Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
మందు,సిగరెట్లు,ఎఫైర్లు కాదు..ప్రేమించే ముందు లవర్ కి ఆ అలవాటు ఉందేమో చూసుకోండి..లేకుంటే సర్వనాశనమే!
ప్రేమ అంటే అదొక మధురానుభూతి,మాటల్లో వర్ణించలేని. మనకు ఎవరిమీద ఎప్పుడు ఎక్కడ ప్రేమ పుడుతుందో చెప్పలేం. అయితే ఒక్కసారి ప్రేమలో పడితే ఇంకా అంతా కలర్ ఫుల్ గా కనబడటం మొదలవుతుంది. అయితే ప్రేమ ప్రయాణంలో నమ్మకం, పరస్పర గౌరవం అనేవి రెండు చక్రాల లాంటివి. ఈ రెండూ ఉన్నప్పుడే ప్రేమ అనే బండి సాఫీగా ముందుకు సాగుతుంది. అయితే కొన్నిసార్లు ప్రేమ అనే మత్తులో పడిపోయి, మన భాగస్వామి మనకు సరైనవారా కాదా అనే విషయాన్ని గ్రహించలేం. వారిపై ఉన్న ఇష్టంతో చిన్న చిన్న తప్పులను చూసీచూడనట్లు వదిలేస్తాం.
సంబంధం నిలబడాలనే తాపత్రయంతో మనల్ని మనం సర్దుకుపోతాం. కానీ మీ ఈ మంచితనాన్ని, మీ ప్రేమను అవతలి వారు బలహీనతగా భావిస్తే? మీ భావాలను లైట్ తీసుకుంటే? అలాంటి సంబంధంలో కొనసాగడం మిమ్మల్ని మీరు నాశనం చేసుకోవడమే. అందుకే ఒక బంధంలోకి అడుగుపెట్టిన తొలినాళ్లలోనే కొన్ని కీలక విషయాలను గమనించాలి. మీ భాగస్వామిలో ఈ క్రింది లక్షణాలు కనిపిస్తే ఒక్క క్షణం ఆగి ఆలోచించండి. బంధాన్ని తెంచుకుని ముందుకు సాగడమే మీ భవిష్యత్తుకు శ్రీరామరక్ష.

గతమే వారి వర్తమానం
మీతో సంతోషంగా గడుపుతూ కూడా మీ భాగస్వామి పదేపదే వారి పాత సంబంధం గురించి మాట్లాడుతున్నారా? ప్రతి చిన్న విషయానికి మిమ్మల్ని వారి మాజీ ప్రియుడు/ప్రియురాలితో పోలుస్తున్నారా? అయితే జాగ్రత్త.. దీని అర్థం, వారు ఇంకా గతం నుంచి బయటపడలేదని. వారి గుండెలో ఇంకా పాత గాయాలు, జ్ఞాపకాలు అలాగే ఉన్నాయని తెలుసుకోండి. అలాంటి వ్యక్తితో మీరు ఎంత ప్రేమగా ఉన్నా, మీరు ఎప్పటికీ వారి దృష్టిలో ఒక ప్రత్యామ్నాయంగానే మిగిలిపోతారు. పాత నీడలు వర్తమానాన్ని కమ్మేస్తున్నప్పుడు ఆ బంధానికి భవిష్యత్తు ఉండదు. ఇది మీ ఇద్దరి మధ్య అగాధాన్ని సృష్టిస్తుంది.
మీ భావోద్వేగాలకు విలువివ్వనప్పుడు
సంబంధం అంటే ఇద్దరు వ్యక్తుల మనసుల కలయిక. మీ సంతోషం, బాధ, అవసరాలు మీ భాగస్వామి అర్థం చేసుకోనప్పుడు ఆ బంధానికి అర్థమేముంటుంది? మీరు చెప్పేది వినకుండా మధ్యలోనే ఆపేయడం, మీ ఫీలింగ్స్ ను తేలికగా కొట్టిపారేయడం, మీ అవసరాలను పట్టించుకోకపోవడం వంటివి జరుగుతుంట ఆ వ్యక్తి మీకు సరైనవారు కాదని గ్రహించండి. మీ మాటలకు విలువివ్వని చోట, మీ ఉనికికి గౌరవం లభించదు. భవిష్యత్తులో ఈ అలవాటు మరింత ముదిరి మిమ్మల్ని మానసికంగా కుంగదీస్తుంది.
సంభాషణకు చొరవ ఎప్పుడూ మీదేనా?
ఏ బంధానికైనా కమ్యూనికేషన్ ఆక్సిజన్ లాంటిది. మీ భాగస్వామి మీతో మాట్లాడటానికి ఆసక్తి చూపకపోతే ప్రతిసారీ మీరే సంభాషణను ప్రారంభించాల్సి వస్తే ఆ బంధం ఏకపక్షంగా సాగుతోందని అర్థం. ప్రేమలో చొరవ ఇద్దరి వైపు నుంచీ ఉండాలి. ఒకరే నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటే అది బంధాన్ని మోయడం అవుతుంది కానీ ప్రేమించుకోవడం కాదు. ఈ విషయంపై వారితో ఒక్కసారి స్పష్టంగా మాట్లాడండి. అప్పటికీ వారిలో మార్పు రాకపోతే ఆ బంధాన్ని కొనసాగించాలా వద్దా అని పునరాలోచించుకోండి.
స్వేచ్ఛను హరించే అనుమానం, ఆధిపత్యం
సంబంధం మొదలైన నెల రోజుల్లోనే మీపై ఆధిపత్యం చెలాయించడం మొదలుపెట్టారా? మీ ఫ్రెండ్స్, మీ ఇష్టాయిష్టాలు, మీ బట్టల విషయంలో అనవసరంగా జోక్యం చేసుకుంటున్నారా? అయితే ఇది ప్రమాద హెచ్చరికనే. ప్రేమంటే బంధించడం కాదు, స్వేచ్ఛనివ్వడం. అనవసరమైన అనుమానాలతో మిమ్మల్ని మానసికంగా హింసిస్తుంటే ఆ బంధం మీకు సంతోషాన్నివ్వదు. ప్రతి వ్యక్తికీ వ్యక్తిగత స్వేచ్ఛ, గౌరవం చాలా ముఖ్యం. వాటిని హరించే వ్యక్తితో జీవితాన్ని పంచుకోవడం నరకంతో సమానం. మిమ్మల్ని మీరు గౌరవించుకోని సంబంధంలో ఉండటం కంటే, ఒంటరిగా ధైర్యంగా నిలబడటం ఎంతో మేలు.



Click it and Unblock the Notifications