Latest Updates
-
కండల వీరుడికి ఏమైంది? సల్మాన్ ఖాన్ ఇలా అయిపోడానికి కారణం అదేనా? -
ఈ సింపుల్ చిట్కాతో ఎంతటి నల్లటి కడాయి అయినా సరే.. కొత్తదానిలా మెరవాల్సిందే! -
అద్భుత శక్తులున్న 4 రామాలయాలు ఇవే! -
చుక్క పాలు లేకుండానే గడ్డ పెరుగు.. ఇలా సులభంగా తయారు చేయండి! -
కర్ణాటక స్టైల్ గ్రీన్ చికెన్ బిర్యానీ.. ఇలా చేస్తే ఫిదా అవ్వాల్సిందే! -
దరిద్రం పోయి అదృష్టం..జూలై 20 నుంచి ఈ 3 రాశులకు తిరుగుండదు! -
పల్లెటూరి స్టైల్ లో మట్టికుండలో చేపల కుర్మా..అన్నం, ఇడ్లీ, దోసె దేనిలోకైనా అదుర్స్! -
కళ్లు ఎర్రబడి, నీరు కారుతోందా? కండ్లకలక లక్షణాలు, నివారణ మార్గాలివే! -
వైజాగ్ లో కథ మాములుగా లేదుగా..దానికోసం ఏఐ తెగ వాడేస్తున్నారంట! -
నానబెట్టే పనిలేదు,పిండి రుబ్బే పనిలేదు.15 నిమిషాల్లో అటుకుల ఇడ్లీ..డయాబెటిస్ ఉన్నవారికీ బెస్ట్
మీ భర్త మీతో మాట్లాడటం లేదా? భార్యలు తెలుసుకోవాల్సిన నిజాలు!
చాలామంది మహిళలు తరచుగా తమ భర్త తమతో ఎక్కువగా మాట్లాడడని, ఏదైనా అడిగితేనే నోరు విప్పి సమాధానం చెబుతారని,మనస్సు విప్పి తమతో మాట్లాడరంటూ కంప్లెయింట్ చేస్తుంటారు. భార్యగా, తన భర్త తనతో అన్ని విషయాలూ పంచుకోవాలని, తను చెప్పేది శ్రద్ధగా వినాలని ప్రతి మహిళా కోరుకుంటుంది. నిజానికి ఏ బంధానికైనా ఇదే పునాది. మరి కొంతమంది భర్తలు ఎందుకు మౌనంగా ఉండిపోతారు? దీని వెనుక కారణాలేంటి? రిలేషన్ షిప్ నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం.
అంతర్ముఖ స్వభావం (Introvert Nature)
కొంతమంది పురుషులు సహజంగానే అంతర్ముఖులుగా ఉంటారు. అంటే వారు ఇతరులతో ఎక్కువగా కలవడం, మాట్లాడటం ఇష్టపడరు. ఇలాంటి స్వభావం ఉన్నవారు తమ భార్యతో కూడా ఎక్కువగా మాట్లాడకపోవచ్చు. ఇది వారి సహజ ప్రవర్తనలో భాగం. వారు ఎక్కువగా ఆలోచిస్తారు, తక్కువగా మాట్లాడతారు. మీ భర్త విషయంలో ఇదే కారణమైతే మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది వారి నైజమని అర్థం చేసుకుని వారికి కాస్త పర్సనల్ స్పేస్ ఇవ్వండి. అయితే మీరు మాత్రం మీ విషయాలన్నీ వారితో పంచుకుంటూ ఉండండి.

సామాజిక ఒత్తిడి
మన సమాజంలో అబ్బాయిలను పెంచే తీరు కూడా వారి మౌనానికి ఒక కారణం కావచ్చు. ఆడపిల్లలా ఏడవకు.. మగాడివి, ధైర్యంగా ఉండాలి,కుటుంబ భారం మోయాల్సింది నువ్వే ఇలాంటి మాటలతో పెరిగిన అబ్బాయిలు తమ భావాలను బయటకు వ్యక్తపరచడానికి సంకోచిస్తారు. బాధ కలిగినా, ఒత్తిడికి లోనైనా తమలో తామే కుమిలిపోతారు. పెళ్లయిన తర్వాత కూడా ఈ ధోరణి కొనసాగి, భార్యతో కూడా మనసు విప్పి మాట్లాడుకోలేకపోవచ్చు.
తీవ్రమైన ఒత్తిడి
మీ భర్త ఇంతకుముందు బాగానే మాట్లాడేవారై, హఠాత్తుగా మౌనంగా మారిపోయారా? అయితే ఇది తప్పకుండా ఆందోళన చెందాల్సిన విషయమే. పురుషులు సాధారణంగా కుటుంబ బాధ్యతలను తమ భుజాలపై వేసుకుంటారు. ఆర్థిక, సామాజిక ఒత్తిళ్లను ఎదుర్కొంటూ ఒక్కోసారి తీవ్రమైన మానసిక వేదనకు గురవుతారు. అయినా కూడా బయటకు చెప్పుకోరు. దీనివల్ల వారి మానసిక ఆరోగ్యం దెబ్బతిని, చిరాకుగా, నిశ్శబ్దంగా లేదా ఎప్పుడూ అలసిపోయినట్లు కనిపించవచ్చు. ఇలాంటి సమయంలో వారితో గొడవపడకుండా వారి సమస్యకు కారణం తెలుసుకుని వారికి అండగా నిలవండి.
అగౌరవ పరిచే ప్రవర్తన
కొంతమంది మహిళలు తమ భర్తల గురించి ఇతరుల ముందు, ముఖ్యంగా పిల్లల ముందు చులకనగా మాట్లాడటం, విమర్శించడం చేస్తుంటారు. ఇది పురుషుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంది. ఇంట్లో గౌరవం లభించనప్పుడు వారు భార్యతో మాట్లాడటానికి ఇష్టపడరు. క్రమంగా ఇంట్లో సమయం గడపడానికి కూడా ఆసక్తి చూపరు. వైవాహిక బంధం పరస్పర అవగాహన, గౌరవం మీద ఆధారపడి ఉంటుందని ప్రతి భార్య గుర్తుంచుకోవాలి. మీరు మీ భర్తను గౌరవిస్తే మీరు కూడా గౌరవం పొందుతారు.
మౌనాన్ని ఛేదించి, మాటలు కలిపేదెలా?
భర్త తక్కువగా మాట్లాడితే భార్యకు ఒంటరితనం ఆవహిస్తుంది. దీనివల్ల ఇద్దరి మధ్య అపార్థాలు పెరిగి గొడవలకు దారితీయవచ్చు. ఇది బంధాన్ని బలహీనపరుస్తుంది. కాబట్టి భార్యే చొరవ తీసుకుని భర్తతో మాట్లాడటం ప్రారంభించాలని కొందరు రిలేషన్ షిప్ నిపుణులు సూచిస్తున్నారు.
జడ్జ్ చేయడం ఆపండి
ముందుగా మీ భర్తను అంచనా వేయడం, విమర్శించడం మానేయండి.
ఆసక్తి చూపండి
ఈరోజు ఆఫీసులో ఎలా గడిచింది? నీకు నచ్చిన విషయాల గురించి చెప్పు అంటూ ఆసక్తిగా అడగండి. వారికి ఇష్టమైన అంశాలపై చర్చ మొదలుపెట్టండి.
సమయం కేటాయించండి
వీకెండ్ స్‌లో కలిసి డిన్నర్ కి వెళ్లడం, లాంగ్ డ్రైవ్ కు ప్లాన్ చేయడం వంటివి చేయండి.
ఓపిక అవసరం
ఒక్కరోజులోనే మార్పు రాకపోవచ్చు. ఓపికతో ప్రయత్నిస్తూ ఉండండి. ఇలా చేయడం వల్ల మీ భర్త మీతో మరింత సౌకర్యవంతంగా భావించి, తన మనసులోని మాటలను మీతో పంచుకోవడం ప్రారంభిస్తాడు.



Click it and Unblock the Notifications