Latest Updates
-
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా..
Relationship Tips: పురుషులకు సెక్స్‌పై ఇంట్రెస్ట్ పోవడానికి కారణాలేంటో తెలుసా?
సెక్స్ అంటే పురుషులకు సంబంధించిన అంశంగా చూస్తారు చాలా మంది మహిళలు. కేవలం పురుషులకు మాత్రమే కోరికలు ఉంటాయని, వాళ్లే కామంతో రగిలిపోతుంటారని, ఏ స్త్రీని చూసినా వారికి శృంగార కోరికలు పుడతాయని అనుకుంటారు చాలా మంది.
అయితే పురుషులు కూడా కొన్నిసార్లు శృంగారంపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపించారు. భార్య లేదా ప్రేయసి దగ్గరికి వచ్చినా దూరం జరుగుతుంటారు. చేయి వేసినా తీసేస్తుంటారు. మగవాళ్లు శృంగారంపై ఇంట్రెస్ట్ చూపించకపోవడానికి చాలా కారణాలే ఉంటాయి. వాటి వల్లే సెక్స్‌కు దూరంగా ఉంటారు. ఆ కారణాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆసక్తి, ఆకర్షణ లేకపోవడం:
పురుషులు సెక్స్‌కు నో చెప్పడానికి అత్యంత సాధారణ కారణం భార్య లేదా ప్రేయసిపై ఆసక్తి లేదా ఆకర్షణ లేకపోవడం. పురుషులు తమ భాగస్వామి పట్ల శారీరక, మానసిక, భావోద్వేగ ఆకర్షణ లేకపోతే శృంగార కోరికలు రావు. కోరికలే రానప్పుడు సెక్స్ చేయాలన్న ఉద్దేశం కూడా ఉండదు. అయితే భాగస్వామి పట్ల శృంగార కోరికలు కేవలం ఎదుటివారి అందం వల్లే రాలేవనుకుంటే పొరబడినట్లే.
సరైన పోషకాహారం, వ్యాయామం చేయకోపోవడం, శారీరక శ్రమ లేకపోవడం లాంటి కారణాల వల్ల కూడా కోరికలు రావంటున్నారు వైద్యులు. పురుషులు శృంగార హార్మోన్ గా పిలిచే టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ వల్లే కోరికలు వస్తాయి. ఈ హార్మోన్ వ్యాయామం చేసినప్పుడు, ఉదయం నిద్ర నుండి లేచినప్పుడు, సరైన పోషకాలు తీసుకుంటే ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది.
అలసట లేదా ఒత్తిడి:
అలసట, పని ఒత్తిడి వల్ల కూడా పురుషులు శృంగారంపై ఇంట్రెస్ట్ చూపించరు. పని, కుటుంబ బాధ్యతలు లేదా ఇతర ఒత్తిళ్ల కారణంగా పురుషులు శారీరక లేదా భావోద్వేగ అలసటను కలిగి ఉంటారు. ఇది వారి లిబిడోను ప్రభావితం చేస్తుంది. వారికి సెక్స్ పట్ల తక్కువ ఆసక్తిని కలిగిస్తుంది. ఇది అధిక ఒత్తిడితో కూడిన ఉద్యోగం వల్ల కూడా కావొచ్చు.
రిలేషన్‌షిప్ ఇష్యూస్:
మానసికంగా కనెక్ట్ కాకపోయిన సమయంలో కూడా శృంగారానికి దూరంగా ఉండొచ్చు. సంబంధంలో పరిష్కారం కాని వైరుధ్యాలు లేదా సమస్యలను ఎదుర్కొంటారు. ఇది వారికి సెక్స్ పట్ల తక్కువ ఆసక్తిని కలిగిస్తుంది. సంబంధ సమస్యలు నమ్మకం లేదా కమ్యూనికేషన్ లేకపోవడం నుండి ఆర్థిక లేదా సంతాన శైలుల గురించి విభేదాల వరకు ఉండొచ్చు.
ఆరోగ్య సమస్యలు:
కొన్ని ఆరోగ్య పరిస్థితులు లేదా మందులు లైంగిక కోరికలపై ప్రభావం చూపవచ్చు. డిప్రెషన్ లేదా యాంగ్జైటీతో బాధపడుతున్న పురుషులు వారు తీసుకుంటున్న మందుల కారణంగా లిబిడో తగ్గిపోవచ్చు. అంగస్తంభన లేదా అకాల స్ఖలనం వంటి శారీరక ఆరోగ్య సమస్యలతో బాధపడుతుందే, వారు ఇబ్బంది పడవచ్చు లేదా సిగ్గుపడవచ్చు. ఫలితంగా లైంగిక కార్యకలాపాలకు దూరంగా ఉండొచ్చు.
గత అనుభవాలు, గతంలో ఎదురైన లైంగిక సమస్యలు, భయాల వల్ల కూడా శృంగారానికి దూరంగా ఉంటారు కొంత మంది పురుషులు. కొంత మంది నమ్మకాల వల్ల కూడా సెక్స్ పై ఆసక్తి చూపించరు. ఇంకేదైనా కారణం వల్ల పురుషులు శృంగారానికి దూరంగా ఉండటం వల్ల సంబంధంలో సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. దీని వల్ల ఇబ్బంది పడుతుంటే వారిని వైద్యుల వద్దకు తీసుకెళ్లి సమస్య ఏమిటో కనుక్కుని దానిని పరిష్కరించేందుకు ప్రయత్నించడం మంచిది.



Click it and Unblock the Notifications