Latest Updates
-
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.!
మగతనాన్ని నాశనం చేస్తున్న 10 అలవాట్లు..ప్రతి పురుషుడు తెలుసుకోవాల్సిన నిజాలు!
ప్రతి మగాడు తన లైఫ్ లో శక్తివంతంగా, ఆత్వవిశ్వాసంలో ఉండాలని కోరుకోవడం సహజం. అయితే మనకు తెలియకుండానే రోజూ చేసే 10 చిన్న చిన్న అలవాట్లు పురుష శక్తిని(Masculine Energy) నెమ్మదిగా బలహీనపరుస్తాయని రిలేషన్ షిప్ కోచ్ పద్మ పావని తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఒక వీడియోలో తెలిపారు. అయితే పురుష శక్తి అంటే ఇది శారీరక బలం గురించి కాదని.. ఇది మానసిక స్థైర్యం, భావోద్వేగ పరిపక్వత, జీవితంలో ముందుకు నడిపించే అంతర్గత శక్తికి సంబంధించినదని ఆమె తెలిపారు. మీలోని ఆ సహజమైన శక్తిని హరించివేస్తున్న 10 అలవాట్లు, పద్మ పావని చెబుతున్న సూచనలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఇప్పుడేం చేయాలి? అని నిరంతరం అడగడం
ఒక నిజమైన నాయకుడు ఇతరులు చెప్పే దాకా ఎదురు చూడడు. పరిస్థితిని గమనించి, అవసరాన్ని గుర్తించి, వెంటనే చొరవ తీసుకుంటాడు. ప్రతిదానికీ అనుమతి లేదా ఆదేశం కోసం ఎదురుచూడటం మీలోని నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని క్రమంగా చంపేస్తుంది. బాధ్యతను స్వీకరించండి, మార్గం చూపండి.

ప్రణాళికల్లో నిర్లిప్తంగా ఉండటం
నీ ఇష్టం, నీకు నచ్చినట్టు చేద్దాం వంటి మాటలు వినడానికి మర్యాదగా అనిపించవచ్చు. కానీ ప్రతిసారీ ఇలాగే అనడం వల్ల మీకు సొంత అభిప్రాయం, కోరికలు లేవనే సంకేతాన్ని పంపుతుంది. ఇది ఆకర్షణను దెబ్బతీస్తుంది. స్పష్టమైన దిశానిర్దేశం చేయడమే నిజమైన ఆకర్షణ. మీ అభిప్రాయాన్ని ధైర్యంగా చెప్పండి.
ప్రశంసల కోసం పాకులాడటం
పురుష శక్తి చప్పట్ల మీద, పొగడ్తల మీద ఆధారపడదు. అది అంతర్గతంగా వస్తుంది. కేవలం ఇతరులను మెప్పించడం కోసం లేదా గుర్తింపు కోసం కాకుండా ఏది సరైనదో దానిని చేయండి. మీ పనికి మీరే గర్వపడటం నేర్చుకోండి, బయటి నుంచి వచ్చే ప్రశంసలు కేవలం బోనస్ మాత్రమే అని పద్మ పావని చెబుతున్నారు.
ప్రతి విషయాన్ని వ్యక్తిగతంగా తీసుకోవడం
ఎవరైనా విమర్శించినా లేదా అభిప్రాయం చెప్పినా వెంటనే కుంగిపోవడం బలహీనత. అది మీ బలాన్ని కాదు, మీ అహంకారాన్ని దెబ్బతీస్తుంది. ఫీడ్ బ్యాక్ ను ఒక బహుమతిగా స్వీకరించండి. దాని నుండి నేర్చుకుని మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించాలని పద్మ పావని చెబుతున్నారు.
వివాదాలను, కష్టమైన సంభాషణలను తప్పించుకోవడం
సమస్యల నుండి పారిపోవడం తాత్కాలికంగా శాంతిని ఇవ్వొచ్చు కానీ ఆ సమస్యలు అంతర్గతంగా పేరుకుపోయి ఒకరోజు పెద్దగా పేలుతాయి. నిజమైన పురుషుడు కష్టమైన సంభాషణలను ఎదుర్కొంటాడు. ఆ వేడిని భరించి పరిష్కారం కోసం నిలబడతాడని పద్మ పావని చెప్పారు.
నో అని చెప్పలేకపోవడం
అవసరం లేని చోట, మీకు ఇష్టం లేని చోట అవును అని చెప్పడం దయ కాదు, అది మిమ్మల్ని మీరు వంచించుకోవడమే. ఇది మీ సమయాన్ని, శక్తిని హరించివేసి చివరికి అసహనానికి, కోపానికి దారితీస్తుంది. మీ హద్దులను మీరు గౌరవించుకోండి, అవసరమైనప్పుడు ధైర్యంగా నో(లేదు) అని చెప్పడం అలవాటు చేసుకోవాలి.
ఎప్పుడూ చిల్ గా, నింపాదిగా నటించడం
ప్రశాంతంగా ఉండటం వేరు, ప్రతిదానికీ ఉదాసీనంగా ఉండటం వేరు. ఇది స్థిరత్వం కాదు, జీవితం నుండి మిమ్మల్ని మీరు వేరు చేసుకోవడం. నిజమైన శక్తి అంటే యాక్టివ్ గా ఉండటం, పరిస్థితులకు స్పందించడం, నిష్క్రియాత్మకంగా ఉండటం కాదు.

మీ మానసిక స్థితికి భాగస్వామిని నిందించడం
మీ సంతోషానికి, బాధకు మీరే బాధ్యులు అవుతారు. అలాంటప్పుడు మీ మూడ్ బాగోలేకపోతే దానికి మీ భాగస్వామినో, పరిస్థితులనో నిందించడం బలహీనమైన మనస్తత్వానికి నిదర్శనం. మీ భావోద్వేగాలకు మీరే నాయకత్వం వహించండి. వాటిని అర్థం చేసుకుని, నియంత్రించడం నేర్చుకోండి.
ఉదయం రొటీన్ ని నిర్లక్ష్యం చేయడం
రోజును ఎలా ప్రారంభిస్తారో.. రోజంతా అలాగే ఉంటుంది. ఉదయాన్నే ఒక సరైన దినచర్య లేకపోతే ప్రపంచం సృష్టించే కల్లోలంలో మీరు కొట్టుకుపోతారు. వ్యాయామం, ధ్యానం, ప్రణాళిక వంటివి మిమ్మల్ని స్థిరంగా, శక్తివంతంగా ఉంచుతాయి.
స్వీయాభివృద్ధిని ఎగతాళి చేయడం
తమలోని లోపాలను సరిదిద్దుకోవడానికి ప్రయత్నించడాన్ని బలహీనతగా భావించడం పెద్ద పొరపాటు. సమస్యను అంగీకరించకుండా నిరాకరించడమే అసలైన బలహీనత. నిరంతరం నేర్చుకోవడం, మానసికంగా ఎదగడం అనేది పురుష శక్తికి పునాది. ఈ అలవాట్లను గుర్తించి, ఒక్కొక్కటిగా మార్చుకోవడం ద్వారా మీరు మీలోని సహజమైన శక్తిని, ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొందగలరని రిలేషన్ షిప్ కోచ్ పద్మ పావని అంటున్నారు.



Click it and Unblock the Notifications