Latest Updates
-
వాతావరణ మార్పులతో మోకాళ్ల నొప్పుల బాధలు.. ఉపశమనం కోసం ఇంట్లోనే ఇలా చేయండి.! -
తిరోగమనం నుంచి బయటపడ్డ బుధ గ్రహం.. ఇక ఈ రాశుల వారి దశ తిరిగినట్లే.! -
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.!
ఇలా చేయకపోవడం వల్లే జంటల మధ్య గొడవలు, తేల్చి చెప్పిన స్టడీ
సంబంధంలో గొడవలు సర్వసాధారణం. గొడవలు, కొట్లాటలు లేని బంధం ఉండదు. అయితే తరచూ గొడవ పడటం వల్ల బంధంలో చీలికలు వస్తాయి. మీరు ఎందుకు ఆలస్యం చేశారు? ఈ ఉదయం "నేను నిన్ను ప్రేమిస్తున్నాను" అని ఎందుకు చెప్పలేదు? లాంటివి అలాగే కొన్ని కొన్ని పెద్దవి కూడా ఉంటాయి. అలాంటి వాటి వల్ల బంధంలో చీలికలు వస్తాయి. కాబట్టి, వీలైనంత వరకు గొడవలకు దూరంగా ఉండాలని కోరుకోవడం సహజం.

వన్‌పోల్ నిర్వహించిన తాజా అధ్యయనంలో భాగస్వాముల మధ్య గొడవలు, కొట్లాటలు ఎందుకు జరుగుతున్నాయో తెలుసుకునేందుకు ఒక సర్వే చేశారు. చిన్న చిన్న విషయాల నుండి పెద్ద వాటి వరకు ప్రతి ఒక్కదాని గురించి వివరించాలని చెప్పారు. చిన్నపాటి గొడవ, వాదులాట, అసహనం, విచారం, కోపం ఇలాంటి భావోద్వేగాలను రికార్డు చేయమని చెప్పారు. మీ భాగస్వామి ఏయే పనులు చేస్తే మీకు ఎలా అనిపిస్తుందో చెప్పాలని అడిగారు.
వారి సర్వేలో విస్మయకర విషయాలు వెల్లడయ్యాయి. చాలా చిన్న విషయమే కదా అనుకున్నవే దంపతుల మధ్య గొడవకు కారణం అవుతున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మంచం మీద తడి తువ్వాళ్లను ఉంచడం
చాలా మంది భారతీయ వివాహిత జంటల్లో వచ్చే మొట్ట మొదటి అలాగే ఫేమస్ గొడవ.. బెడ్ పై తడి టవల్ వేయడం వల్లే. ఎన్నిసార్లు చెప్పినా.. మళ్లీ మళ్లీ జరిగే, చేసే తప్పు ఇది. బాత్రూము నుండి వచ్చాక.. తడిగా ఉన్న టవల్ ను బెడ్ పై వేయడం వల్ల ఈ గొడవ మొదలు అవుతుంది. ఇందులో ఎక్కువగా భర్తే దోషిగా ఉంటాడని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ, చాలా మంది జంటలు తమ దాంపత్య ప్రయాణం ప్రారంభంలో తడి తువ్వాళ్లతో ఎలా గొడవ పడుతున్నారో తెలుసుకోవడం చాలా సరదాగా ఉంటుంది.

వంటల విషయంలో గొడవ.
వంటకాలు విషయంలో తరచూ భార్య భర్తల మధ్య గొడవ జరుగుతుంది. వంటకాల రుచి విషయంలోనూ, వండే పద్ధతి అంశంలోనూ భార్య, భర్తలు కొట్లాడుకోవడం తరచూ జరిగేదే. అలాగే భార్య చేసే వంటకాలను, తన తల్లి చేసే వంటకాలతో పోల్చడం మరో పెద్ద కారణం.

నా తల్లిదండ్రులంటే నీకు ఇష్టం లేదు కదా?
ఇది అదే పాత కథ మరియు భారతీయ జంటలు కూడా ఇందులో మునిగిపోతారు. వివాహం ఇద్దరు వ్యక్తులను బంధించడమే కాకుండా వారి కుటుంబాన్ని మరింత దగ్గర చేస్తుంది. అందువల్ల వివాహిత జంటలు తమ తల్లిదండ్రుల మాదిరిగానే తమ అత్తమామలను చూస్తారని భావిస్తున్నారు. కానీ దీన్ని చేయడం ఎల్లప్పుడూ సులభం కాదు. కొత్తగా పెళ్లయిన జంటలు తరచుగా తమ అత్తమామలను ఇష్టపడటం లేదా ఇష్టపడకపోవడం గురించి వాదించుకోవడం కనిపిస్తుంది.

బ్రహ్మచారిలా ప్రవర్తించడం మానేస్తారా?
బాయ్స్ విల్ బి బాయ్స్. చాలా మంది భారతీయ మహిళలు భార్యగా వారి కొత్త పాత్రకు త్వరగా మారిపోతారు. కొంతమంది పురుషులు తమ వైవాహిక జీవితానికి సర్దుబాటు చేసుకోవడానికి సమయం తీసుకుంటారు. వారు ఇంతకు ముందు మాదిరిగానే పార్టీలు చేసుకోవాలని అనుకుంటారు. కాబట్టి, అలాంటి బ్రహ్మచారి ప్రవర్తనకు భార్య అభ్యంతరం వ్యక్తం చేసి తన భర్తతో వాదించినప్పుడు ఆశ్చర్యపోనవసరం లేదు.

శ్రమ విభజన
పని విషయంలోనూ జంటల మధ్య గొడవలు జరుగుతాయి. పని షేర్ చేసుకోకపోవడం వల్ల మొత్తం ఒకరే చేయాల్సి వస్తుంది. దాని వల్ల తమకంటూ ప్రత్యేక సమయం లేకుండా పోతుంది. దీని వల్ల భార్యభర్తల మధ్య గొడవలు కామన్ గా జరిగేవే. చాలా ఇళ్లలో ఇంటి పని ఎక్కువగా చేసేది భార్యలే. చాలా కొద్ది మంది భర్తలు మాత్రే ఇంటి పనిలో సాయం చేస్తారు.

ఫోన్, టీవీ వాడకం
పనులతో పాటు, జంటల ఫోన్ మరియు టీవీ వినియోగం కూడా గొడవలకు దారితీస్తుంది. ఎదుటి వారిని పట్టించుకోకుండా ఫోన్ వాడటం. పదే పదే ఫోన్ చూడటం, ఎదుటి వారు చెప్పేది వినిపించుకోకుండా ఫోన్ లోనే కళ్లు పెట్టడం లాంటి కారణాలు గొడవలకు దారితీస్తాయి. అలాగే టీవీలో ఏ సినిమా చూడాలి.. ఏ కార్యక్రమం చూడాలన్న విషయంలోనూ వాదులాట తప్పదు.



Click it and Unblock the Notifications