Latest Updates
-
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా..
మీ బంధం నాశనం కాబోతుందని చెప్పే సంకేతాలివి.. జాగ్రత్త సుమీ!
మీ బంధంలోనూ ఈ సంకేతాలు కనిపిస్తుంటే మీరు కచ్చితంగా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. లేదంటే బంధం చెడిపోయే ప్రమాదం ఉంది.
ఏ ఇద్దరి వ్యక్తుల మధ్య అయినా బంధం చాలా సున్నితంగా ఉంటుంది. ముఖ్యంగా దంపతులు, ప్రేమికుల మధ్య ఉన్న బంధాలు మరింత సున్నితం. చూసేందుకు ఆ బంధాలు చాలా బాగున్నట్లే కనిపించిన.. కొన్నిసార్లు లోలోపల బంధం తెగిపోయే ప్రమాదాలు కూడా వస్తుంటాయి. వాటిని దంపతులు ఒకరికొకరు చెప్పుకోకుండా బంధాన్ని కొనసాగిస్తుంటారు.
దీంతో భాగస్వామి హర్ట్ అయినట్లు, తమ బంధంలో సమస్య ఉన్నట్లు మరొకరికి తెలియదు. అలాంటి సమయంలోనే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఇప్పుడు మేం చెప్పబోయే ఎనిమిది సంకేతాల మీ బంధంలోనూ ఉన్నట్లయితే మీరు కచ్చితంగా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. లేదంటే బంధం చెడిపోయే ప్రమాదం ఉంది.

అగౌరవ ప్రవర్తన:
ఎలాంటి బంధంలో అయినా ఒకరినొకరు గౌరవించుకోవడం చాలా ముఖ్యం. మీరు మీ భాగస్వామి ని తక్కువ చేసి మాట్లాడినా ఇష్టం వచ్చినట్లు పలిచినా... వారికి మీరు గౌరవం ఇవ్వట్లేదనే విషయం స్పష్టంగా అర్థం అవుతుంది. దీని ద్వారా మీ ఇద్దరి మధ్య గొడవలు వచ్చే ప్రమాదం ఉంది.
కమ్యూనికేషన్ లేకపోవడం:
కమ్యూనికేషన్ అనేది ఓ బలమైన బంధానికి పునాది. భాగస్వాములిద్దరూ మనసు విప్పి పది నిమిషాలు అయినా సరే అన్ని మాట్లాడుకుంటే చాలా సమస్యలు తొలగిపోతాయి. కానీ వచ్చిన సమస్యలు చర్చింకుండా అలాగే ఉంటే.. అవే పెద్ద పెద్ద సమస్యలుగా మారిపోతాయి. మీ బంధాన్ని విడదీసే స్థాయికి పెరుగుతాయి.
స్వేచ్ఛను నియంత్రించడం:
మీరు ఏదైనా పని చేయాలనకున్నప్పుడు లేదా మీరు ఏవైనా మీకు సంబంధించిన నిర్ణయాలు తీసుకున్నప్పుడు మీ భాగస్వామి మిమ్మల్ని ఆ పని చేయనీయకపోతే కొంచెం ఆలోచించాల్సిందే. ఇలాంటి వారు మీ స్వేచ్ఛకు భంగం కల్గించినవారవుతారు.
మోసం:
మోసం అనేది నమ్మకాన్ని పూర్తిగా దెబ్బతీస్తుంది. జీవితంలో ఒకసారి ఎవరి వల్లైనా మోసపోతే వారిని మళ్లీ నమ్మడం చాలా కష్టం. మీ బంధంలో ఇలాంటివి జరగకుండా చూస్కోండి.

భావోద్వేగ మద్దతు లేకపోవడం:
ఆరోగ్యకరమైన బంధంలో కష్ట సమయాల్లో భాగస్వాములు ఒకరికొకరు తోడు ఉండాలి. మీరు ఏడుస్తున్నా, కష్టాల్లో ఉన్నా మీ భాగస్వామి పట్టించుకోవడం లేదంటే మీ బంధం ఎలా ఉందో మీరు ఓసారి సరిచూసుకోవాల్సిందే.
క్షమాపణ చెప్పకపోవడం:
మనిషి అనే వాడు కచ్చితంగా తప్పు చేస్తాడు. ఎలాంటి బంధంలో అయినా చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి. అయితే అలాంటివి చేసినప్పుడు క్షమాపణ చెప్పడానికి ముందుకు రావాలి. అలా రావట్లేదంటే మీరు మీ భాగస్వామికి గౌరవం ఇవ్వడం లేదని అర్థం.
కోపాన్ని నియంత్రించుకోకపోవడం:
మీ భాగస్వామికి కోపం ఎక్కువై.. తరచుగా మీ మీద అరుస్తున్నట్లుయితే... ఆ బంధం సురక్షితం కాదని మీరు ఫీలయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి ప్రవర్తన భాగస్వామి శారీరక, మానసిక ఆరోగ్యానికి చాలా హానీకరం.
విభిన్న జీవిత లక్ష్యాలు:
మీకు మీ భాగస్వామికి ఒకే విధమైన జీవిత లక్ష్యాలు, ప్రాధాన్యతలు ఉంటే చాలా మంచిది. కానీ ఇద్దరి దారులు వేరైతే అనేక రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి వాటి వల్ల మీ బంధంలో తరచుగా సమస్యలు వస్తాయి.



Click it and Unblock the Notifications