Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
దంపతుల మధ్య సంబంధం హ్యాపీగా, సంతృప్తిగా సాగాలంటే ఇలా చేయండి
సంబంధం సంక్లిష్టమైనది.. అదే సమయంలో అత్యంత మధురమైనది. రెండు వ్యక్తిత్వాలు కలిగిన ఇద్దరు వ్యక్తులు పెళ్లి బంధంతో ఒక్కటై జీవితాంతం కలిసి ఉండటం.. అంత సులువేం కాదు. ఇద్దరు వ్యక్తులు వారి కోరికలు, ఆశలు, ఆశయాలు, అనుభవాలు, ఆలోచనలు, భావోద్వేగాలు, ఇష్టాయిష్టాలు ఇలా అన్నీ వేర్వేరుగా ఉంటాయి. అలాంటి వ్యక్తులు పెళ్లి బంధంతో ఒక్కటై.. శారీరకంగా, మానసికంగా కలిసి ఉండటం.. జీవితాన్ని సాఫీగా సాగించడం అనుకున్నంత సులువేం కాదు.
ఒక రోజు కాకపోయిన మరోరోజు ఏదో ఒక విషయంలో దంపతుల మధ్య కలహాలు జరుగుతాయి. అలకలు, అభిప్రాయభేదాలు, ఆలోచనలా సరళులు విభిన్నంగా ఉంటాయి. ఏదైనా విషయంలో గొడవలు జరుగుతాయి. అలాంటి కలహాలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటూ సాఫీగా, హ్యాపీగా జీవితంలో ముందుకు సాగడమే దాంపత్యబంధం అంటే.

ఏదైనా గొడవ జరిగినపపుడు ఇద్దరిలో ఎవరో ఒకరు రాజీ పడాల్సి వస్తుంది. అయితే దంపతుల్లో ఎవరో ఒకరు ఎప్పటికీ రాజీ పడుతూ ఉండటం కూడా మంచిది కాదు. దాంపత్యబంధంలో సంతోషం, సంతృప్తి లేకపోతే దానికి కారణం ఏమిటో గుర్తించి పరిష్కరించుకునేందుకు ప్రయత్నించాలి. భాగస్వాముల మధ్య తరచూ కలహాలు జరుగుతున్నా, ఇద్దరూ సంతోషంగా లేకపోయినా ఏం చేయాలో తెలుసుకోవడం ముఖ్యం.
మనసు విప్పి మాట్లాడుకోవాలి:
దంపతుల మధ్య కమ్యూనికేషన్ బాగుండాలి. భార్యాభర్తల మధ్య ఆలోచనలు, కోరికలు అన్ని పంచుకోవాలి. అపార్థాలు, అపోహలు లేకుండా ఉండాలంటే మనసులో ఏమనుకుంటున్నారో చెప్పాలి. ఇష్టాలు, అయిష్టాలు అన్నింటి గురించి చెబితేనే వారు మీతో ఎలా మెలగాలో తెలుసుకుంటారు. మనసు విప్పి మాట్లాడుకోవాలి.
భాగస్వామిని అర్థం చేసుకోవాలి:
మంచైనా, చెడు అయినా భాగస్వామిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. గొడవలు జరిగితే దానికి కారణం ఏమిటో తెలుసుకోవాలి ఎదుటివారు అలా ప్రవర్తించడానికి కారణం ఏమిటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
గొడవలు, కలహాలు హద్దు మీరొద్దు:
భార్యాభర్తల మధ్య గొడవలు చాలా సాధారణం. ప్రతి దంపతుల మధ్య ఎప్పడో ఒకప్పుడు కలహాలు జరుగుతూనే ఉంటాయి. అయితే గొడవలు జరిగినప్పుడు అది హద్దుల్లోనే ఉండేలా చూసుకోవడం ముఖ్యం. కోపంలో, ఆవేశంలో నోరు జారకూడదు. కొన్ని కొన్ని మాటల వల్ల బంధానికే బీటలు వారుతాయి.
పాత గాయాలను గుర్తు చేసుకోవద్దు:
గతంలో జరిగిన మధురమైన అనుభూతులను మాత్రమే గుర్తు చేసుకోవాలి. ఎప్పుడో జరిగిన గొడవలు, కలహాల గురించి నెమరువేసుకోవడం వల్ల మనసు పాడవుతుంది. అలా గుర్తు చేసుకుంటే ప్రస్తుత జీవితం ప్రభావితం అవుతుంది. సంతోషం స్థానంలో బాధ వచ్చి చేరుతుంది. అందుకే పాత గొడవలను గుర్తు చేసుకోవడం మంచిది కాదు.
ప్రశంసలు, కృతజ్ఞతలు ముఖ్యం:
భార్యాభర్తల మధ్య ప్రశంసలు, కృతజ్ఞతలు తప్పకుండా ఉండాలని అంటారు నిపుణులు. ఏదైనా నచ్చిన వంటకం వండినా, ఏదైనా సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చినా, ఏదైనా మేలు చేసే పని చేసినా తప్పకుండా కృతజ్ఞతలు చెప్పాలి, ప్రశంసించాలి.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications