుకోవడం ఉత్తమం. దగ్గరగా ఉండి ఎప్పుడూ గొడవలు పడే కంటే.. దూరంగా ఉండి మనశ్శాంతిగా ఉండటం మంచిది.

English summary

Reasons Why Is Being Alone Better Than Being In A Bad Relationship in Telugu

Read on to know the why is being alone sometimes better than being in a bad relationship what are the reasons.
Story first published:Thursday, July 14, 2022, 12:09 [IST]
Desktop Bottom Promotion